ప్రస్తుత కాలంలో చాలా మంది బాధ పడే సమస్యల్లో కీళ్ల నొప్పలు కూడా ఒకటి. యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడే కీళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలు ఎటాక్ చేస్తున్నాయి. మారిన జీవన శైలిలో అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. కీళ్ల నొప్పులకు ఎలాంటి చికిత్సలు తీసుకున్నా కంట్రోల్ అవడం లేదు. ఇందుకు ముఖ్య కారణం ఆహారం. కీళ్ల నొప్పులతో బాధ పడేవారు కొన్ని రకాల ఆహారాలను అస్సలు తీసుకోకూడదు. దీని వలన కీళ్ల నొప్పుల సమస్య మరింత పెరుగుతుంది. ఇంతకీ ఎలాంటి ఆహారాలు తీసుకోవడం వలన కీళ్ల నొప్పులు మరింత పెరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోవడం వలన కీళ్ల నొప్పులు అనేవి మరింత పెరుగుతాయి. ఎందుకంటే ఇందులో ప్యూరిన్స్ ఎక్కువగా ఉంటాయి. తెలీకుండా వీటిని ఎక్కువగా తినడం వల్ల కీళ్ల నొప్పులు, నడుము నొప్పి పెరుగుతాయి. ఈ ప్యూరిన్స్ అేవి శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను కూడా పెంచుతాయి. అంతే కాకుండా గౌట్ అనే వ్యాధికి దారి తీస్తుంది.
చాలా మంది మంచిది కదా అని చేపలు, రొయ్యలు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. వీటిల్లో కూడా ప్యూరిన్స్ అధికంగా ఉంటాయి. వీటి వల్ల శరీరంలో తీవ్రమైన నొప్పులు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతుననారు. కాబట్టి వీటిని మితంగా తీసుకోవడమే బెటర్.
షుగర్ అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవడం వలన కూడా కీళ్ల నొప్పులు అనేవి తీవ్రంగా వస్తాయి. కాబట్టి కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులతో బాధ పడేవారు షుగర్ ఎక్కువగా ఉండే ఆహారాలు అస్సలు తీసుకోపోవడమే మంచిది.
సోయా తినడం ఆరోగ్యానికి మంచిదే. ఎందుకంటే ఇందులో ప్రోటీన్ మెండుగా లభిస్తుంది. కానీ మరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంత మందిలో ఇది అలర్జీని కలిగిస్తుంది. అలాగే కీళ్ల నొప్పులు కూడా పెంచుతుంది. సోయా తిన్న తర్వాత మీకు కాళ్ల నొప్పులు వస్తే మాత్రం.. వీటిని తినకపోవడం మంచిది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..