Periods: నెలసరిలో తలస్నానం, గుడి నిషేదం ఎందుకో తెలుసా.. కారణాలు ఇవే!

నెలసరి అనగానే చాలా మంది ఆడవాళ్లకు భయం మొదలవుతుంది. కొందరికి పీరియడ్స్ అనేవి సులువుగానే ఉన్నా.. మరికొందరికి మాత్రం నిజంగానే హర్రర్ సినిమా చూసినట్టే ఉంటుంది. నడుం నొప్పి, పొత్తి కడుపులో నొప్పి, తీవ్రంగా రక్త స్రావం, నీరసం, కళ్లు తిరగడం, హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ ఇలా చాలా రకాల సమస్యలు ఉంటాయి. కానీ ఒక్కొక్కరికి ఇవన్నీ ఉంటాయి. ఆ సమయంలో బయటకు వెళ్లాలంటే నిజంగానే చాలా కష్టం. పీరియడ్స్ అనేవి అందరికీ ఒకేలా ఉండవు. ఒక్కో శరీరతత్వం బట్టి..

Periods: నెలసరిలో తలస్నానం, గుడి నిషేదం ఎందుకో తెలుసా.. కారణాలు ఇవే!
Periods

Updated on: Jan 19, 2024 | 6:04 PM

నెలసరి అనగానే చాలా మంది ఆడవాళ్లకు భయం మొదలవుతుంది. కొందరికి పీరియడ్స్ అనేవి సులువుగానే ఉన్నా.. మరికొందరికి మాత్రం నిజంగానే హర్రర్ సినిమా చూసినట్టే ఉంటుంది. నడుం నొప్పి, పొత్తి కడుపులో నొప్పి, తీవ్రంగా రక్త స్రావం, నీరసం, కళ్లు తిరగడం, హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ ఇలా చాలా రకాల సమస్యలు ఉంటాయి. కానీ ఒక్కొక్కరికి ఇవన్నీ ఉంటాయి. ఆ సమయంలో బయటకు వెళ్లాలంటే నిజంగానే చాలా కష్టం. పీరియడ్స్ అనేవి అందరికీ ఒకేలా ఉండవు. ఒక్కో శరీరతత్వం బట్టి ఉంటుంది. అయితే ఇవి రాను రానూ మూఢాచారంగా, అవిపత్రంగా తయారైయ్యాయి. నిజానికి పూర్వం పెద్దలు చెప్పి కారణాలు వేరు.. ఇప్పుడు పాటిస్తున్న జీవనం వేరు.

అందులోనూ కొందరి ఇళ్లలో ఎలా ఉంటుందంటే.. అవి ముట్టుకోకూడదు.. ఇవి చేయకూడదు.. పిల్లల్ని ఎత్తుకోకూడదు. ఇలా రక రకాలు వంటివి ఉంటాయి. వీటితో ఆ మహిళలతో పాటు ఇంట్లోని వారు కూడా ఆ మూడు రోజులూ ఇబ్బంది పడాల్సిందే. మహిళలను పీరియడ్స్ సమయంలో పక్కకు ఉండమని చెప్పిన వెనుక ఉండే.. సుక్ష్మాలను ప్రస్తుతం జనాలు గ్రహించలేక పోతున్నారు. వీటిని కొందరు చాదస్తంగా కొట్టి పడేస్తున్నా… పల్లెటూర్లలో మాత్రం ఆ నియమాలు, మూఢ నమ్మకాలను అలానే పాటిస్తున్నారు. అయితే మహిళల పీరియడ్స్ వెనుక.. పెద్దలు చెప్పిన సూక్ష్మ లోపాలే కాకుండా.. పలు సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. వాటిని గ్రహిస్తే.. మహిళలు ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన పని లేదు.

ఎందుకు స్నానం చేయవద్దు అంటారంటే..

మహిళలు నెలసరి సమయంలో ఎండోమెట్రియం అనేది మందంగా పెరిగి.. ఫలధీకరణ చెందదు. అది అండంతో పాటు రక్త స్రావం ద్వారా శరీరం నుంచి వెళ్లి పోవాలి. లేదంటే పలు రకాల సంతాన సాఫల్య సమస్యల్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది. మహిళలు పీరియడ్స్ ఉన్న వెంటనే నీళ్లు పోసుకుంటే.. శరీరంలో రక్త స్రావం అనేది ఆగి పోతుంది. కానీ పూర్తి స్థాయిలో రక్త స్రావం జరగడం అవసరం.

ఇవి కూడా చదవండి

గుడికి ఎందుకు నిషేదమంటే..

పూర్వం దేవాలయాలు ఊరి చివర ఎక్కడో ఉండేవి. అక్కడకు వెళ్లాలంటే చాలా దూరం నడాల్సి ఉంటుంది. ఇలా నడవడం వల్ల మహిళలకు అధిక రక్త స్రావం అవుతుంది. అందుకే వెళ్ల కూడదని అంటారు. అదే విధంగా మరో విషయం ఏంటంటే.. గుడి వెళ్లే క్రమంలో క్రూర మృగాలు రక్తం వాసన పసిగట్టి దాడి చేసే ప్రమాదం ఉందని.. దేవ దర్శనాన్ని నిషేధించారు. అంతేకాకుండా శరీరం అలసి పోతుంది.. ఆ సమయంలో ఎలాంటి కార్యక్రమాలు జరపరు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇక్కడ తెలిపిన సమాచారం.. కేవలం అవగాహన కోసం మాత్రమే. వాస్తుకు సంబంధించి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా.. సలహాలు, సూచనలు కావాలన్నా వైద్య నిపుణులను కలవడం మంచిది.