Periods Precautions: పీరియడ్స్ సమయంలో బ్లాక్ బ్లడ్ డిశ్చార్జ్ అవుతుందా.. అయితే జాగ్రత్త!

ప్రస్తుతం మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా కొత్త కొత్త అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. చిన్న వయసులోనే చాలా మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్నారు. మారిన లైఫ్ స్టైల్, ఆహారం కారణంగా మహిళలపై కూడా ఒత్తిడి పడుతుంది. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో కడుపులో నొప్పి, నీరసం, అలసట, హార్మోన్ల మార్పులతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే పీరియడ్స్‌లో అయ్యే రక్త స్రావాన్ని బట్టి మహిళలు ఆరోగ్యంగా ఉన్నారో లేదో..

Periods Precautions: పీరియడ్స్ సమయంలో బ్లాక్ బ్లడ్ డిశ్చార్జ్ అవుతుందా.. అయితే జాగ్రత్త!
Periods

Updated on: Jan 28, 2024 | 12:09 PM

ప్రస్తుతం మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా కొత్త కొత్త అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. చిన్న వయసులోనే చాలా మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్నారు. మారిన లైఫ్ స్టైల్, ఆహారం కారణంగా మహిళలపై కూడా ఒత్తిడి పడుతుంది. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో కడుపులో నొప్పి, నీరసం, అలసట, హార్మోన్ల మార్పులతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే పీరియడ్స్‌లో అయ్యే రక్త స్రావాన్ని బట్టి మహిళలు ఆరోగ్యంగా ఉన్నారో లేదో తెలుసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పీరియడ్స్ సమయంలో కొంత మందికి రక్తం అనేది నల్ల బడతుంది. ఈ ప్రాబ్లమ్‌ని చాలా మంది ఫేస్ చేసే ఉంటారు. కానీ దీన్ని సాధారణంగా అస్సలు తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు. అలసు బ్లాక్ కలర్ బ్లడ్ ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్ ఫెక్షన్లు ఉంటే..

కొంత మందిలో నెలసరి సమయంలో బ్లాక్ బ్లడ్ డిశ్చార్జ్ అవుతుంది. దీనిక కారణం మారిన ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్‌లో చేసుకున్న మార్పుల వల్ల అని నిపుణులు అంటున్నారు. అలాగే గర్భాశయ క్యాన్సర్, ఇన్ ఫెక్షన్ వంటి కారణంగా కూడా ఇలా అవుతుందని చెబుతున్నారు.

వైజైనల్ ఇన్ ఫెక్షన్‌ వల్ల కూడా..

బ్లాక్ బ్లడ్ డిశ్చార్జ్ అనేది గర్భాశయం నుంచి వచ్చే పాత రక్తం అని వైద్యులు చెబుతూ ఉంటారు. అలాగే వెజైనల్ ఇన్‌ఫెక్షన్ వల్ల కూడా ఈ నల్లటి పీరియడ్స్ రావచ్చని అంటారు. టాంపోన్స్, కాపర్ టీ ఉపయోగించే వారిలో కూడా ఈ బ్లాక్ బ్లడ్ డిశ్చార్జ్ అనేవి వస్తుందట.

ఇవి కూడా చదవండి

ఇలా ఉంటే సమస్య తీవ్రంగా ఉన్నట్లే..

బ్లాక్ బ్లడ్ డిశ్చార్జ్ అనేది ఒకటి రెండు సార్లు సంభవించినట్లయితే సాధారణంగా పరిగణించవచ్చని, దీనికి ఎలాంటి భయ పడాల్సిన పని లేదని వైద్యులు అంటున్నారు. కానీ ఇదే సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్లను సంప్రదించడం ముఖ్యం.

పైన చెప్పిన సమస్యలతో పాటు మూరిన్ చేసేటప్పుడు ఇబ్బంది, పెల్విక్ ప్రాంతంలో నొప్పి, జ్వరం వంటి లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే వైద్యలును కలవాలి. కొన్ని సార్లు శరీరంలో తలెత్తే మార్పుల వల్ల కూడా ఇలా అవుతుంది. కాబట్టి అస్సలు నిర్లక్ష్యం చేయండి. ఇవే దీర్ఘకాలిక వ్యాధులుగా మారి ప్రాణానికే ప్రమాదంగా మారుతున్నాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.