AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dogs: కుక్కలు వాహనాల టైర్లపై మాత్రమే మూత్రం ఎందుకు పోస్తాయి? వామ్మో దీని వెనుక ఇంత అర్థం ఉందా?

Dogs: కుక్కలు మూత్రం ఎక్కడోపోయకుండా కేవలం కారు, బైక్‌, లేదా గోడలపై అలాగే కరెంటు స్తంభాలపై మాత్రమే ఎందుకు పోస్తాయని మీరెప్పుడైనా ఆలోచించారా? కుక్కల ఈ వింత ప్రవర్తన వెనకున్న కారణాలు ఎన్నో ఉన్నాయంటున్నారు జంతు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుక్కల..

Dogs: కుక్కలు వాహనాల టైర్లపై మాత్రమే మూత్రం ఎందుకు పోస్తాయి? వామ్మో దీని వెనుక ఇంత అర్థం ఉందా?
Dog
Subhash Goud
|

Updated on: Aug 15, 2026 | 5:17 PM

Share

Dogs: కుక్కలు అందరికీ ఇష్టమైన జంతువులు. చాలా ఇళ్లలో కుక్కలను ప్రేమించేవారు ఉంటారు. మనం ఇంటిముందు లేదంటే ఎక్కడైనా బయట బైక్ లేదా కారు పార్క్ చేసినప్పుడు టైర్లపై కుక్కలు మూత్రం పోయడం మీరు గమనించే ఉంటారు. చుట్టూ ఖాళీ ప్రదేశం ఉన్నా కుక్కలు వాహనాల టైర్లపైనే ఈ పని చేస్తుంటాయి. మరి దారెంట మూత్రం ఎక్కడోపోయకుండా కేవలం కారు, బైక్‌, లేదా గోడలపై అలాగే కరెంటు స్తంభాలపై మాత్రమే ఎందుకు పోస్తాయని మీరెప్పుడైనా ఆలోచించారా? కుక్కల ఈ వింత ప్రవర్తన వెనకున్న కారణాలు ఎన్నో ఉన్నాయంటున్నారు జంతు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుక్కల నిపుణులు కుక్కల ప్రవర్తనపై విస్తృతమైన పరిశోధనలు నిర్వహించారు. కుక్కలు చెట్లు, స్తంభాలు, కారు టైర్లు లేదా ఇంటి మూలల్లో మూత్ర విసర్జన చేయడానికి ఇష్టపడటానికి గల కారణాలను గుర్తించారు.

తమ భూభాగం కోసం..

కుక్కలు మూత్రవిసర్జన ద్వారా తమ భూభాగాన్ని గుర్తించుకుంటాయి. ఆ ప్రాంతం ఎవరిదో ఇతర కుక్కలకు తెలియజేయడానికి అవి ఆ ప్రదేశాలలో మూత్రవిసర్జన చేస్తాయట. ఇతర ప్రాంతాల కుక్కలు తమ భూభాగంలోకి ప్రవేశించడాన్ని కుక్కలు సహించవు. ఈ విషయాన్ని మీరు చాలాసార్లు గమనించి ఉండవచ్చు. దీనికి మరో కారణం ఏమిటంటే, కుక్కలు నిలువు ఉపరితలాలు లేదా వస్తువులపై మూత్రవిసర్జన చేయడానికి ఇష్టపడతాయి. అవి తరచుగా నేలపై మూత్రవిసర్జన చేయడానికి దూరంగా ఉంటాయి.

అయితే కుక్కలు తమ భూభాగాన్ని గుర్తించడానికి, ఇతర కుక్కలకు తమ ఉనికిని తెలియజేయడానికి మూత్రాన్ని ఇలాంటి పని చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. వాహనాల టైర్లపై మూత్రం పోయడం ద్వారా ఓ సందేశాన్ని ఇతర కుక్కలకు చేరవేస్తాయట. ఇలా ఒక కుక్క టైర్‌పై మూత్రం పోయడం వెనక తన పరిధిని విస్తరింపజేసుకోవడమే ప్రధాన కారణమట. ఈ ప్రవర్తన ముఖ్యంగా మగ కుక్కలలో ఎక్కువగా కనిపిస్తుందంటున్నారు.

ఇవి కూడా చదవండి

నేలపై పోయడానికి ఎందుకు ఇష్టపడవు:

కుక్కలు నేలపై మూత్రవిసర్జన చేయడానికి ఇష్టపడవు. నేలపై మూత్రం వాసన ఎక్కువసేపు ఉండదు. అలాగే త్వరగా ఆవిరైపోతుంది. అయితే, రబ్బరు టైర్లపై వాసన ఎక్కువసేపు ఉంటుంది. దీనికి ఒక కారణం ఏమిటంటే కుక్కలు కార్ టైర్ల వాసనను చాలా ఇష్టపడతాయి. అందుకే అవి తరచుగా వాటిపై మూత్రవిసర్జన చేస్తూ కనిపిస్తాయి. వాటి శరీర నిర్మాణం కారణంగా, అవి స్తంభాలు, చెట్లు లేదా ఇళ్ల మూలల్లో మూత్రవిసర్జన చేయడానికి మరింత సౌకర్యవంతంగా భావిస్తాయి.

మూత్రం ద్వారా కుక్కల సమాచారా మార్పిడి..

కుక్కల మూత్రం కేవలం వ్యర్థపదార్థం కాదు.. ఇది ఇతర కుక్కలకు అనేక రకాల సమాచారాన్ని అందించే ఒక సంక్లిష్టమైన “పీ-మెయిల్” వ్యవస్థ. మూత్రంలో ఉండే ఫెరోమోన్లు ఒక కుక్క వయస్సు, లింగం, ఆరోగ్య స్థితి, సంతానోత్పత్తి స్థితి, మానసిక స్థితి గురించి కీలకమైన వివరాలను వెల్లడిస్తాయి. ఉదాహరణకు ఒక మగ కుక్క మూత్రం ద్వారా ఆడ కుక్కను ఆకర్షిస్తుంది. సంతానోత్పత్తికి సంసిద్ధతను తెలుసుకోగలదు. టైర్లపై మూత్ర విసర్జన చేయడం ద్వారా, కుక్కలు తమ పరిసరాల్లోని ఇతర కుక్కలకు తమ ఉనికి గురించి, తమ ప్రస్థానం గురించి తెలియజేస్తాయట. డాగ్ బిహేవియర్ నిపుణులు ఈ సంభాషణ విధానాన్ని కీలకమైనదిగా భావిస్తారు. అలాగే కొన్ని సందర్భాలలో కొత్త వాతావరణంలో లేదా ఒత్తిడికి లోనైనప్పుడు కుక్కలు ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తాయి. పెంపుడు కుక్కలు ఇలా ఎక్కువసార్లు మూత్రం చేస్తున్నాయంటే అవి ఇబ్బంది పడుతున్నట్లు అర్థం అని కూడా చెబుతుంటారు.

పెంపుడు కుక్కలను వాహనాలపై మూత్రం పోయకుండా నియంత్రించవచ్చా?

ఇక వాహన యజమానులు టైర్లను శుభ్రం చేయడం లేదా సిట్రస్ వంటి వాసనలు వెదజల్లే ద్రవాలను ఉపయోగించడం ద్వారా కుక్కలు ఆ ప్రాంతానికి రాకుండా నిరోధించవచ్చు. జంతు సంరక్షణ నిపుణులు కూడా ఈ పద్ధతులనే సూచిస్తారు.

Follow Us