
కొన్ని రకాల విష పురుగులు ఇంటి చుట్టూ తిరగడం సహజం. కానీ ఈ విష పురుగులు కరిస్తే ఖచ్చితంగా ప్రాణం పోతుంది. అయితే కాటు వేసిన కొన్ని క్షణాల పాటు కాటుకు గురైన వ్యక్తి శరీరం ఆ విషాన్ని తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది. ఆ సమయంలో ఆ విషాన్ని వెంటనే ఎలా తొలగించాలో తెలిస్తే ప్రాణాలు నిలబెట్టవచ్చు. ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగా తేళ్లు ఇంటి చుట్టూ తిరుగుతుంటాయి. తేలు కాటుకు గురైతే ఏమి చేయాలి? శరీరం నుంచి విషాన్ని ఎలా తొలగించాలి? వంటి విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..
ఆయుర్వేద డైరెక్టర్, సీనియర్ ఆయుర్వేదచార్య డాక్టర్ ప్రతాప్ చౌహాన్ తేలు కాటుకు గురైతే ఏమి చేయాలో వివరించారు. తేలు విషం ప్రాణాంతకం కాదని.. కానీ వాపు, దురద, తీవ్రమైన నొప్పి, కొన్నిసార్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయని ఆయన అన్నారు. తేలు కాటుకు గురైన వెంటనే సరైన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. తద్వారా విషం శరీరంలో వ్యాపించదు. తద్వారా ఉపశమనం లభిస్తుంది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.