AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్మోకింగ్స్‌ బిస్కెట్స్‌లో పొగ ఎక్కడి నుంచి వస్తుంది.? వీటిని ఎలా తయారు చేస్తారో తెలుసా.?

అసలు ఈ పొగ ఎక్కడి నుంచి వస్తుంది. ఈ స్మోక్ బిస్కెట్ ఎలా తయారు చేస్తారో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. లిక్విడ్ నైట్రోజన్ బిస్కెట్స్ మీద వేయడం ద్వారా ఈ పొగ వస్తుంది. ఒకరకంగా ఇది డ్రై ఐస్ లాంటిది. నైట్రోజన్ని 1000 డిగ్రీల వద్ద కంప్రెస్ చేయడం ద్వారా లిక్విడ్ నైట్రోజన్ తయారవుతుంది. ఇది బిస్కెట్స్ మీద వేయడం ద్వారా కొద్దిసేపు నోట్లోంచి పొగ ధారాళంగా వస్తూనే ఉంటుంది. బిస్కెట్స్‌ను నములుతున్నంత....

స్మోకింగ్స్‌ బిస్కెట్స్‌లో పొగ ఎక్కడి నుంచి వస్తుంది.? వీటిని ఎలా తయారు చేస్తారో తెలుసా.?
Smoking Biscuit
Rakesh Reddy Ch
| Edited By: |

Updated on: Oct 01, 2023 | 5:55 PM

Share

స్మోకింగ్ బిస్కెట్స్. ఈ మాట ఈ మధ్యకాలంలో చాలా వినిపిస్తుంది. షాపింగ్ మాల్స్ లో, ఫుడ్ కోర్టులలో, ఫంక్షన్ హాల్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. మామూలు బిస్కెట్లు అయినా తింటున్నప్పుడు అందులోంచి విపరీతమైన పొగ వస్తుంది. సరదాగా ఆ స్మోక్ కోసం పిల్లలు పెద్దలు అంతా ఈ స్మోక్ బిస్కెట్స్ తింటున్నారు. స్మోక్ బిస్కెట్స్ తో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడం రీల్స్ చేసుకోవడం ఫ్యాషన్ గా మారిపోయింది.

అసలు ఈ పొగ ఎక్కడి నుంచి వస్తుంది. ఈ స్మోక్ బిస్కెట్ ఎలా తయారు చేస్తారో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. లిక్విడ్ నైట్రోజన్ బిస్కెట్స్ మీద వేయడం ద్వారా ఈ పొగ వస్తుంది. ఒకరకంగా ఇది డ్రై ఐస్ లాంటిది. నైట్రోజన్ని 1000 డిగ్రీల వద్ద కంప్రెస్ చేయడం ద్వారా లిక్విడ్ నైట్రోజన్ తయారవుతుంది. ఇది బిస్కెట్స్ మీద వేయడం ద్వారా కొద్దిసేపు నోట్లోంచి పొగ ధారాళంగా వస్తూనే ఉంటుంది. బిస్కెట్స్‌ను నములుతున్నంత సేపు పొగ రావడానికి ప్రధాన కారణం ఇదే. అయితే ఇదంగా బాగానే ఉన్నా అసలు ఈ పొగ వాళ్ల ఆరోగ్యానికి ఏమైనా ప్రమాదం ఉంటుందా.? అసలు ఈ బిస్కెట్స్‌ ఆరోగ్యానికి ఎంత వరకు సేఫ్‌ అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నోట్లో వేసుకోగానే రుచికరమైన బిస్కెట్ తో పాటు సిగరెట్ తాగితే వచ్చేలా వస్తున్న ఈ పొగ సిగరెట్ కంటే డేంజర్. అయ్యో.. ఒక్కసారికే అంత డేంజర అని అనుకుంటున్నారా.. అవును ఈ పొగ కడుపులోకి వెళ్లడం ద్వారా గ్యాస్టిక్ సమస్యలు వస్తాయి. మనకు తెలియకుండానే పేగులలో ఒక చల్లదనాన్ని ఏర్పరిచి పొరలాగా ఉండిపోతుంది. చిన్నపిల్లలకైతే ఇది ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం ద్వారా కూడా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఇలాంటి స్మోక్‌ బిస్కెట్స్‌ని కొన్ని దేశాల్లో బ్యాన్ చేశారు కూడా. మనదేశంలో మాత్రం దీనిపైన పెద్దగా ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. కచ్చితంగా ఈ స్మోక్ బిస్కెట్స్ తింటున్నప్పుడు ఎంతో కొంత పొగ ఊపిరితిత్తుల్లోకి, కడుపులోకి వెళ్తుంది. లోపలి భాగాన్ని చాలా సెన్సిటివ్గా అతి చల్లదనంలోకి తీసుకెళ్తుంది. దీనివల్ల దీర్ఘకాలిక రోగాలతో పాటు గ్యాస్టిక్ సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు పదేపదే ఈ స్మోకింగ్ బిస్కెట్స్ తినడం వల్ల నోటి లోపల సెన్సిటివిటీ కోల్పోతారు అనేది వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

100 కోట్లు టు 1000 కోట్లు.. రికార్డులను తిరగరాస్తున్న టాలీవుడ్
100 కోట్లు టు 1000 కోట్లు.. రికార్డులను తిరగరాస్తున్న టాలీవుడ్
20 సిక్సర్లు, 24 ఫోర్లతో డబుల్ సెంచరీ.. దుమ్మురేపిన బుడ్డోడు
20 సిక్సర్లు, 24 ఫోర్లతో డబుల్ సెంచరీ.. దుమ్మురేపిన బుడ్డోడు
తన సామాజిక వర్గంపై తొలిసారి నోరు విప్పిన నటి.. నెట్టింట చర్చ!
తన సామాజిక వర్గంపై తొలిసారి నోరు విప్పిన నటి.. నెట్టింట చర్చ!
23 ఏళ్లుగా ఇండస్ట్రీలో తోపు.. చేసింది 7 సినిమాలే..
23 ఏళ్లుగా ఇండస్ట్రీలో తోపు.. చేసింది 7 సినిమాలే..
అవమానాల నుంచి 'దురంధర్' గర్జన వరకు.. ఆదిత్య ధర్ కన్నీటి కథ
అవమానాల నుంచి 'దురంధర్' గర్జన వరకు.. ఆదిత్య ధర్ కన్నీటి కథ
Video: యాషెస్ స్నికో వివాదంపై పెదవి విప్పిన అలెక్స్ కేరీ
Video: యాషెస్ స్నికో వివాదంపై పెదవి విప్పిన అలెక్స్ కేరీ
13 సెకన్లలో ఈ రెండు చిత్రాల మధ్య తేడాలను గుర్తిస్తే నువ్వే తోపు
13 సెకన్లలో ఈ రెండు చిత్రాల మధ్య తేడాలను గుర్తిస్తే నువ్వే తోపు
ఆ ఒక్క రీజన్‌తో 50 దాటినా పెళ్లి చేసుకోని ధురంధర్ మూవీ విలన్
ఆ ఒక్క రీజన్‌తో 50 దాటినా పెళ్లి చేసుకోని ధురంధర్ మూవీ విలన్
వచ్చే రెండు రోజులు చాలా జాగ్రత్త.! బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ..
వచ్చే రెండు రోజులు చాలా జాగ్రత్త.! బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ..
అంబానీ మావ మాస్టర్ స్ట్రోక్ చూస్తే మైండ్ పోతుంది
అంబానీ మావ మాస్టర్ స్ట్రోక్ చూస్తే మైండ్ పోతుంది