AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Palash flower: ఈ పువ్వు తో అంతులేని అదృష్టం, వెలకట్టలేని ఆరోగ్యం..

వసంతకాలం ఆరంభంలోనే మోదుగ చెట్లపై పూలు విరబూస్తాయి.ఈ పువ్వులను అనేక పేర్లతో పిలుస్తారు. ఈ మోదుగ పువ్వులు రెండు రకాలు. ఒకటి తెలుపు, మరొకటి ఎరుపు. దాని ఎరుపు రంగు కారణంగా దీనిని అటవీ అగ్ని అని కూడా పిలుస్తారు. మోదుగను ఆయుర్వేదంలో అనేక ఔషధాలుగా ఉపయోగిస్తారు. మోదుగ పూలు, కాయలను వైద్యంలో వాడుతారు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. మోదుగ నూనె, ఆకులు, విత్తనాలు కూడా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు.

Palash flower: ఈ పువ్వు తో అంతులేని అదృష్టం, వెలకట్టలేని ఆరోగ్యం..
Palash Flower
Jyothi Gadda
|

Updated on: Jan 27, 2025 | 5:36 PM

Share

మోదుగ పూలను అగ్నిపూలు అని కూడా పిలుస్తారు. పల్లెలు, గ్రామాల్లో ఉన్నవారికి ఈ మోదుగ పూల గురించి ఎక్కువగా తెలుసు. నారింజరంగుతో, ఎర్రని గుత్తులుగా వికసించే ఈ పూలు చూసేందుకు కనువిందుగా కనిపిస్తాయి..అంతేకాదు.. ఈ పూలు చాలా తమాషాగా వుంటాయి. కొక్కేలలాగా, కొద్దిగా చిలుకముక్కుల్లాగా వుంటాయి.. ఆకులేకనిపించనట్లు నిండుగా పూస్తాయి. ఈ పూల పుప్పొడి నుండి అబిర్ అనే హోలి రంగును తయారుచేస్తారు. పూలమొగ్గలు ముదురు బ్రౌన్ రంగులో వుండి, చెట్టు పైన పూలు బాగా పూసి ఎర్రగా అగ్నిశిఖలాగా కనిపిస్తాయి.ఈ పూల పుప్పొడి నుండి అబిర్ అనే హోలి రంగును తయారుచేస్తారు.

మోదుగను ఆయుర్వేదంలో అనేక ఔషధాలుగా ఉపయోగిస్తారు. మోదుగ పూలు, కాయలను వైద్యంలో వాడుతారు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. మోదుగ నూనె, ఆకులు, విత్తనాలు కూడా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. మోదుగ విత్తనాల్ని పొడి చేసి దానిలో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే కడుపులో క్రిములు నాశనమవుతాయి. మోదుగ చెట్టులోని ప్రతి భాగాన్ని పూజల్లో కూడా ఉపయోగిస్తుంటారు. జ్యోతిశాస్త్రం ప్రకారం..ఇంట్లో చెడుదృష్టిని పోగొట్టడానికి ఎండిన మోదుగు కట్టేలను కాలుస్తారు. వాటితో వచ్చే పొగ చెడును హరిస్తుందని నమ్ముతారు. మోదుగపూలు ఒక రకమైన సువాసతో, అందంగా వుంటాయి. పూర్తి నారింజ రంగులో వికసించే ఈ పూలను చూస్తే మనసుకు ఎంతో ఆనందం అనిపిస్తుంది.

అంతేకాదు..మోదుగ పువ్వులు త్రిమూర్తుల నివాసంగా చెబుతారు. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మోదుగ పూలలో కొలువై ఉంటారని నమ్ముతారు. అంతేకాదు. ఈ పూలు పరమశివుడికి అత్యంత ప్రియమైనవిగా చెబుతారు. ఈ చెట్టు బంక టానింగ్, రంగుల అద్దకంలోనూ వాడుతారు. కాండం బెరడును పరిశ్రమలలో ఉపయోగిస్తారు. బెరడు నుండి నార తీస్తారు. మోదుగ చెట్టు కలపను ప్యాకింగ్ పెట్టెలతయారీకి వాడతారు. తుపాకిమందుకు ఈ కర్ర బొగ్గు ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..