కొత్త బండి కింద నిమ్మకాయ ఎందుకు పెడతారో తెలుసా?.. అసలు కారణం తెలిస్తే అవాక్కే..
పెద్దలు ఏమి చేసినా దాని వెనుక ఒక కారణం ఉంటుంది. కానీ చాలా తక్కువ మంది మాత్రమే దాని వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. సాధారణంగా, ప్రతి ఒక్కరూ కొత్త వాహనం కొన్నప్పుడు.. పూజ చేయిస్తారు. ఆ సమయంలో టైర్ల కింద నిమ్మకాయలను పెట్టి వాహనాన్ని పోనిస్తారు. కానీ దీని వెనుక ఉన్న కారణం మీకు తెలుసా..?

మనం ఎంత చదువుకున్నా, మన పెద్దలు చెప్పిన సంప్రదాయాల్లో కొన్నింటిని ప్రశ్నించకుండానే పాటిస్తాము. కొన్ని ఆచారాలు ఎందుకు ప్రారంభమయ్యాయో తెలుసుకోవడానికి మనం ఎప్పుడూ పెద్దగా ప్రయత్నించం. ఇంట్లోకి కొత్త వాహనం రాగానే ఫస్ట్ దానికి పూజ చేయిస్తాం. వాహనాన్నికి పూజ చేసేటప్పుడు వాటి టైర్ల కింద నిమ్మకాయలు ఉంచుతారు. నిమ్మకాయల పై నుంచి వాహనాన్ని నడిపిస్తాము. ఇలా చేస్తే ఎటువంటి ప్రమాదం జరగదని చాలా మంది నమ్ముతారు. చెడు దృష్టి లేదా చెడు దృష్టిని నివారించడానికి నిమ్మకాయను ఉపయోగిస్తారు. అయితే గతంలో మన పెద్దవాళ్లు కొత్త వాహనం కింద నిమ్మకాయలను ఎందుకు పెట్టేవారో మీకు తెలుసా? ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ప్రస్తుతం ఉన్న కార్లలలో కొన్ని నిమిషాల్లోనే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లొచ్చు. కానీ గతంలో అలా ఉండేది కాదు. ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లడానికి ప్రజలు గుర్రపు బండ్లు లేదా ఎద్దుల బండ్లపై ఆధారపడేవారు. ఆ సమయంలో ఎద్దులు, గుర్రాలు రాళ్ళు, మట్టి, నీటి గుండా వెళ్లాల్సి వచ్చేది. ఇలాంటప్పుడు జంతువుల కాళ్ళకు గాయాలు అయ్యేవి. ఈ గాయాలు వల్ల ఈ జంతువులు ఎక్కువ దూరం నడవలేవు. అందువల్ల నిమ్మకాయలను ఎద్దులు, గుర్రాల కాళ్ళ కింద ఉంచి తొక్కించేవారు.
ఈ నిమ్మకాయలోని ఆమ్లం జంతువుల కాళ్ళ గాయాలలోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. దాంతో గాయాలు చాలా త్వరగా మానిపోతాయి. నేలలోని సూక్ష్మజీవులు గుర్రాలు, ఎద్దుల పాదాలలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్లు రాకుండా నిరోధించడానికి నిమ్మకాయలను ఉపయోగించారు. కానీ నేటికీ, నిమ్మకాయలను వాహనాల చక్రాల కింద ఉంచుతున్నారు. టైర్లలో ఎటువంటి జీవం ఉండదు. వాటికి ఎటువంటి ఇన్ఫెక్షన్లు సోకవు. కానీ దీని వెనుక కారణం తెలుసుకోకుండా నేటికి టైర్ల కింద నిమ్మకాయలు పెట్టి వాహనాలను పోనిస్తున్నాము. అప్పటి సంప్రదాయాన్ని అలానే అనుసరిస్తున్నాము.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




