AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: శృంగారం విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? అయితే జాగ్రత్త అంటోన్న నిపుణులు..

Lifestyle: మారుతోన్న జీవన విధానంతో మనుషులు జీవితాలు గజిబిజీగా మారిపోతున్నాయి. ఉద్యోగం, భవిష్యత్తు లక్ష్యాలు ఇలా కారణం ఏదైనా నిత్యం ఒత్తిడి పొత్తిళ్లలో నలిగిపోతున్నారు. యాంత్రికంగా మారుతోన్న...

Lifestyle: శృంగారం విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? అయితే జాగ్రత్త అంటోన్న నిపుణులు..
Narender Vaitla
|

Updated on: Aug 04, 2022 | 8:04 PM

Share

Lifestyle: మారుతోన్న జీవన విధానంతో మనుషులు జీవితాలు గజిబిజీగా మారిపోతున్నాయి. ఉద్యోగం, భవిష్యత్తు లక్ష్యాలు ఇలా కారణం ఏదైనా నిత్యం ఒత్తిడి పొత్తిళ్లలో నలిగిపోతున్నారు. యాంత్రికంగా మారుతోన్న మనిషి జీవితంలో శృంగారం కూడా యాంత్రికంగా మారే రోజులు వచ్చేస్తున్నాయి. ఒత్తిళ్లతో కూడిన జీవితంలో శృంగారాన్ని కూడా సరిగ్గా ఆస్వాదించడం లేదు.

అయితే ఇది ఎక్కువ కాలం కొనసాగితే ఎన్నో సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. శృంగారాన్ని యాంత్రికంగా కాకుండా మనసుతో చేయాలని చెబుతున్నారు. అయితే శృంగారం పాల్గొనే సమయంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయొద్దని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

* శృంగారంలో పాల్గొనే ముందు కచ్చితంగా స్నానం చేసి, శుభ్రంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అలా అయితేనే మీ భాగస్వామికి మీతో ఎక్కువ సమయం గడపాలనే కోరిక ఉంటుంది.

ఇవి కూడా చదవండి

* ఇందకే చెప్పుకున్నట్లు అసలే గజిబిజీ జీవితాలు దీంతో శృంగారాన్ని కూడా తూతూ మంత్రంగా చేసేస్తున్నారు. అయితే ఈ విషయంలో అలాంటి తప్పు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. శృంగారం విషయంలో కంగారును పక్కన పెట్టి స్లో అండ్‌ స్టడీ విధానాన్ని ఫాలో కావాలని చెబుతున్నారు.

* ఒత్తిడి కారణంగా కొంత మంది శృంగారానికి ప్రాధాన్యత ఇవ్వడం మానేశారు. ఎప్పుడో ఒకసారి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే ఆ పని అనే ఆలోచనలో ఉంటున్నారు. అయితే ఇలా చేయడం వల్ల దంపతుల మధ్య దూరం పెరిగే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రొమాంటిక్‌ లైఫ్‌ బాగున్న కపుల్స్‌ నిత్యం సంతోషంగా ఉంటారని ఎన్నో సర్వేలు చెబుతున్నాయి.

* ఇక శృంగారం చేస్తున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లో మీ భాగస్వామిని ఇతరులతో పోల్చకూడదని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల వారి ఆత్మ గౌరవం దెబ్బ తినడమే కాకుండా, మీతో మరోసారి గడపడానికి ఇష్టపడరు.

* కొందరు ఏక పక్షంగా తమ ఇష్టాలను తీర్చుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అయితే ఇలా చేయడం ద్వారా మీ పాట్నర్‌కు మీపై వ్యతిరేక భావన కలిగే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భాగస్వామికి ఇష్టం లేని పనులు చేయమని ఫోర్స్‌ చేయకూడదని సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..