రాత్రి 9 గంటల తర్వాత భోజనం చేసేవారికి హెచ్చరిక..! ఈ ముప్పు తప్పదంటున్న నిపుణులు..

|

May 12, 2024 | 9:50 AM

రాత్రివేళ ఆలస్యంగా తింటే ఏ సమస్యా లేదని అనుకుంటారు. అయితే ఇలా రోజూ తింటే ఆరోగ్యం మాత్రం కచ్చితంగా దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే మనం ఆరోగ్యంగా ఉండాలంటే భోజన సమయం చాలా ముఖ్యం. వాటిని సరిగ్గా పాటించకపోతే మీ మొత్తం ఆరోగ్యం దెబ్బతింటుంది. మీకు తెలుసా... రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల..

రాత్రి 9 గంటల తర్వాత భోజనం చేసేవారికి హెచ్చరిక..! ఈ ముప్పు తప్పదంటున్న నిపుణులు..
Eating Foods
Follow us on

నేటి మన ఉరుకుల, పరుగుల జీవితంలో తినడానికి కూడా తీరిక లేని పరిస్థితుల్లో జీవిస్తున్నాం. బిజీ లైఫ్‌ టైమ్‌లో ఆకలి తీర్చుకునేందుకు ఏది దొరికితే అది తినేసి కడుపు నింపుకుంటున్నాం. కానీ, అది మన ఆరోగ్యానికి ప్రమాదకరమనే విషయాన్ని మర్చిపోతున్నాం. చాలా మందికి రాత్రిపూట భోజనం చేసే అలవాటు ఉంటుంది. అంటే రాత్రి 9 గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల మధ్యలో తింటుంటారు. రాత్రివేళ ఆలస్యంగా తింటే ఏ సమస్యా లేదని అనుకుంటారు. అయితే ఇలా రోజూ తింటే ఆరోగ్యం మాత్రం కచ్చితంగా దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే మనం ఆరోగ్యంగా ఉండాలంటే భోజన సమయం చాలా ముఖ్యం. వాటిని సరిగ్గా పాటించకపోతే మీ మొత్తం ఆరోగ్యం దెబ్బతింటుంది. మీకు తెలుసా… రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల బరువు పెరగడం, జీర్ణక్రియ సమస్యలు, నిద్రలేమి, అధిక రక్తపోటు, మధుమేహం తదితర సమస్యలు వస్తాయి.

రాత్రి పూట ఆలస్యంగా తినే అలవాటు ఎన్నో రోగాలకు దారితీస్తుందని అంటున్నారు. ముఖ్యంగా ఇది జీర్ణ శక్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందట. ప్రతిరోజూ రాత్రుళ్లు ఆలస్యంగా తినే అలవాటు ఉన్నవారికి అది భవిష్యత్తులో స్ట్రోక్‌కు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా రాత్రిపూట ఎక్కువగా తినడం వల్ల రక్తపోటు, షుగర్ లెవల్స్‌లో మార్పులు వస్తాయి. ముఖ్యంగా భవిష్యత్తులో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

రాత్రి ఆలస్యంగా తినడం వల్ల బరువు వేగంగా పెరుగుతారని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. దీని వల్ల వినియోగించే క్యాలరీలు సరిగా కరిగిపోవు. అలాగే శరీర కొవ్వు పెరగడం మొదలవుతుంది. దీంతో ఊబకాయం పెరుగుతుంది. రాత్రిపూట ఆలస్యంగా తినే అలవాటు నిద్రలేమికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

అంతే కాకుండా రాత్రి 9 గంటల తర్వాత తినడం వల్ల హెమరేజిక్ స్ట్రోక్ వస్తుంది. దీని వల్ల మెదడులోని రక్తనాళాలు పగిలి రక్తస్రావం అయ్యే అవకాశం ఉందని చాలా అధ్యయనాలు సూచిస్తున్నాయి. అలాగే రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోకండి. దీనివల్ల పక్షవాతం కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల మధ్యే భోజనం చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..