AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయా.. అపోహలు కాదు వాస్తవాలు తెలుసుకోండి..

ప్రస్తుత కాలంలో కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. విపరీతమైన కడుపు నొప్పి, మూత్ర విసర్జనలో మంట వంటి లక్షణాలు ఎదురైనప్పుడు చాలా మంది రకరకాల చిట్కాలను అనుసరిస్తుంటారు. ముఖ్యంగా బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి అనే ఒక అపోహ సమాజంలో బలంగా నాటుకుపోయింది. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో వైద్య శాస్త్రం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Krishna S
|

Updated on: Jan 02, 2026 | 4:41 PM

Share
బీర్ తాగడం వల్ల కిడ్నీ రాళ్లు పోతాయా: వైద్య శాస్త్రం ప్రకారం.. ఈ ప్రశ్నకు సమాధానం లేదు. బీర్ తాగడం వల్ల రాళ్లు పోవడానికి బదులు, మూత్రపిండాలు మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బీఆర్ తాగడం కిడ్నీలకు సంబంధించి కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

1 / 5
డీహైడ్రేషన్ ప్రమాదం: బీర్ ఒక మూత్రవిసర్జన కారకం. అంటే దీనిని తాగినప్పుడు మూత్రం ఎక్కువగా వస్తుంది. దీనివల్ల శరీరం నుంచి నీరు వేగంగా బయటకు వెళ్లిపోయి, శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. నిజానికి కిడ్నీలో రాళ్లు బయటకు రావాలంటే శరీరానికి అధిక మోతాదులో నీరు అవసరం. కానీ బీర్ వల్ల శరీరం ఎండిపోయి, రాళ్లు మరింత గట్టిపడే అవకాశం ఉంది.

2 / 5
యూరిక్ యాసిడ్ - ప్యూరిన్ల ముప్పు: బీరులో ప్యూరిన్ అనే పదార్థం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో జీర్ణమైన తర్వాత యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతుంది. నిరంతరం బీర్ తాగడం వల్ల ఈ యూరిక్ యాసిడ్ పెరిగి, కొత్త రాళ్లు ఏర్పడే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

3 / 5
రాయి పరిమాణం చాలా ముఖ్యం:  కిడ్నీలో రాయి 5 మి.మీ కంటే పెద్దగా ఉంటే..అది ఏ డ్రింక్‌తోనూ దానంతట అది బయటకు రాదు. బీర్ తాగడం వల్ల మూత్ర పీడనం పెరిగితే, ఆ రాయి మూత్ర నాళంలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల నరకప్రాయమైన నొప్పి కలగడమే కాకుండా ఇన్ఫెక్షన్లకు కూడా దారి తీస్తుంది.

4 / 5
బీర్ పరిష్కారం కాదు: మూత్రం ఎక్కువగా రావడం వల్ల రాళ్లు పోయినట్లు తాత్కాలికంగా అనిపించినా, దీర్ఘకాలంలో బీర్ వల్ల కాలేయం, మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతింటాయి. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నప్పుడు సొంత వైద్యం కాకుండా వెంటనే డాక్టరును సంప్రదించి, సరైన చికిత్స తీసుకోవడమే ఉత్తమం. కిడ్నీ రాళ్లను నివారించడానికి రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం, నిమ్మరసం తీసుకోవడం వంటి సహజ పద్ధతులను అనుసరించండి.

5 / 5