Child Eye Care: మీ పిల్లల కంటి చూపును మార్ప్‌గా మార్చే టిప్స్.. డోంట్ మిస్..!
ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా పెరిగింది. పిల్లలు కూడా ఐపాడ్స్, ఫోన్స్, ల్యాప్ టాప్స్, కంప్యూటర్లు, టీవీలు ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అంతే నష్టాలు కూడా ఉన్నాయి. ఇవి పిల్లల కంటి ఆరోగ్యాన్ని బలహీనంగా మారుస్తున్నాయి. ఇప్పుడున్న సమయంలో ఏ పిల్లల్ని కదిలించినా.. కంటి సమస్యల గురించి చెబుతున్నారు. అంతే కాకుండా సరైన ఫుడ్ తినని కారణంగా..
ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా పెరిగింది. పిల్లలు కూడా ఐపాడ్స్, ఫోన్స్, ల్యాప్ టాప్స్, కంప్యూటర్లు, టీవీలు ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అంతే నష్టాలు కూడా ఉన్నాయి. ఇవి పిల్లల కంటి ఆరోగ్యాన్ని బలహీనంగా మారుస్తున్నాయి. ఇప్పుడున్న సమయంలో ఏ పిల్లల్ని కదిలించినా.. కంటి సమస్యల గురించి చెబుతున్నారు. అంతే కాకుండా సరైన ఫుడ్ తినని కారణంగా కూడా కంటి సమస్యలు వస్తున్నాయి. చిన్నప్పటి నుంచే పిల్లల ఆరోగ్యం విషయంలో పిల్లలు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది కంటికి కూడా వర్తిస్తుంది. ఇప్పుడు పిల్లలు ఎక్కువగా స్క్రీనింగ్‌కి అలవాటు పడుతున్నారు. కాబట్టి వాళ్ల కళ్లపై ఒక కన్నేసి ఉండటం మంచిది. ఇప్పుడు చెప్పే రెమిడీలు పాటిస్తే.. పిల్లల కంటి సమస్యలు తగ్గించడమే కాకుండా కంటి చూపు కూడా మెరుగ్గా ఉంటుంది. మరి అవేంటో ఇప్పుడు చూసేయండి.
స్క్రీన్ టైమ్‌ని తగ్గించండి:
ఒక్కటే సారి పిల్లలకు ఫోన్లు, గ్యాడ్జెట్లు ఇవ్వడం ఆపేయకూడదు. మెల్ల మెల్లగా ఆ అలవాటును దూరం చేయండి. పిల్లలు గ్యాడ్జెట్స్‌ని దూరం చేయాలంటే.. వాళ్లతో కలిసి మీరు కూడా ఆడటం ప్రారంభించండి. ఏదో ఒక పని చెబుతూ ఉండండి. ప్రారంభంలో మాట వినకపోయినా.. ఆ తర్వాత మెల్లగా మీ మాట వింటారు.
హెల్దీ ఫుడ్:
పిల్లల కంటి చూపును మెరుగు పరచడంలో ఆహారం కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. కాబట్టి వాళ్లకు ఆరోగ్యవంతమైన ఫుడ్‌ని అందించండి. ఆరోగ్యకరమైన ఆహారం వలన కేవలం కళ్లు మాత్రమే కాకుండా.. శరీరం కూడా హెల్దీగా ఉంటుంది.
సన్ లైట్‌కి దూరం:
ముక్యంగా పిల్లలు బయటకు వెళ్లినప్పుడు డైరెక్ట్‌గా సన్ కంటిపై పడకుండా చూడండి. సన్ లైట్‌ని నేరుగా చూడటం వల్ల కంటి రెటీనా దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయి. బయట ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు సన్ గ్లాసెస్ పెట్టుకోండి. ఇది హానికర యూవీ కిరణాల నుంచి మీ కళ్లను కాపాడతాయి.
ఐ క్లెన్సింగ్:
ఐ క్లెన్సింగ్ వల్ల మీ కళ్లు శుభ్ర పడటమే కాకుండా.. కంటి చూపు కూడా మెరుగు పడుతుంది. కంటి సమస్యలు రాకుండా ఉంటుంది. కంటిని అప్పుడప్పుడూ గోరు వెచ్చటి నీటితో కడుగుతూ ఉండాలి. ఐ క్లెన్సింగ్ కోసం వేడి నీళ్లే లేదా అతి చల్లగా ఉండే నీళ్లు ఉపయోగించ కూడదు. దీని వలన కళ్లపై ఉండే దుమ్ము, ధూళి బయటకు పోతాయి.
సోంపు తినండి:
సోంపులో కూలింగ్ గుణాలు అనేవి అధికంగా ఉంటాయి. కాబట్టి అప్పుడప్పుడూ సోంపు టీ తాగుతూ ఉంటే.. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అంతే కాకుండా కంటి చూపు కూడా మెరుగు పడుతుంది. కంటి నొప్పులు ఏమైనా ఉంటే తగ్గుతాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి.