AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొరియన్ అమ్మాయిల అందం వెనుక రహస్యం ఏంటో తెలుసా..? అది మీకు కూడా తెలుసు..!

Korean Beauty Face Pack : మృదువైన చర్మం పొందడానికి మహిళలు అన్ని రకాల పద్దతులను ఉపయోగిస్తారు. కొంతమంది రసాయన

కొరియన్ అమ్మాయిల అందం వెనుక రహస్యం ఏంటో తెలుసా..? అది మీకు కూడా తెలుసు..!
Korean Beauty Face Pack
uppula Raju
|

Updated on: May 17, 2021 | 4:10 PM

Share

Korean Beauty Face Pack : మృదువైన చర్మం పొందడానికి మహిళలు అన్ని రకాల పద్దతులను ఉపయోగిస్తారు. కొంతమంది రసాయన ఉత్పత్తులు, ఖరీదైన చికిత్సలు తీసుకుంటారు. కొందరు ఇంట్లో చేసే రెమిడీస్‌ని వాడుతారు. అయితే ప్రపంచంలోకెల్లా కొరియన్ అమ్మాయిలు అందంగా ఉంటారు. వారి దగ్గర ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఆ అందం కేవలం అద్భుతమైన మేకప్ అని చాలా మంది అనుకుంటారు. కానీ వారి అందం వెనుక సహజ పద్ధతులు ఉపయోగించబడుతున్నాయని చాలా తక్కువ మందికి తెలుసు. కొరియన్ బ్యూటీ ప్యాక్ నేచురల్ హైడ్రేషన్, చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి పనిచేస్తుంది. ఈ రోజు మనం మూడు సహజ కొరియన్ ఫేస్ మాస్క్‌ల గురించి తెలుసుకుందాం. వీటిని మీరు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.

1. పిండి ఫేస్ మాస్క్ ఇందుకోసం మీరు ఒక టీస్పూన్ పిండి, ఒక టీస్పూన్ పాలు, ఒక టీస్పూన్ తేనె తీసుకోవాలి. ఈ మూడింటిని కలపి పేస్ట్‌లా చేయండి ముఖంపై అప్లై చేయండి. మిశ్రమం ఆరిపోయినప్పుడు నీటితో కడగాలి. ఈ ఫేస్ మాస్క్ అప్లై చేయడం ద్వారా మీ చర్మం మెరుస్తూ ఉంటుంది.

2. గ్రీన్ టీ మాస్క్ దీని కోసం మీరు గ్రీన్ టీ కొన్ని ఆకులను ఉడకబెట్టాలి. చల్లబరిచిన తరువాత పేస్ట్ సిద్ధం చేసి ముఖంపై అప్లై చేయాలి. మిశ్రమం బాగా ఆరిపోయినప్పుడు నీటితో కడగాలి. ఈ ఫేస్ మాస్క్ అప్లై చేయడం ద్వారా మీ ముఖం శుభ్రంగా ఉంటుంది. అంతేకాదు మీరు చర్మ సమస్యల నుంచి బయటపడతారు.

3. రైస్ వాటర్ ఫేస్ మాస్క్ బియ్యం నీరు చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఈ ఫేస్ మాస్క్ అప్లై చేసిన తరువాత నీటితో కడగాలి. బియ్యం నీటిలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. బియ్యం వాటర్ ఫేస్ మాస్క్ వేసుకొని ముఖాన్ని వృత్తాకార కదలికలో మసాజ్ చేయండి. ఇది మీ ముఖంలో సంకోచానికి కారణమవుతుంది. వృద్ధాప్యం ఛాయలను తక్కువగా చూపుతుంది.

Cyclone Tauktae Live: బీభత్సం సృష్టిస్తున్న ‘తౌక్టే’ తుఫాను.. రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు

Google Assistant: గూగుల్ అసిస్టెంట్ నుంచి త్వరలోనే కొత్త అప్‌డేట్ .. రంగురంగుల రూపంలో డార్క్‌ థీమ్‌

Tejaswin Shankar: గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్న తేజస్విన్‌ శంకర్‌… ఈ టోర్నీలో మనోడికి రెండో స్వర్ణం