Beauty: అందానికి అరటి పండును ఉపయోగిస్తే.. మీ చర్మం మిలమిల మెరిసిపోతుంది..!

|

May 02, 2023 | 3:59 PM

ఈ పండులో ఉన్న విటమిన్‌ ఎ చర్మంలో ఉండే సహజ నూనెలను పునరుద్ధరిస్తుంది. విటమిన్‌ ఇ పాడెైన చర్మాన్ని మరమ్మతు చేస్తుంది. విటమిన్‌ సి చర్మ కణాలలోని విషవాయువులను నిల్వ ఉంచకుండా చేయడంతోపాటు సన్నటి గీతలు ఏర్పడటం, వయసు పెరిగినట్టు కనిపించడాన్ని తగ్గిస్తుంది.

Beauty: అందానికి అరటి పండును ఉపయోగిస్తే.. మీ చర్మం మిలమిల మెరిసిపోతుంది..!
Follow us on

పుచ్చకాయ, దోసకాయ, కొబ్బరి చర్మం, జుట్టు సంరక్షణలో సహాయపడతాయని మనందరికీ తెలిసిందే. అదేవిధంగా అరటిపండు కూడా చర్మ సౌందర్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. అరటిపండు శరీరానికి చల్లదనాన్ని అందించడమే కాదు. ఇది చర్మాన్ని కూడా చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. అరటిపండు పొడి చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. ఇందులో పొటాషియం, తేమ పుష్కలంగా ఉండటం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. అందుకే అరటిపండును ఉపయోగించడం వల్ల చర్మానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. చర్మానికి అరటి పండును అప్లై చేయటం వల్ల అది చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. అరటిపండును చర్మంపై ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల్లో ఒకటి అరటిపండు గుజ్జులోని ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్‌లు చర్మానికి సహజమైన ఎక్స్‌ఫోలియంట్‌గా పనిచేసి, చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తాయి.

అరటి తొక్కలు యాంటీ మైక్రోబియల్‌గా పనిచేస్తాయి. అరటి తొక్కలు వాటి అధిక పాలీఫెనాల్ కంటెంట్ కారణంగా సహజంగా యాంటీమైక్రోబయల్‌గా ఉంటాయి. మీ చర్మాన్ని శుభ్రపరచడంలో అద్భుతమైనవిగా పనిచేస్తాయి.. ఈ పాలీఫెనాల్స్ యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కూడా కలిగి ఉంటాయి. అంతేకాదు అరటి పండు చర్మానికి యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్స్‌ను అందిస్తుంది. ముఖం పై గీతలు, పొట్టులేవటం వంటివాటి వల్ల ముఖం పొడిబారుతోంది. ముఖంలో తేమను నిలపడానికి అరటిపండ్లు ఉపయోగపడతాయి. ఈ పండులో ఉన్న విటమిన్‌ ఎ చర్మంలో ఉండే సహజ నూనెలను పునరుద్ధరిస్తుంది. విటమిన్‌ ఇ పాడెైన చర్మాన్ని మరమ్మతు చేస్తుంది. విటమిన్‌ సి చర్మ కణాలలోని విషవాయువులను నిల్వ ఉంచకుండా చేయడంతోపాటు సన్నటి గీతలు ఏర్పడటం, వయసు పెరిగినట్టు కనిపించడాన్ని తగ్గిస్తుంది.

నేచురల్ బోటాక్స్ అని ప్రసిద్ది చెందిన అరటిపండ్లు, ముడతలను తగ్గించే పదార్థాలను కలిగి ఉంటాయి. ఇవి వయస్సు మచ్చలను తొలగించి, ముడతలు ఏర్పడకుండా నిరోధిస్తాయి. సన్ డ్యామేజ్ నుండి కూడా రక్షిస్తుంది. చర్మంపై అరటిపండును అప్లై చేయటం వల్ల మరొక ప్రయోజనం ఏమిటంటే అవి యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి సూర్యరశ్మి నుండి రక్షించి మీ చర్మం, సహజ సామర్థ్యాన్ని కాపాడతాయి. అరటి తొక్కలు చాలా శీతలీకరణ, యాంటీ ఇన్ఫ్లమేటరీ, పొడి లేదా మోటిమలు-మచ్చలు కలిగిన చర్మంపై ఉపయోగించినట్టయితే వాటిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..