Dry Fruits: ఖాళీ కడుపుతో డ్రై ఫ్రూట్స్ తింటే ఏమౌతుందో తెలుసా..? శరీరంలో జరిగేది ఇదే..!

|

Jul 28, 2024 | 7:43 AM

శరీరంలో ఉప్పు శాతం తక్కువగా ఉంచడం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అంతేకాదు డ్రై ఫ్రూట్స్ తింటే రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. మీలోని జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి రెట్టింపు అవుతుంది. జుట్టు రాలటం, పొడిబారటం వంటి సమస్యలు కంట్రోల్ అవుతుంది. చర్మ సమస్యలు తొలగిపోయి మీ ముఖం యవ్వనంగా నిగారింపుగా మెరుస్తుంది.

Dry Fruits: ఖాళీ కడుపుతో డ్రై ఫ్రూట్స్ తింటే ఏమౌతుందో తెలుసా..? శరీరంలో జరిగేది ఇదే..!
Dry Fruits
Follow us on

ప్రతిరోజూ కొద్ది మొత్తంలో డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా అనేక వ్యాధులు రాకుండా ఉంటాయి. డ్రైఫ్రూట్స్‌ తినటం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. డ్రై ఫ్రూట్స్ లో మినరల్స్, విటమిన్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు మెండుగా నిండి ఉంటాయి. అయితే, ఉదయాన్నే ఖాళీ కడుపుతో డ్రై ఫ్రూట్స్‌ తినొచ్చా.. ? తింటే ఏమవుతుంది అని చాలా మందికి సందేహం ఉంటుంది. కానీ, పరగడుపునే మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే డ్రైఫ్రూట్స్‌ తీసుకోవడం వల్ల రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడానికి కావాల్సినంత శక్తి శరీరానికి లభిస్తుందని చెబుతున్నారు. మరెన్నో లాభాలు..

ప్రతిరోజూ ఖాళీ కడుపుతో బాదంపప్పు తినడం వల్ల మీ చర్మం మెరుస్తుంది. శరీర అలసటను తగ్గిస్తుంది. స్కిన్ గ్లో పెరుగుతుంది. బాదం పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తీసుకోవాలి. ఇలా చేస్తే మీ శరీరానికి కావాల్సిన సరైన పోషకాహారాన్ని అందించడంలో సహాయపడుతుంది.అలాగే ఖాళీ కడుపుతో నట్స్ తింటే బరువు పెరుగుతారు. నట్స్ బరువు పెరగడానికి కారణమవుతాయి. ఖాళీ కడుపుతో అంజీర్ పండ్లను తీసుకోవడం వల్ల ఒక నెలలోపు రక్త లోపం తగ్గుతుంది. ఖర్జూరంలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి బలాన్ని, శక్తిని ఇస్తాయి. ఉదయాన్నే నాలుగైదు జీడిపప్పులు తింటే కూడా మంచిది. జీడిపప్పులో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. జీడిపప్పులో కొలెస్ట్రాల్ ఉండదు, ఇది గుండె పనితీరును పెంచడానికి అవసరమైన పోషకాలను అందించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ 4-5 జీడిపప్పులను ఖాళీ కడుపుతో తీసుకోవడం కూడా సరైన బరువు నిర్వహణకు సహాయపడుతుంది.

అలాగే, రోజూ వాల్ నట్స్ ను మితంగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలను నివారించవచ్చు. ఎండు ద్రాక్షలో పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. శరీరంలో ఉప్పు శాతం తక్కువగా ఉంచడం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అంతేకాదు డ్రై ఫ్రూట్స్ తింటే రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. మీలోని జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి రెట్టింపు అవుతుంది. జుట్టు రాలటం, పొడిబారటం వంటి సమస్యలు కంట్రోల్ అవుతుంది. చర్మ సమస్యలు తొలగిపోయి మీ ముఖం యవ్వనంగా నిగారింపుగా మెరుస్తుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..