Chanakya Niti: ఇతరులు మీ దారిలోకి రావాలంటే ఇలా చేయండి..

|

Oct 14, 2024 | 4:39 PM

మనిషి ఎలా బతకాలో.. నడవడిక ఎలా ఉండాలో తెలిపిన వ్యక్తి చాణక్యుడు. చాణక్య నీతిని ఎంతో మంది ఫాలో చేస్తూ ఉంటారు. చాణుక్యుడు చెప్పిన నీతులకు సంబంధించి కొన్ని రకాల పుస్తకాలు కూడా మనకు లభ్యవుతాయి. భార్య భర్తతో.. భర్తతో భార్య.. పిల్లలతో.. పెద్దలతో.. ఎలాంటి ధర్మాలు, సూత్రాలు పాటించాలో క్షుప్తంగా వివరించాడు చాణక్యుడు. ఈ క్రమంలోనే ఇతరులను మీ దారిలోకి ఎలా తెచ్చుకోవాలో కూడా తెలిపాడు చాణక్య. ప్రపంచంలో వక్యుల మనస్తత్వాలు..

Chanakya Niti: ఇతరులు మీ దారిలోకి రావాలంటే ఇలా చేయండి..
Chanakya Niti
Follow us on

మనిషి ఎలా బతకాలో.. నడవడిక ఎలా ఉండాలో తెలిపిన వ్యక్తి చాణక్యుడు. చాణక్య నీతిని ఎంతో మంది ఫాలో చేస్తూ ఉంటారు. చాణుక్యుడు చెప్పిన నీతులకు సంబంధించి కొన్ని రకాల పుస్తకాలు కూడా మనకు లభ్యవుతాయి. భార్య భర్తతో.. భర్తతో భార్య.. పిల్లలతో.. పెద్దలతో.. ఎలాంటి ధర్మాలు, సూత్రాలు పాటించాలో క్షుప్తంగా వివరించాడు చాణక్యుడు. ఈ క్రమంలోనే ఇతరులను మీ దారిలోకి ఎలా తెచ్చుకోవాలో కూడా తెలిపాడు చాణక్య. ప్రపంచంలో వక్యుల మనస్తత్వాలు వేరువేరుగా ఉంటాయి. అలాంటి వాళ్లను మన దారిలోకి తెచ్చుకోవలంటే చాలా కష్టమైన పనే. కానీ కొన్నింటిని పాటిస్తే ఎంతో సింపుల్‌గా ట్రై చేయవచ్చు. ఒకరి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత వారిని మీ దారిలోకి తెచ్చుకోవడానికి మరింత మార్గం సులభం అవుతుంది. మరి చాణక్యుడు చెప్పిన ఆ విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

కోపంగా ఉండేవారిని..

కోపంగా ఉండే వారిని కూడా మన దారిలోకి తీసుకు రావచ్చు. వీరు కోపంగా, ఆవేశంగా మాట్లాడతారు. కాబట్టి వీరితో ఎప్పుడూ మర్యదగా, ప్రశాంతంగా ప్రవర్తించాలి. దీంతో ఆటోమెటిక్ గా కూల్ అయిపోతారు. కోపాన్ని ఎప్పుడూ ప్రదర్శించకూడదు. కోపాన్ని ప్రదర్శిస్తే ఎంత దూరం వెళ్లేందుకు అయినా సిద్ధ పడుతారు. ఇలా చేస్తే మీ దారిలోకి వస్తారు.

మూర్ఖపు స్వభావం ఉన్నవారిని…

మూర్ఖత్వంతో ఉన్నవారిని సైతం మీ దారిలోకి తీసుకు రావచ్చు. వీళ్లను ఎప్పుడూ పొగుడుతూ ఉండాలి. వీరినే ఎప్పుడూ ఫాలో చేస్తున్నట్టు చెప్పాలి. దీంతో ఆటోమెటిక్‌గా వీరు కూడా మీ దారిలోకి వచ్చేస్తారు.

ఇవి కూడా చదవండి

ప్రతిభావంతులతో..

ఎంతటి ప్రతిభావంతులనైనా కూడా మీ దారిలోకి తీసుకొచ్చి.. మీ మాట వినేలా చేయవచ్చు. వీరితో ఎప్పుడూ నిజాలే మాట్లాడాలి. దీంతో వారు మీ పట్ల ఆకర్షితులై, మీతో మాట్లాడేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తారు. అలా వీరిని మీ దారిలోకి తీసుకు రావచ్చు.

ఈగోతో ఉన్నవారు..

ఈగో మనస్తత్వం ఉన్నవారిని కూడా దారిలోకి తీసుకు రావచ్చు. వీరితో ఎప్పుడూ మర్యాదగా ప్రవర్తించాలి. ఇలా చేయడం వల్ల వీరు కూడా మీ దారిలోకి వస్తారు. అలాగే స్థార్థ, అత్యాశ పరులను డబ్బు, ధనం ఆశ చూపి మీ దారిలోకి తీసుకు రావచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..