Scalp Itch: తల బాగా దురద పెడుతుందా.. ఈ టిప్స్‌తో చెక్ పెట్టండి..

సాధారణంగా తలలో దురద అనేది చాలా కామన్ విషయం. చాలా మంది ఈ సమస్యతో బాధ పడే ఉంటారు. ఇది చెప్పాల్సినంత పెద్ద విషయం కాదూ.. వదిలేయాల్సినంత చిన్న సమస్య కూడా కాదు. ఇంట్లో దురద పెడితే సరే కానీ.. బయటకు ఉద్యోగానికి, ఇతర పనుల నిమిత్తం వెళ్లినప్పుడు అస్తమానూ తలలో గోకుతూ ఉంటే మాత్రం కాస్త చిరాకుగానే ఉంటుంది. తలలో దురద రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. సాల్ఫ్ పొడి బారిపోవడం, పీహెచ్ స్థాయిల్లో మార్పులు..

Scalp Itch: తల బాగా దురద పెడుతుందా.. ఈ టిప్స్‌తో చెక్ పెట్టండి..
Scalp Itch

Updated on: Mar 11, 2024 | 1:29 PM

సాధారణంగా తలలో దురద అనేది చాలా కామన్ విషయం. చాలా మంది ఈ సమస్యతో బాధ పడే ఉంటారు. ఇది చెప్పాల్సినంత పెద్ద విషయం కాదూ.. వదిలేయాల్సినంత చిన్న సమస్య కూడా కాదు. ఇంట్లో దురద పెడితే సరే కానీ.. బయటకు ఉద్యోగానికి, ఇతర పనుల నిమిత్తం వెళ్లినప్పుడు అస్తమానూ తలలో గోకుతూ ఉంటే మాత్రం కాస్త చిరాకుగానే ఉంటుంది. తలలో దురద రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. సాల్ఫ్ పొడి బారిపోవడం, పీహెచ్ స్థాయిల్లో మార్పులు రావడం, చుండ్రు, చెమట, తలపై వైరస్‌లు, బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ ఫెక్షన్స్ వంటి అనేక కారణాల వల్ల తలలో దురద రావడానికి కారణం అవుతాయి. ఈ దురద సమస్యను వదిలించుకోవడానికి ఆయిల్స్, షాంపూలను వాడే ఉంటారు. కానీ వీటితో సమస్య తగ్గడం సంగతి అటు ఉంచితే.. సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి తలపై దురద సమస్యతో బాధ పడేవారు ఈ సారి ఇంటి చిట్కాలు ఉపయోగించండి. వీటి వల్ల మంచి ఫలితం ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఇతర వస్తువులను ఉపయోగించ వద్దు:

తలలో దురద సమస్యతో ఇబ్బంది పడేవారు ఇతరులు ఉపయోగించే దిండ్లు, దువ్వెలను ఉపయోగించవచ్చు. వీటి వల్ల దురద సమస్య, చుండ్రు వంటి సమస్యలు ఎదురవుతాయి. మీకంటూ సపరేట్‌గా వస్తువులను ఉపయోగించండి.

కలబంద జెల్:

తలలో దురదతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటే.. కలబంద జెల్ చక్కగా పని చేస్తుంది. కలబంద గుజ్జును తీసి.. తలపై రాసి, ఓ 15 నిమిషాల తర్వాత తల స్నానం చేయాలి. ఇలా చేస్తూ ఉండే తల మాడుకు హైడ్రేషన్ అందుతుంది. అలాగే దురద కూడా కంట్రోల్ అవుతుంది. ఇలా తరచూ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

హెయిర్ మాస్క్:

మీ తలకు హెయిర్ మాస్క్‌లను కూడా ఉపయోగిస్తూ ఉంటే.. మంచి రిజల్ట్స్ ఉంటాయి. వీటిని యూజ్ చేయడం వల్ల.. తలలో దురద తగ్గడంతో పాటు.. బ్యాక్టీరియా, వైరస్‌లు వంటివి ఏమైనా ఉంటే నశిస్తాయి. పెరుగు, గుడ్డు, బేకింగ్ సోడా, నిమ్మ రసం, యాపిల్ సైడర్ వెనిగర్ వంటి వాటితో హెయిర్ మాస్క్‌లు తయారు చేసుకోవచ్చు.

ఈ ఆయిల్స్‌ హెయిర్‌కు బెస్ట్:

ఇప్పుడు చెప్పబోయే ఆయిల్స్ ఉపయోగించడం వల్ల.. తలలో దురద తగ్గడమే కాకుండా.. మీ జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి. టీ ట్రీ, పుదీనా, వేప, జోజోబా ఆయిల్స్ వాడటం వల్ల దురద తగ్గడంతో పాటు.. జుట్టు కుదళ్లకు కూడా రక్త ప్రసరణ అనేది జరుగుతుంది. దీని వల్ల జుట్టు రాలడం తగ్గి.. జుట్టు పెరుగుతుంది. పోషకాలు కూడా చక్కగా అందుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..