Winter 2025: చలికాలంలో పెదవులు పగలడానికి కారణం ఏంటో తెలుసా?.. ఆ సమస్యకు ఎలా చెక్‌ పెట్టాలి!

శీతాకాలంలో పెదవులు పగిలిపోవడం అనేది ఒక సాధారణ సమస్య. కానీ ఏ విటమిన్ లోపం వల్ల పెదవులు పగిలిపోతాయో మీకు తెలుసా? చలికాలంలో మాత్రం ఇలా పెదవులు పగలడానికి కారణమేంటని మీరెప్పుడైనా ఆలోచించారా? అయితే మీ ప్రశ్నలన్నిందికి సమాధానం మేం చెబుతాం. అదేంటో తెలుసుకుందాం పదండి.

Winter 2025: చలికాలంలో పెదవులు పగలడానికి కారణం ఏంటో తెలుసా?.. ఆ సమస్యకు ఎలా చెక్‌ పెట్టాలి!
Cracked Lips Winter

Edited By: Janardhan Veluru

Updated on: Nov 12, 2025 | 9:23 AM

శీతాకాలంలో చర్మం పొడిబారడం సర్వసాధారణం. చాలా మంది దీని వల్ల ఇబ్బంది పడుతుంటారు. ఇందులో చాలా మంది ఎదుర్కొనే ప్రధాన సమస్య పెదవులు పగిలిపోవడం. అయితే చలికాలంలో తరచుగా పెదవులు పగిలిపోవడం లేదా పొడిబారడం కేవలం వాతావరణం వల్ల మాత్రమే కాదు, శరీరంలో పోషకాలు లేకపోవడం వల్ల కూడా ఇది సంభవించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి ప్రోటీన్, కార్బోహైడ్రేట్ల మాదిరిగానే విటమిన్లు కూడా ముఖ్యమైనవి. మన శరీరంలో వాటి శాతం తగ్గినప్పుడు మనం ఇలా అనారోగ్య సమస్యలను ఎదుర్కొవలసి ఉంటుంది.

పెదవులు పగలడానికి కారణం ఏంటి?

ఇక ఏ విటమిన్ లోపం వల్ల పెదవులు పగిలిపోతాయి? అనే విషయానికి వస్తే.. విటమిన్ బీ12.. మన శరీరంలో విటమిన్ బి12 కావాలసిన దానికి కంటే తక్కువగా ఉంటే ఈ విటమిన్ లోపం వల్ల ఏర్పడుతుంది. తద్వారా పెదవులు పగిలిపోవడం, చర్మం పొడిబారడం జరుగుతుంది. శరీరానికి విటమిన్ బి12 చాలా అవసరం. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో విటమిన్ బి12 ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒక వేళ ఈ లోపం ఉంటే రక్తహీనత వస్తుంది. అలాగే ఈ లోపం వల్ల తిమ్మిరి, జలదరింపు, జ్ఞాపకశక్తి సమస్యలు వస్తాయి. ఇది శరీరం DNA సంశ్లేషణకు కూడా సహాయపడుతుంది.

విటమిన్ బి12 లోపాన్ని అధిగమించడానికి ఏమి తినాలి?

  • విటమిన్ బి12 లోపాన్ని అధిగమించడానికి, మీరు మీ ఆహారంలో కొన్ని విషయాలను చేర్చుకోవచ్చు.
  • చేప: విటమిన్ బి12 లోపాన్ని అధిగమించడానికి, మీరు మీ ఆహారంలో సాల్మన్, ట్యూనా, సార్డిన్‌లను చేర్చుకోవచ్చు.
  • షెల్ఫిష్: మీరు మీ ఆహారంలో క్లామ్స్, ఆయిస్టర్స్ వంటి వాటిని కూడా చేర్చుకోవచ్చు.
  • గుడ్డు: విటమిన్ బి12 లోపాన్ని అధిగమించడానికి మీరు గుడ్డును కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు. దీనితో పాటు, మీ ఆహారంలో
  • పాలు, పెరుగు, నీరు వంటి పాల ఉత్పత్తులను చేర్చుకోవడం ద్వారా విటమిన్ బి12 లోపాన్ని కూడా అధిగమించవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.