BP Control Tips: మందులు వాడకుండానే బీపీని కంట్రోల్ చేసుకోవచ్చని మీకు తెలుసా?
ఇప్పుడున్న రోజుల్లో బీపీ అంటే రక్త పోటు, డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి ఉండటం సర్వ సాధారణంగా మారాయి. ఒక్కసారి మీ లైఫ్‌లోకి బీపీ, షుగర్లు వచ్చాయంటే.. మీ జీవితాంతం ఇవి మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. బీపీ, షుగర్లు రావడానికి ముఖ్య కారణం మీరు తినే ఆహారం, మీ లైఫ్ స్టైల్. మీరు ఆరోగ్యకరమైన ఆహారమే అయినా.. అవి స్వచ్చంగా ఉంటున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. వీటికి తీడు ఒత్తిడి, ఆందోళన కూడా ఎక్కువ..

ఇప్పుడున్న రోజుల్లో బీపీ అంటే రక్త పోటు, డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి ఉండటం సర్వ సాధారణంగా మారాయి. ఒక్కసారి మీ లైఫ్‌లోకి బీపీ, షుగర్లు వచ్చాయంటే.. మీ జీవితాంతం ఇవి మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. బీపీ, షుగర్లు రావడానికి ముఖ్య కారణం మీరు తినే ఆహారం, మీ లైఫ్ స్టైల్. మీరు ఆరోగ్యకరమైన ఆహారమే అయినా.. అవి స్వచ్చంగా ఉంటున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. వీటికి తీడు ఒత్తిడి, ఆందోళన కూడా ఎక్కువ అవడం. ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా మీకు రక్త పోటు అనేది వస్తుంది. ఈ బీపీ యంగ్ ఏజ్‌లో ఉన్నవారికి సైతం వచ్చేస్తుంది. బీపీ వల్ల గుండె సమస్యలు రావచ్చు. హార్ట్ స్ట్రోక్ వంటివి ఎటాక్ చేస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కసారి బీపీ వచ్చిందంటే.. కంట్రోల్ చేసుకోడం చాలా కష్టం. అయితే ఇప్పుడు చెప్పినట్టు చేస్తే.. మందులు లేకుండానే బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల బీపీ నియంత్రణలోకి వస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
మీరు బీపీని మందులు లేకుండా కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే.. ముందు మీ వైద్యుడిని సంప్రదించండి. బీపీని కంట్రోల్ చేసే ఆహారాలు అడిగి తెలుసుకోండి. అలాగే ప్రతీ రోజు బీపీని మానిటర్ చేసుకుంటూ ఉండండి. దీంతో మీకు బీపీ లెవల్స్ తగ్గుతున్నాయా లేక పెరుగుతున్నాయా తెలుస్తుంది.
బీట్ రూట్:
బీట్ రూట్ తినడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది. ఇందులో పొటాషియం, నైట్రిక్ ఆక్సైడ్‌లు ఉంటాయి. ఇవి రక్త నాళాలను విస్తృతం చేస్తాయి. దీంతో రక్తం ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రవహిస్తుంది.
అరటి పండు:
ప్రతి రోజూ మీరు ఒక అరటి పండు తింటే చాలా రకాల లాభాలు ఉన్నాయి. వాటిల్లో బీపీ కూడా తగ్గుతుంది. అరటి పండులో పొటాషియం మెండుగా లభిస్తుంది. ఇది మీ రక్తపోటుపై సోడియం ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీంతో రక్త నాళాలపై ఒత్తిడి తగ్గి.. రక్త పోటు నార్మల్ అవుతుంది.
పుచ్చకాయ:
హై బ్లడ్ ప్రెజర్‌ను తగ్గించడంలో పుచ్చకాయ కూడా ఎంతో చక్కగా పని చేస్తుంది. పుచ్చకాయ తినడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉండటమే కాకుండా.. బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. పుచ్చ కాయలో పొటాషియం, కెరోటినాయిడ్స్ ఉంటాయి. ఇవి ధమని గోడులు, సిరటలు గట్టి పడకుండా నిరోధిస్తాయి. దీంతో బీపీ తగ్గుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)








