Kitchen Hacks: గోడలపై మరకలు, మచ్చలు, పెన్ను గీతలు పోవాలంటే.. ఇలా చేయండి..

|

Jul 31, 2024 | 5:02 PM

గోడలపై ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మరీ ఇష్టమైన పెయింటింగ్స్ వేయించుకుంటూ ఉంటాం. గోడలు ఎంత నీటిగా ఉంటే ఇల్లు అంత అందంగా కనిపిస్తుంది. అందులోనూ గోడలపై లైట్ కలర్స్‌పై ఏవైనా మరకలు, మచ్చలు, పెన్ను గీతలు పడ్డాయంటే చూడటానికి చాలా దరిద్రంగా ఉంటుంది. మన చూపు ఎప్పుడూ వాటిపైకే వెళ్తుంది. ఇక ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాళ్లు ఎక్కడో ఓ చోట ఏదో ఒకటి చేసి గోడలను పాడు..

Kitchen Hacks: గోడలపై మరకలు, మచ్చలు, పెన్ను గీతలు పోవాలంటే.. ఇలా చేయండి..
Kitchen Hacks
Follow us on

గోడలపై ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మరీ ఇష్టమైన పెయింటింగ్స్ వేయించుకుంటూ ఉంటాం. గోడలు ఎంత నీటిగా ఉంటే ఇల్లు అంత అందంగా కనిపిస్తుంది. అందులోనూ గోడలపై లైట్ కలర్స్‌పై ఏవైనా మరకలు, మచ్చలు, పెన్ను గీతలు పడ్డాయంటే చూడటానికి చాలా దరిద్రంగా ఉంటుంది. మన చూపు ఎప్పుడూ వాటిపైకే వెళ్తుంది. ఇక ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాళ్లు ఎక్కడో ఓ చోట ఏదో ఒకటి చేసి గోడలను పాడు చేస్తూ ఉంటారు. అలాగని గోడలపై ఎక్కువగా రుద్దితే పెయింటింగ్ పోతుంది. దీంతో ఏం చేయాలా అని? తలలు పట్టుకుంటారు. అంతే కాకుండా పండుగల సమయంలో పసుపు, కుంకుమ, ఆయిల్ మరలకు కూడా పడుతూ ఉంటాయి. కానీ కొన్ని రకాల చిట్కాలు ట్రై చేస్తే.. ఖచ్చితంగా గోడలపై పడ్డ మరకలను ఈజీగా తొలగించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

ఆల్కహాల్:

ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే గోడలపై పెన్ను, పెన్సిల్, ఇంక్ మరకలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ మొండి మరకలు అస్సలు పోవు. మళ్లీ కొత్తగా పెయింటింగ్ వేయాల్సిందే. కానీ ఈ మరకలు ఉంటే ఆల్కహాల్‌తో పోగొట్టవచ్చు.
ఒక పాత్రలో ఆల్కహాల్ వేసి అందులో కాటన్ క్లాత్ లేదా స్పాంజ్ ముంచండి. ఆ తర్వాత గోడలపై సున్నితంగా రుద్దండి. ఇలా కాసేపటికి మరకలు పోతాయి. ఆ తర్వాత శుభ్రమైన తడి క్లాత్‌తో తుడిచేస్తే చాలు.

వెనిగర్ – బేకింగ్ సోడా:

ఎలాంటి వాటిని క్లీన్ చేయాలన్నా.. ఎలాంటి మొండి మరకలను వదించాలన్నా బేకింగ్ సోడా, వెనిగర్ ఎంతో హెల్ప్ చేస్తాయి. కిచెన్‌లోనే కాకుండా గోడలపై ఉండే మరకలను కూడా బేకింగ్ సోడా, వెనిగర్‌తో పోగొట్టవచ్చు. ముందుగా మరకలు ఉన్న చోట బేకింగ్ సోడా చల్లండి. ఆ తర్వాత ఒక పాత్రలో వెనిగర్ తీసుకుని అందులో కాటన్ క్లాత్ లేదా స్పాంజ్‌ ముంచి బేకింగ్ సోడా వేసిన ప్రదేశంలో రుద్దాలి. ఇలా కాసేపటికి మరకలు పోతాయి. ఆ తర్వాత మరో మంచి క్లాత్‌తో శుభ్రం చేసుకుంటే చాలు. అదే విధంగా డిష్ వాష్ లిక్విడ్‌తో కూడా గోడలను శుభ్రం చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..