మధ్యాహ్నం లంచ్‌ చేశారా..? ఒక గ్లాసు మజ్జిగ తాగండి చాలు..! ఎన్ని లాభాలో తెలిస్తే..

మజ్జిగ వేసవికి ప్రియమైన పానీయమే కాకుండా, అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది ప్రోబయోటిక్స్‌తో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తక్కువ క్యాలరీలతో బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. మజ్జిగ శరీరాన్ని చల్లబరిచి, హైడ్రేట్ చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని రక్షించి, వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తాయి. భోజనం తర్వాత మజ్జిగ తీసుకోవడం అత్యంత ప్రయోజనకరం.

మధ్యాహ్నం లంచ్‌ చేశారా..? ఒక గ్లాసు మజ్జిగ తాగండి చాలు..! ఎన్ని లాభాలో తెలిస్తే..
Buttermilk

Updated on: Dec 17, 2025 | 5:33 PM

మజ్జిగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వేసవిలో చాలా మందికి ఇష్టమైన పానీయం. ఈ పులియబెట్టిన పాల పానీయం దాని తాజా రుచి, శరీరాన్ని లోపలి నుండి చల్లబరుస్తుంది. ఇది కేవలం శరీరాన్ని చల్లబరిచే పానీయం మాత్రమే కాదు.. అనేక పోషక విలువలు, ఔషధ గుణాలు కలిగిన సంపూర్ణ ఆహారం మజ్జిగ. శరీరానికి అపారమైన ప్రయోజనాలను అందిస్తుంది. జీర్ణక్రియ, బరువు తగ్గడానికి సహాయపడటం నుండి ఎముకల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం వరకు ఇది మీ ఆరోగ్యానికి అనేక లాభాలను కలిగిస్తుంది. మజ్జిగను రోజులో ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. అయితే, దాని ప్రయోజనాలను పెంచుకోవడానికి, భోజనం తర్వాత తాగడం మరీ మంచిది. మధ్యాహ్నం లంచ్‌ సమయంలో ఒక గ్లాస్‌ మజ్జిగ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం..

మధ్యాహ్న భోజనంలో మజ్జిగను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. మజ్జిగలోని ఆరోగ్యకరమైన బాక్టీరియా (ప్రోబయోటిక్స్), లాక్టిక్ ఆమ్లం పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది ఆహార పదార్థాలను సులభంగా విచ్ఛిన్నం చేసి, పోషకాలను గ్రహించడానికి సహాయపడుతుంది. అలాగే.. అజీర్తి, వాయువు, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తాయి. పాల బదులు మజ్జిగ తాగితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మజ్జిగలో ప్రో బయోటిక్స్ ఉంటాయి. ఇవి మీ శరీరంలో గట్ బ్యాక్టీరియా పెంచుకునే అవకాశం కలుగుతుంది.

మజ్జిగలో ప్రోబయోటిక్స్, వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. దీని వలన హైడ్రేటెడ్‌గా ఉంటారు. ఇటీవల కొన్ని పరిశోధనల ప్రకారం, రెగ్యులర్‌గా మజ్జిగా తాగడం వలన LDL కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీని వలన రక్తప్రసరణ నియంత్రణలో ఉంటుంది, గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. మజ్జిగలో కూడా అతి తక్కువ మొత్తంలో క్యాలరీలు ఉంటాయి. అంతేకాదు మజ్జిగ ప్రోబయోటిక్ పదార్థం. ఇది మీ శరీరంలో గట్ బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. శరీర బరువు నియంత్రణలో ఉండాలనుకునే వారు రెగ్యులర్‌గా మజ్జిగా తాగడం మంచిది. ఇందులో ఫ్యాట్ కంటెంట్ తక్కువ, పోషకాలు సమృద్దిగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మజ్జిగ తాగడం వలన శరీరం చల్లబడుతుంది, దీని వలన శరీరం రీఫ్రెష్‌గా, హైడ్రేటెడ్‌గా ఉంటుంది. మజ్జిగలో లాక్టిక్ యాసిడ్, గట్ హెల్త్‌కు మేలు చేసే బాక్టీరియా ఉంటుంది. దీని వలన జీర్ణశక్తి పెరుగుతుంది,గట్ హెల్త్ మెరుగవుతుంది. మజ్జిగలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, దీని వలన శరీరం కూల్‌గా, హైడ్రేటెడ్‌గా ఉంటుంది. గట్ హెల్త్ మెరుగవడంతో పాటు, కడుపు ఉబ్బరం,మలబద్దకం తగ్గుతుంది.

వృద్ధాప్యం అనేది సహజమైన ప్రక్రియ. కానీ, కొన్ని ఆహారాలు, పానీయాలు ఈ ప్రక్రియను నెమ్మదింపజేయడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ ఒక గ్లాసు మజ్జిగ తాగడం వల్ల వృద్ధాప్య సంకేతాలను తగ్గించవచ్చు. మజ్జిగలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి మీ చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి. ముఖంపై ముడతలు, మచ్చలను తగ్గిస్తాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..