Cooking: స్టీల్ పాత్రల్లో వంట చేస్తున్నారా.. అయితే, ఇది మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయం..

|

Jun 14, 2023 | 7:22 AM

మనం సాధారణంగా మన ఇళ్లల్లో ఎక్కువగా వంటకు వాడే పాత్రలు అల్యూమినియం, నాన్ స్టిక్, స్టీల్ అని చెప్పొచ్చు. ఈ మూడింటిలో కూడా అల్యూమినియం ఎక్కువగా వాడుతున్నారు. అయితే అల్యూమినియం పాత్రలలో చేసిన వంట ఆరోగ్యానికి మంచిది కాదు అంటున్నారు. అందుకే ఇప్పుడు ప్రజలు క్రమంగా అల్యూమినియం పాత్రల నుండి స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలకు మారుతున్నారు.

Cooking: స్టీల్ పాత్రల్లో వంట చేస్తున్నారా.. అయితే, ఇది మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయం..
Stainless Steel
Follow us on

ఎటువంటి వంట పాత్రలు వాడితే మన ఆరోగ్యానికి మంచిది..? ఇది ఇప్పటికీ చాలా మందికి ఎదురయ్యే సమస్య. కానీ, మనం సాధారణంగా మన ఇళ్లల్లో ఎక్కువగా వంటకు వాడే పాత్రలు అల్యూమినియం, నాన్ స్టిక్, స్టీల్ అని చెప్పొచ్చు. ఈ మూడింటిలో కూడా అల్యూమినియం ఎక్కువగా వాడుతున్నారు. అయితే అల్యూమినియం పాత్రలలో చేసిన వంట ఆరోగ్యానికి మంచిది కాదు అంటున్నారు. అందుకే ఇప్పుడు ప్రజలు క్రమంగా అల్యూమినియం పాత్రల నుండి స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలకు మారుతున్నారు. అల్యూమినియం పాత్రలో ఆహారాన్ని వండటం, తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య నష్టం జరుగుతుందని ప్రజలు నమ్ముతారు. అయితే, మీరు సరైన పద్ధతిని ఉపయోగించకపోతే, తగు జాగ్రత్తలు తీసుకోకపోతే స్టీలు పాత్రలు కూడా అనేక రకాల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని మీకు తెలుసా? అవును, అందుకే.. ఇప్పుడు స్టీల్ పాత్రలలో వంట చేసేటప్పుడు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తల గురించిన సమాచారాన్ని తెలుసుకుందాం. ఇది మీకు ఏ విధంగానూ హాని కలిగించదు. స్టీలు పాత్రల్లో వండేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చిట్కాలు తెలుసుకుందాం.

మీరు కొత్త స్టీల్ పాన్‌లో ఆహారాన్ని వండేటప్పుడు అది ఎక్కువగా అడుగంటుతుంది. కొద్ది సమయానికే పాత్ర అడుగున మాడిపోవటం జరుగుతుంది.. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి. అందుకే కొత్త స్టీల్ పాన్‌లో పెద్ద మంట మీద ఆహారాన్ని ఎప్పుడూ వండకండి. వాస్తవానికి, స్టెయిన్‌లెస్ స్టీల్‌కు ఎలాంటి టెఫ్లాన్ పూత ఉండదు. కాబట్టి వండుతున్నప్పుడే ఆహారం అడుగున అంటుకుంటుంది. కాబట్టి మీరు స్టీల్‌తో చేసిన కొత్త పాత్రలో ఆహారాన్ని వండేటప్పుడు ముఖ్యంగా తక్కువ, మధ్యస్థ మంటపై ఆహారాన్ని ఉడికించాలి.

సన్నని స్టీల్ పాన్‌పై ఎప్పుడూ గ్రిల్ చేయకూడదని గుర్తుంచుకోండి. ఎందుకంటే, గ్రిల్లింగ్ కోసం పాత్రను ఎక్కువసేపు మంటపై ఉంచాల్సి ఉంటుంది. ఇది మెటల్ని దెబ్బతీస్తుంది. అలాగే, డీప్ ఫ్రై కూడా చెయొద్దు. మీరు ఎప్పుడైనా స్టీల్ పాన్‌లో డీప్ ఫ్రై చేయడం గురించి ఆలోచించినట్లయితే అలా ఎప్పుడూ చేయకండి. నిజానికి స్టీల్ కంటైనర్లలో స్మోక్ పాయింట్ ఉంటుంది. మీరు స్టీల్ పాట్‌లో దేన్నైనా డీప్ ఫ్రై చేసినప్పుడు, అది స్మోక్ పాయింట్‌కు మించి చేరుతుంది. దీంతో మీ స్టీల్ పాన్ పసుపు లేదా జిగటగా మారిపోతుంది. ఇక దాన్ని వదిలించుకోవటం చాలా కష్టమవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..