రాత్రి నిద్రకు ముందు గ్లాసుడు పాలు తాగే అలవాటు మీకూ ఉందా?
ఆయుర్వేదం ప్రకారం రాత్రిపూట పాలు తాగడం వల్ల కలిగే కొన్ని ప్రత్యేక ప్రయోజనాల గురించి నిపుణులు ఇక్కడ వివరించారు. నిజానికి, రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం వల్ల రోజంతా పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి చిటికెలో మాయం..

చాలా మంది రాత్రి నిద్రకు ముందు గ్లాసుడు గోరువెచ్చని పాలు తాగే అలవాటును పాటిస్తారు. ఆయుర్వేదం ప్రకారం రాత్రిపూట పాలు తాగడం వల్ల కలిగే కొన్ని ప్రత్యేక ప్రయోజనాల గురించి నిపుణులు ఇక్కడ వివరించారు. నిజానికి, రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం వల్ల రోజంతా పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి చిటికెలో మాయం అవుతుంది. మనసును ప్రశాంతపరిచి, మంచి నిద్రను ప్రేరేపిస్తుంది. పాలలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది శరీరం సెరోటోనిన్, మెలటోనిన్ అనే హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఇవి మనస్సును ప్రశాంతపరుస్తాయి. లోతైన, ప్రశాంతమైన నిద్రను ప్రోత్సహిస్తాయి.
ఎముకలకు దృఢత్వం
పాలలో ఉండే కాల్షియం, విటమిన్ డి ఎముకలు, దంతాలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. రాత్రిపూట దీనిని తీసుకోవడం వల్ల శరీరం నిద్రపోతున్నప్పుడు పోషకాలను బాగా గ్రహించడంలో సహాయపడుతుంది.
జీర్ణక్రియకు మేలు
గోరువెచ్చని పాలు జీర్ణ ప్రక్రియను సులభతరం చేస్తాయి. ఆయుర్వేదం ప్రకారం.. ఇది శరీరంలోని పిత్త, వాత దోషాలను తగ్గిస్తుంది. తద్వారా అజీర్ణం లేదా ఆమ్లతను తగ్గిస్తుంది.
రోగనిరోధక శక్తి పెంపు
పాలలో ప్రోటీన్, విటమిన్ బి12 వంటి ఇతర ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినిస్తాయి. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.
పాలలో పసుపు కలిపితే కడుపులో మంటను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అదే పాలలో తేనె కలిపితే, అది నరాలకు విశ్రాంతినిస్తుంది. దీనితో పాటు చాలా మంది ఏలకులు లేదా జాజికాయ పొడి కలుపుకుని పాలు తాగుతారు. ఇది పాలకు మంచి రుచిని కలిగించడమేకాదు వేగంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.
వీరు రాత్రిపూట పాలు తాగకూడదు?
లాక్టోస్ సమస్యలు ఉన్నవారు, తరచుగా గుండెల్లో మంట లేదా అసిడిటీతో బాధపడేవారు.. డాక్టర్‌ను సంప్రదించకుండా పాలు తాగకూడదని నిపుణులు సలహా ఇస్తున్నారు. శరీర స్థితిని బట్టి పాలు కొందరి ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.




