Tulsi Milk Benefits: తులసి పాలు తాగితే.. ఈ రోగాలు మటుమాయం..! లాభాలు తెలిస్తే వదలరు..

|

Apr 04, 2024 | 8:32 AM

తులసిలోని యాంటీమైక్రోబియల్ గుణాల వల్ల స్కిన్ ఎలర్జీ, మొటిమల వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు.. చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. సంతానోత్పత్తిని వేగవంతం చేయడంలో కూడా తులసి సహాయపడుతుంది. పాలలో తులసిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సంతానోత్పత్తికి మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. 

Tulsi Milk Benefits: తులసి పాలు తాగితే.. ఈ రోగాలు మటుమాయం..! లాభాలు తెలిస్తే వదలరు..
Tulsi Milk
Follow us on

Tulsi Milk Benefits: అందరూ ఉదయాన్నే పాలు, డికాక్షన్‌ కలిపి తయారు చేసే టీ తాగేందుకు ఇష్టపడతారు. అయితే, ఈ టీని వేరేలా ఎందుకు ప్రయత్నించకూడదు..? అదే తులసిపాల గురించి..అనేక ఔషధ విలువలను కలిగి ఉన్న తులసికి ఆధ్యాత్మికం, ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత ఉంది. తులసిని పవిత్రమైన ఔషధ మూలికగా పరిగణిస్తారు. ఆయుర్వేదం ప్రకారం, అన్ని వ్యాధులకు తులసి దివ్యౌషధంగా పనిచేస్తుందని చెబుతారు..తులసి చెట్టు ఇంట్లో పెట్టుకుంటే శుభమని చాలామంది భావిస్తారు. అలాంటి తులసి అనేక చికిత్సలకు ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. ఈ ఆకులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే తులసి ఆకులను పాలలో మరిగించి తాగడం వల్ల కూడా ఎంతో ఆరోగ్యం అంటున్నారు నిపుణులు. ఇలా వాడితే అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. వయసుతో నిమిత్తం లేకుండా అందరూ పాలు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాంటప్పుడు తులసి, పాలు కలిపి తాగితే రెట్టింపు లాభాలు వస్తాయనడంలో సందేహం లేదంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. తులసి పాలలో పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. తులసి ఆకులను పాలలో వేసి మరిగించి తాగడం వల్ల తలనొప్పి, మైగ్రేన్‌ నుంచి విముక్తి పొందవచ్చు. ఈ సమస్యతో బాధపడేవారు రోజూ తులసి పాలు తాగడం చాలా మంచిదని చెబుతున్నారు. ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు ఉన్నవారు కూడా తులసి పాలు తాగితే ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. తులసి రోగ నిరోధక శక్తిని పెంచడానికి, రోగాలను నయం చేయడానికి సహాయపడుతుంది. రోజూ తులసి ఆకులు మరిగించిన పాలు తాగడం వల్ల జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది.

తులసి ఆకులలో రోగనిరోధక శక్తి పెంచే గుణాలు ఉన్నాయి. తులసి పాలు తాగడం వల్ల వీటిలోని యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో తులసి పాలు తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె సంబంధ వ్యాధులు రాకుండా ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. కిడ్నీలో రాళ్లతో బాధపడేవారు తులసి పాలు తాగడం మంచిది. తులసి ఆకుల్ని పాలలో వేసి మరిగించి తాగడం వల్ల కిడ్నీలో రాళ్లతో పాటు కిడ్నీనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆస్తమా, సైనస్ వంటి శ్వాస సమస్యలతో బాధపడేవారికి తులసి పాలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. వాతావరణం వల్ల కలిగే ముక్కుదిబ్బడ సమస్య కూడా తగ్గించుకోవచ్చు. పాలలోని పోషకాలు, తులసిలోని యాంటీమైక్రోబియల్ గుణాల వల్ల స్కిన్ ఎలర్జీ, మొటిమల వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు.. చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. సంతానోత్పత్తిని వేగవంతం చేయడంలో కూడా తులసి సహాయపడుతుంది. పాలలో తులసిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సంతానోత్పత్తికి మంచిదని ఆయుర్వేదం చెబుతోంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..