Early Diabetes Symptoms: బీ అలర్ట్.. డయాబెటిస్‌ వచ్చే ముందు మీ చర్మంపై కనిపించే లక్షణాలు ఇవే!

సాధారణంగా రక్తంలో అధిక చక్కెర స్థాయిలు ఉంటే దానిని డయాబెటిస్‌గా పరిగణిస్తారు. అయితే టైప్ 2 డయాబెటిస్‌ అనేది అత్యంత సాధారణమైనది. ఇది ఆహారం, జీవనశైలితో ముడిపడి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఈ వ్యాధి ఉంది. మధుమేహం ఒకసారి వచ్చిందంటే సుదీర్ఘకాలం పాటు..

Early Diabetes Symptoms: బీ అలర్ట్.. డయాబెటిస్‌ వచ్చే ముందు మీ చర్మంపై కనిపించే లక్షణాలు ఇవే!
Early Diabetes Symptoms On Skin

Updated on: Nov 19, 2025 | 1:26 PM

నేటి జీవనశైలి కారణంగా అధిక మంది డయాబెటిస్ బారీన పడుతున్నారు. రక్తంలో అధిక చక్కెర స్థాయిలు ఉంటే దానిని డయాబెటిస్‌గా పరిగణిస్తారు. అయితే టైప్ 2 డయాబెటిస్‌ అనేది అత్యంత సాధారణమైనది. ఇది ఆహారం, జీవనశైలితో ముడిపడి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఈ వ్యాధి ఉంది. మధుమేహం ఒకసారి వచ్చిందంటే సుదీర్ఘకాలం పాటు ఒంట్లోనే తిష్ట వేస్తుంది. అయితే దీని లక్షణాలు మన ఒంటి చర్మం ద్వారా వ్యక్తమవుతాయని చాలా మందికి తెలియదు. దీని ప్రారంభ సంకేతాలు సాధారణంగా బయటకు గుర్తించడం సాధ్యం కాదు. కానీ వెంటనే గుర్తిస్తే రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా నిర్వహించడంలో సహాయపడుతుంది.

చర్మంపై గోధుమ రంగు మచ్చలు

చర్మంపై కనిపించే చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు మధుమేహం వ్యాధి ప్రారంభ లక్షణాలను సూచిస్తాయి. ఈ మచ్చల రంగు క్రమంగా మారుతున్నట్లయితే దీనిని ముందస్తు హెచ్చరికగా పరిగణించాలి.

డార్క్ ప్యాచ్ అలర్ట్

మెడ మీద లేదా చంకల కింద కనిపించే నల్లటి మచ్చలు కూడా మధుమేహాన్ని సూచిస్తాయి. డయాబెటిస్‌ ప్రారంభంలో హైపర్పిగ్మెంటేషన్ ఈ ప్రాంతాల్లో క్రమంగా అభివృద్ధి చెందుతుంది. ఈ నల్ల మచ్చలు కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి ముందస్తు సూచికలుగా పనిచేస్తాయి.

ఇవి కూడా చదవండి

పసుపు రంగు గడ్డల హెచ్చరిక

చర్మంపై పసుపు రంగు గడ్డలు కనిపిస్తే వాటిని విస్మరించడం అంత మంచిది కాదు. కళ్ళ చుట్టూ కొవ్వు పేరుకుపోతే దానిని జాంతోమాస్ అని పిలుస్తారు. ఇది కొన్నిసార్లు మధుమేహాన్ని కూడా సూచిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగాయని సూచించే ప్రమాద హెచ్చరిక.

పొడి చర్మం

పొడిబారిన, గరుకుగా మారిన చర్మం కూడా మధుమేహానికి సంకేతం కావచ్చు. రక్తంలో అధిక చక్కెర స్థాయిలు ఉంటే చర్మం నిర్జలీకరణానికి కారణమవుతాయి. ఇవి చర్మంలోని తేమను తగ్గిస్తాయి. అసౌకర్యంతో ఇతర సమస్యలకు దారితీస్తాయి.

నెమ్మదిగా నయం అయ్యే గాయాలు

అసాధారణంగా శరీరంపై ఎక్కడైనా గాయం అయితే వారం రోజుల్లో నయమవుతుంది. కానీ గాయం మానడానికి ఎక్కువ సమయం పడితే దీన్ని మధుమేహ వ్యాధిగా అనుమానించాల్సిందే. రక్తంలో అధిక చక్కెర రోగనిరోధక ప్రతిస్పందనను ప్రభావితం చేస్తుంది. ఇది వైద్యం ప్రక్రియను నెమ్మదింప చేస్తుంది. ఇది సంభావ్య అంతర్లీన సమస్యలకు సూచిక.

దురద

మధుమేహం ఉన్న కొంతమందికి చర్మంపై నిరంతరం దురద పెడుతుంది. ఈ లక్షణాన్ని విస్మరించకూడదు. ఎందుకంటే ఇది అంతర్లీన రక్తంలో చక్కెర సమస్యలను సూచిస్తుంది.

చర్మంపై ఈ లక్షణాలలో దేనినైనా గమనించినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన అన్ని టెస్ట్‌లు చేయించాలి. తద్వారా మీకు డయాబెటిస్ ఉందో లేదో నిర్ధారించుకోవచడం సాధ్యం అవుతుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.