AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మీకు గోర్లు కొరికే అలవాటుందా..? వెంటనే మానకపోతే ఏం జరుగుతుందో తెలుసా..

గోర్లు కొరకడం వల్ల శరీరంలో వివిధ వ్యాధులు వస్తాయని అందరికీ తెలిసిన విషయమే. గోళ్ల కింద వివిధ రకాల బ్యాక్టీరియా, దుమ్ము పేరుకుపోతాయి. ఈ గోళ్లు కొరికినప్పుడు బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థలోకి ప్రవేశించి వివిధ వ్యాధులకు కారణమవుతాయి. జ్యోతిష్యం ప్రకారం.. ఈ అలవాటు కూడా చెడ్డది.

Health Tips: మీకు గోర్లు కొరికే అలవాటుందా..? వెంటనే మానకపోతే ఏం జరుగుతుందో తెలుసా..
Nail Biting Astrological Risks
Krishna S
|

Updated on: Sep 03, 2025 | 8:35 PM

Share

పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మందిలో గోర్లు కొరికే అలవాటు ఉంటుంది. కానీ ఇది కేవలం ఒక చెడు అలవాటు మాత్రమే కాదు, ఆరోగ్యానికి, మన జీవితాలకు కూడా హానికరం అని ఆరోగ్య, జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గోళ్లు కొరకడం వల్ల కలిగే నష్టాలు, వాటిని ఎలా నివారించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఆరోగ్యపరమైన నష్టాలు

గోళ్ల కింద సూక్ష్మ క్రిములు, ధూళి, వివిధ రకాల బ్యాక్టీరియా పేరుకుపోతాయి. మనం గోళ్లు కొరికినప్పుడు.. అవి మన జీర్ణవ్యవస్థలోకి ప్రవేశించి కడుపు నొప్పి, ఇన్ఫెక్షన్లు, ఇతర వ్యాధులకు కారణమవుతాయి. ఇది మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

జ్యోతిషశాస్త్రం ప్రకారం..

ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది:

జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గోళ్లు కొరికే అలవాటు సూర్య గ్రహాన్ని బలహీనపరుస్తుంది. దీనివల్ల వ్యక్తిలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. కెరీర్‌లో అడ్డంకులు ఎదురవుతాయి. అంతేకాకుండా సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా తగ్గుతుంది.

డబ్బు సమస్యలు, ఆర్థిక సంక్షోభం:

గోళ్లు కొరకడం శని దోషానికి సంకేతంగా పరిగణిస్తారు. ఈ అలవాటు కారణంగా శని దృష్టి మీపై పడి, డబ్బు లేకపోవడం, ఆర్థిక సంక్షోభం వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే, ఈ అలవాటును వెంటనే మానేయడం చాలా ముఖ్యం.

ఈ అలవాటును ఎలా మానుకోవాలి?

కత్తిరించడం: మీ గోళ్లు పెరగకుండా ఎప్పటికప్పుడు కత్తిరించుకోవడం వల్ల వాటిని కొరికే అవకాశం ఉండదు.

ప్రత్యేక నెయిల్ పాలిష్: మార్కెట్లో చేదు రుచి కలిగిన నెయిల్ పాలిష్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని వాడటం వల్ల గోళ్లు కొరికే అలవాటు క్రమంగా తగ్గుతుంది.

ఒత్తిడి : చాలామంది ఒత్తిడి లేదా ఆందోళనలో ఉన్నప్పుడు గోళ్లు కొరుకుతారు. యోగా, ధ్యానం వంటి వాటిని పాటించడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

గోళ్లు కొరకడం అనేది కేవలం ఒక చిన్న అలవాటుగా అనిపించినా, దాని వల్ల ఆరోగ్యపరంగా, జ్యోతిష్యపరంగా అనేక సమస్యలు వస్తాయి. అందుకే మీ ఆరోగ్యం, అదృష్టం రెండూ బాగుండాలంటే ఈ అలవాటును తక్షణమే మానుకోవాలి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..