Live 100 Years: వందేళ్లు దాటినవారి ఆరోగ్య రహస్యమిదే.. కొత్త అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..?

|

Apr 05, 2023 | 3:27 PM

చిన్న వయసులోనే గుండెపోటు, క్యాన్సర్, బ్రెయిన్ స్ట్రోక్ వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఎందరో మరణిస్తున్నారు. అయితే ఈ పరిస్థితులలో కూడా ఏ నిశ్చింత లేకుండా సెంచరీ కొట్టేస్తున్న మనుషులు మన మధ్యలోనే చాలా మంది ఉన్నాారు. అయితే వీరిలో విపరీతంగా పనిచేసే ప్రత్యేకమైన..

Live 100 Years: వందేళ్లు దాటినవారి ఆరోగ్య రహస్యమిదే.. కొత్త అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..?
Study On Centenarians
Follow us on

అతి చిన్న వయసులోనే గుండెపోటు, క్యాన్సర్, బ్రెయిన్ స్ట్రోక్ వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఎందరో మరణిస్తున్నారు. అయితే ఈ పరిస్థితులలో కూడా ఏ నిశ్చింత లేకుండా సెంచరీ కొట్టేస్తున్న మనుషులు మన మధ్యలోనే చాలా మంది ఉన్నాారు. అయితే వీరిలో విపరీతంగా పనిచేసే ప్రత్యేకమైన రోగనిరోధక శక్తి ఉంటుందని, అదే వారి అసాధారణమైన దీర్ఘాయువుకు సహాయపడుతుందని ఒక కొత్త అధ్యయనం తెలియజేస్తుంది. అవును, 100 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జీవించే వ్యక్తులలో విభిన్నమైన రోగనిరోధక శక్తి కణాలు ఉంటాయని,  అదే వారి ఆరోగ్యాన్ని కాపాడుతుందని బోస్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కి చెందిన డీఎన్ఏ పరిశోధకులు తెలిపారు. ఇక దీనికి సంబంధించిన వివరాలను EBioMedicine అనే జర్నల్ ప్రచురించింది.

సాధారణంగా వృద్ధాప్యకాలంలో రోగనిరోధక వ్యవస్థ పనితీరులో క్షీనత కనిపిస్తుందని అనేక అధ్యయనాలు తెలిపాయి. కానీ కొత్త అధ్యయనాల్లో అందుకు భిన్నమైన ఫలితాలను కనుగొన్నారు. దీనిపై సీనియర్ అధ్యయన రచయిత స్టిఫెనో మోంటీ మాట్లాడుతూ ‘100 సంవత్సరాల వయసు ఉన్నవారి నుంచి అతిపెద్ద సింగిల్-సెల్ డేటాసెట్‌ను తీసుకుని దానిపై విశ్లేషించాము. ఈ విశ్లేషణ 100 ఏళ్ల కంటే ఎక్కువ కాలం జీవించేవారిలోని ప్రత్యేక లక్షణాలను, వారి దీర్ఘాయువుకు దోహదపడే జీవనశైలి కారకాలను గుర్తించడానిక మాకు ఎంతగానో ఉపయోగపడింద’ని అన్నారు.

ఇంకా ఇదే విషయంపై మరో సీనియర్ రచయిత తాన్యా కరాగియన్నిస్ కూడా ‘100 ఏళ్లు దాటి జీవించేవారిలో వ్యాధి నుంచి కోలుకోవడానికి, ఇంకా కొంత కాలం జీవించడానికి వీలు కల్పించే రక్షణ కారకాలను కలిగి ఉన్నారనే విషయ పరికల్పనకు మా అధ్యయనాలు సహకరించాయ’ని పేర్కొన్నారు. అయితే 100 ఏళ్లు జీవిస్తున్న సెంటనేరియన్లలోని ప్రత్యేక వ్యాధినిరోధక శక్తికి గల కారణాలు, వాటి కోసం వారు ఎలాంటి ఆహారపు అలవాట్లు, జీవనశైలి అవలంభిస్తున్నారనే విషయాలపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..