Romance: శృంగారం సమయంలో ఇలాంటి తప్పుడు చేస్తున్నారా..? అయితే మీరు ఎంజాయ్‌ చేయలేరు

|

Aug 13, 2022 | 10:22 AM

Romance: శృంగారం అనేది దాంపత్య జీవితంలో ఉండే ముఖ్యమైన ప్రక్రియ. ఇది జీవితంలో చాలా ముఖ్యమైనది. అయితే శృంగార జీవితంలో చాలా మంది కొన్ని తప్పులను చేస్తుంటారు..

Romance: శృంగారం సమయంలో ఇలాంటి తప్పుడు చేస్తున్నారా..? అయితే మీరు ఎంజాయ్‌ చేయలేరు
Follow us on

Romance: శృంగారం అనేది దాంపత్య జీవితంలో ఉండే ముఖ్యమైన ప్రక్రియ. ఇది జీవితంలో చాలా ముఖ్యమైనది. అయితే శృంగార జీవితంలో చాలా మంది కొన్ని తప్పులను చేస్తుంటారు. చిన్నపాటి పొరపట్ల వల్ల మీరు ఈ జీవితాన్ని అస్వాదించలేరు. మీరు శృంగారంలో పాల్గొనే ముందు మీ భాగస్వామికి నచ్చిన విధంగా ఉండాలి. ఇద్దరు కొన్ని నచ్చవచ్చు.. కొన్ని నచ్చకపోవచ్చు. మీకు నచ్చింది ఎదిటివారు ఇష్టపడాలని ఏమి ఉండదు. ఇద్దరి ఇష్ట ఇష్టాలతోనే ముందుకు సాగితే మంచి అనుభూతిని పొందవచ్చంటున్నారు నిపుణులు. ఇద్దరు పాల్గొనే ముందు మీ భాగస్వామికి ఏం నచ్చుతుందో ముందుగా తెలుసుకోవడం మంచిది. దేనిని ఎక్కుగా ఇష్టపడతారో తెలుసుకోవాలి. ఇలాంటి అంశాలు మీ ఇద్దరి మధ్య శారీరక, మానసిక బంధాన్ని బలంగా పెంచుతుంది.

మనసులో ఉంచుకోకూడదు..

మీరు శృంగారంలో పాల్గొనే విషయంలో ఏదైనా సమస్యగా అనిపించినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మనసులో పెట్టుకుని అలానే ఉండకూడదు. మీ భాగస్వామితో చర్చించండి. మొహమాటలకు పోవద్దు. ఇలా ఉండటం వల్ల ఇద్దరి మధ్య ఎలాంటి బేధాలు తలెత్తకుండా ఉంటుందట.

ఇవి కూడా చదవండి

నటించవద్దు..

చాలా మంది కొన్ని సందర్భాలలో శృంగారం అంటే పెద్దగా ఇష్టం లేకపోయినా భాగస్వామితో నటిస్తారు. అలా చేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. శృంగార విషయాలు ఒకరినొకరు చర్చించుకోవడం వల్ల ఇద్దరు కూడా ఎంజాయ్‌ చేస్తారు. అన్ని విషయాలు మీ పార్టనర్‌కు చెప్పడం వల్ల ఇద్దరు కూడా శృంగారంలో రెచ్చిపోవచ్చు.

లోపాలు చెప్పుకోకూడదు:

చాలా మంది జంటలు పడక గదిలోకి వెళ్లగానే ఒకరిపై ఒకరు లోపాలు చెప్పుకొంటారు. ఇలా చేయడం వల్ల మూడ్‌లోకి రాలేకపోతారు. నీవ్వు లావుగా ఉన్నావని, లేదా సన్నగా ఉన్నావని, ఇంకేదైనా చెప్పుకొంటూ ఒకరిపై ఒకరు చెప్పుకోవడంతో సరిపోతుంది. దీని వల్ల ఇద్దరి మధ్య గ్యాప్‌ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇలాంటి విషయాలు ఒకరిపై ఒకరు చెప్పుకోవడం వల్ల మీ భాగస్వామి మూడ్‌ పాడయ్యేలా చేస్తుంది. రాత్రి కాగానే బెడ్‌పైకి వెళ్లగానే ఇలాంటి విషయాలను చర్చించుకోకపోవడం మంచిదంటున్నారు. ఇలాంటి విషయాలు డిస్కషన్‌లోకి వస్తే వెంటనే పక్కనపెట్టేయండి. వాటి జోలికి వెళ్లకపోవడం మంచిది.

అలాగే మీరు బెడ్‌పై వెళ్లాక శృంగారానికి ముందు మీ పాత గర్ల్‌ఫ్రెండ్‌, బాయ్‌ఫ్రెండ్‌ విషయాలు అస్సలు తీసుకురాకండి. ఇలాంటి విషయాల వల్ల ఇద్దరు మధ్య శృంగార జీవితం దూరమవుతుంది. ఇలాంటి విషయాలు సీరియస్‌గా మారి మూడ్‌ చెడిపోయి మీ శృంగార సామర్థ్యం తగ్గిపోతుంది. అందుకు బెడ్‌రూమ్‌లోకి వెళ్లాక ఇద్దరు కూడా మంచి వాతావరణంలో, మంచి ఆలోచనలతో మొదలు పెట్టడం బెటర్‌ అంటున్నారు. అంతేకాకుండా ఇంటి విషయాలు, ఆర్థిక సంబంధిత విషయాలు కూడా తీసుకురాకపోవడం మంచిది. ఇవి మీ ఇద్దరి మధ్య మూడ్‌ను చెడగొట్టే ప్రమాదం ఉంది. దీని వల్ల మీరు శృంగారంలో ఎంజాయ్‌ చేయలేకపోతారు.

శృంగారానికి ముందు ఈ టిప్ప్‌ పాటించండి:

ఇద్దరు భార్య భర్తలు శృంగారానికి ముందు కొన్ని టిప్స్‌ పాటించాలంటున్నారు నిపుణులు. బెడ్‌పైకి వెళ్లగానే ఇద్దరు కాసేపు మాట్లాడుకోవడం వల్ల మంచి మూడ్‌లోచి జారుకోచ్చు. ఒకరినొకరు కాస్త రోమాన్స్‌ చేసుకోవడం వల్ల మంచి మూడ్‌ను ఆస్వాదించవచ్చు. శృంగారం తర్వాత కూడా ఇద్దరు భాగస్వాములు మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల ఇద్దరు మధ్య బంధం మరింతగా దృఢంగా మారుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతంది.)