AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లలు త్వరగా మెచ్యూర్ అవుతున్నారా..? తల్లిదండ్రులు ఏం చేయాలి? నిపుణుల గైడ్

ఇటీవల కాలంలో ఆడపిల్లలు చిన్న వయసులోనే మెచ్యూర్ అవుతున్న సంఘటనలు తల్లిదండ్రుల్లో పెద్ద ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో సాధారణంగా 12–14 ఏళ్ల తర్వాతే అమ్మాయిలు మెచ్యూర్ అవుతారు. కానీ ఇప్పుడు జీవనశైలి మార్పులు, ఆహార అలవాట్లు వలన కొన్నిసార్లు చిన్న వయసులోనే ప్యూబర్టీ (రజస్వలత్వం) కనిపిస్తోంది. ఇందుకు సరైన కారణాలు, వైద్యులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

పిల్లలు త్వరగా మెచ్యూర్ అవుతున్నారా..? తల్లిదండ్రులు ఏం చేయాలి? నిపుణుల గైడ్
Early Puberty in Girls
Rajashekher G
|

Updated on: Jan 22, 2026 | 1:36 PM

Share

ఇటీవల కాలంలో ఆడపిల్లలు చిన్న వయస్సులోనే మెచ్యూర్ అవడం కొందరు తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇంతకుముందు 12 నుంచి 14 ఏళ్ల తర్వాతే అమ్మాయిలు మెచ్యూర్ అయ్యేవారు. కానీ, ఇప్పుడు మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న వయస్సులోనే రజస్వల(Pubberty) అవుతున్నారు. అయితే, ఇందుకు కారణం చికెన్, గుడ్లు, ప్యాకెట్ పాలు లాంటి పదార్థాలేనని కొంతమంది భావిస్తున్నారు. కానీ, ఇతర కారణాలు కూడా అయి ఉండవచ్చు. మరి చిన్న వయస్సులోనే ఆడ పిల్లలు మెచ్యూర్ కావడానికి ఇవే కారణమా? లేక వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా? వైద్య నిపుణులు చెబుతున్న కారణాలు ఏమిటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్, పాలు, గుడ్లు.. మెచ్యూర్‌కు కారణమా? చికెన్..

చికెన్ తినడం వల్ల మెచ్యూర్ త్వరగా వస్తుందన్నది చాలా మంది చెప్పే విషయం. కానీ, పరిశోధనలు మాత్రం చికెన్ వల్ల మెచ్యూర్ త్వరగా వస్తుందని స్పష్టమైన ఆధారం లేదు. అసలు ఈ విషయానికి సంబంధించిన పెద్ద స్థాయిలో పరిశోధనలు కూడా లేదు. చికెన్‌లో హార్మోన్లు ఉంటాయని కొందరు అంటారు, కానీ ఆ హార్మోన్లు మన శరీరానికి ప్రభావం చూపే స్థాయిలో ఉండవు అని వైద్యులు చెప్తున్నారు. అందుకే చికెన్.. తొందరగా మెచ్యూర్ కావడానికి కారణం అని చెప్పలేం.

పాలు

పాలు ఆరోగ్యానికి మంచిదనే విషయం అందరికీ తెలుసు. అయితే పాలు తాగితే మెచ్యూర్ ముందుకు వస్తుందా? అంటే.. ఇక్కడ కూడా శాస్త్రంగా నిర్ధారించబడిన స్పష్టమైన సంబంధం లేదు. పాలు తాగడం వల్ల శరీర బరువు పెరిగితే.. అది మెచ్యూర్ కారణమవ్వొచ్చు. కానీ పాలే కారణమని చెప్పడం సరికాదు.

గుడ్లు

గుడ్లు ఆరోగ్యకరమైన ప్రోటీన్ అందిస్తాయి. మెచ్యూర్ త్వరగా వచ్చే కారణంగా గుడ్లు ప్రస్తావించడం సరైనది కాదు. గుడ్లు ఎక్కువగా తినడం వల్లే మెచ్యూర్ అవుతారని చెప్పడం కూడా సరైనది కాదు.

మెచ్యూర్‌కు నిజమైన కారణాలు ఏమిటి?

మెచ్యూర్ (మొదటి రక్తస్రావం) త్వరగా వస్తే దానికి కారణాలు చాలా ఉంటాయి. బరువు ఎక్కువగా ఉన్న పిల్లల్లో హార్మోన్ స్థాయిలు మారి మెచ్యూర్ ముందుకు రావడం సాధారణం.

ఫాస్ట్ ఫుడ్, తీపి పానీయాలు, ప్రాసెస్ చేసిన స్నాక్స్ ఎక్కువగా తింటే శరీర బరువు పెరుగుతారు. అంతేకాక, ఇవి హార్మోన్లపై కూడా ప్రభావం చూపవచ్చు. వీటి ద్వారా కూడా తొందరగా మెచ్యూర్ అయ్యే అవకాశం ఉంది.

జన్యు (Genetics) పరమైన కారణాలు

మీ కుటుంబంలో ఎవరైనా చిన్నవయసులో మెచ్యూర్ వచ్చినవారు ఉంటే.. మీకు కూడా అదే అవకాశం ఉంటుంది.

పర్యావరణ కారకాలు (Environmental factors)

ప్లాస్టిక్ బాటిల్స్, కెమికల్స్, పెస్టిసైడ్స్ వంటి వాటిలో ఉండే రసాయనాలు హార్మోన్ వ్యవస్థను ప్రభావితం చేసి మెచ్యూర్ ముందుకు తీసుకురావచ్చు.

ఆరోగ్యంగా పెద్దవ్వడానికి, మెచ్యూర్ త్వరగా రాకుండా ఏం చేయాలి?

సమతుల ఆహారం.. పండ్లు, కూరగాయలు, మాంసం, బియ్యం, పప్పు తీసుకోవడం. వైయామం/ఆట.. రోజుకు కనీసం 30 నిమిషాలు. జంక్ ఫుడ్ తగ్గించండి. పర్యావరణం గురించి జాగ్రత్త.. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. సమయానికి ఆరోగ్య పరీక్షలు.. 8 సంవత్సరానికి ముందే మెచ్యూర్ లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ని సంప్రదించండి.

చివరగా.. చికెన్, పాలు, గుడ్లు తింటే అమ్మాయిలలో మెచ్యూర్ ముందుకు వస్తుందని శాస్త్రంగా నిర్ధారించలేదు. మెచ్యూర్ త్వరగా వచ్చే కారణం ఆహారం కాదు, పూర్తి జీవనశైలి, బరువు, జన్యు, పర్యావరణం వంటి అంశాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.