Eye Care: కంటి సమస్యలు రాకుండా ఉండాలంటే.. ఇలా చేయండి!

|

Feb 28, 2024 | 3:47 PM

శరీరంలో కళ్లు అనేవి అత్యంత సున్నితమైన భాగంగా చెబుతారు. అలాగే ఎక్కువగా ఒత్తిడి పడేది కూడా కళ్లపైనే. పని ఎక్కువైనా.. నిద్ర తక్కువైనా.. కంప్యూటర్లను చూస్తూ ఉన్నా.. కళ్లు అనేవి ఎక్కువగా ఒత్తిడికి గురి అవుతూ ఉంటాయి. ప్రస్తుతం చాలా మంది ఎక్కువ సమయం టీవీలు, ఫోన్లు, కంప్యూటర్లు చూస్తూ జీవితం సాగిస్తున్నారు. దీంతో రకరకాల కంటి సమస్యలు వస్తున్నాయి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామాలు చేస్తున్నట్లే.. కళ్లకు కూడా సపరేటుగా వ్యాయామాలు అనేవి..

Eye Care: కంటి సమస్యలు రాకుండా ఉండాలంటే.. ఇలా చేయండి!
Eyes Care Tips
Follow us on

శరీరంలో కళ్లు అనేవి అత్యంత సున్నితమైన భాగంగా చెబుతారు. అలాగే ఎక్కువగా ఒత్తిడి పడేది కూడా కళ్లపైనే. పని ఎక్కువైనా.. నిద్ర తక్కువైనా.. కంప్యూటర్లను చూస్తూ ఉన్నా.. కళ్లు అనేవి ఎక్కువగా ఒత్తిడికి గురి అవుతూ ఉంటాయి. ప్రస్తుతం చాలా మంది ఎక్కువ సమయం టీవీలు, ఫోన్లు, కంప్యూటర్లు చూస్తూ జీవితం సాగిస్తున్నారు. దీంతో రకరకాల కంటి సమస్యలు వస్తున్నాయి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామాలు చేస్తున్నట్లే.. కళ్లకు కూడా సపరేటుగా వ్యాయామాలు అనేవి ఉంటాయి. ఇవి చేయడం వల్ల కంటి సమస్యలు తగ్గడమే కాకుండా.. దృష్టి అనేది కూడా మెరుగు పడుతుంది. మరి ఆ కళ్ల వ్యాయమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

అరచేతులతో కళ్లను రుద్దండి:

రెండు అర చేతులను కాసేపు రుద్దండి. ఇప్పుడు కళ్లు మూసి.. అరచేతులను కళ్లపై ఉంచండి. దీని వల్ల కళ్లకు వేడి వస్తుంది. ఇప్పుడు లోతైన శ్వాస తీసుకోండి. ఇలా చేస్తూ ఉండటం వల్ల.. కంటి ఒత్తిడి అనేది కాస్త తగ్గుతుంది.

ఐ బాల్‌ను తిప్పండి:

వెన్నుముకను నిటారుగా ఉంచి కూర్చోండి. ఐబాల్‌ను పది సార్లు వృత్తాకార కదలికలో తప్పాలి. ఆ తర్వాత మీ కళ్లను నెమ్మదిగా కదిలించాలి. ఇలా చేయడం వల్ల కంటి కండరాలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఎప్పుడూ ఒకే వైపు చూసేవారికి ఈ వ్యాయామం బాగా సహాయ పడుతుంది.

ఇవి కూడా చదవండి

బొటన వేలు వ్యాయామం:

వెన్నుముక వంచకుండా నిటారుగా కూర్చోండి. ఇప్పుడు చేతులను ముందుకు చాచి.. మీ బొటన వేళ్లను థంబ్స్ అప్ లాగా ఉంచాలి. ఇప్పుడు ఆ వేలును కాసేపు చూసి.. ఆ తర్వాత దూరంగా ఉండే వాటిని చూడండి. దీని వల్ల కంటి కండరాలు బలంగా మారి.. దృష్టి అనేది బాగా మెరుగు పడుతుంది.

కంటి ఒత్తిడి తగ్గుతుంది:

ఈ వ్యాయామం కూడా కంటి ఒత్తిడిని తగ్గించేందుకు బాగా సహాయ పడుతుంది. మోకాళ్లను వంచి చీల మండల మీద కూర్చోవాలి. ఇప్పుడు శరీరాన్ని ముందుకు వంచాలి. ఛాతీ తొడలపై ఉండే విధంగా శరీరాన్ని వంచాలి. ఆ తర్వాత నుదిటిని నేలపై ఉంచండి. రెండు చేతులను ముందుకు చాచాలి. ఇప్పుడు మీ కళ్లను మైసుకుని నెమ్మదిగా ఊపిరి అనేది పీల్చుకుంటూ ఉండాలి. ఈ వ్యాయమాం కేవలం కంటి ఒత్తిడే కాకుండా.. మెడ, భుజం నొప్పులను కూడా తగ్గించేందుకు బాగా హెల్ప్ చేస్తుంది. ఇలా ఈ వ్యాయామాలు చేస్తూ సరైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల వచ్చిన కంటి సమస్యలు తగ్గడమే కాకుండా.. కంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.