AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dark Chocolates: ఆ సమయంలో డార్క్ చాక్లెట్స్ తింటున్నారా..? అసలు మ్యాటర్ తెలిస్తే షాకే..

మీకు డార్క్ చాక్లెట్స్ అంటే ఇష్టమా..? రెగ్యులర్‌గా తింటుంటారా..? వాస్తవానికి డార్క్ చాక్లెట్లతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. మరి నిద్రకు డార్క్ చాక్లెట్లకు ఉన్న లింక్ ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Dark Chocolates: ఆ సమయంలో డార్క్ చాక్లెట్స్ తింటున్నారా..? అసలు మ్యాటర్ తెలిస్తే షాకే..
Dark Chocolate Effects
Krishna S
|

Updated on: Jul 28, 2025 | 7:18 PM

Share

డార్క్ చాక్లెట్స్ అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. ఆడపిల్లలు, చిన్నపిల్లలకు అయితే చెప్పనవసరం లేదు. అది రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. కానీ డార్క్ చాక్లెట్ మీకు నిద్రను దూరం చేస్తుందని తెలుసా? అవును ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, డార్క్ చాక్లెట్‌లో మీ నిద్రను పాడు చేస్తుంది. దాని వెనుక హార్మోన్ల కారణం కూడా ఉంది. దానిలో ఉండే కెఫిన్, థియోబ్రోమిన్ వంటివి మీ నిద్రకు భంగం కలిగిస్తాయి. ఈ రెండు సమ్మేళనాలు నిద్రను ప్రేరేపించే హార్మోన్ మెలటోనిన్ స్థాయిని ప్రభావితం చేస్తాయి. దీంతో నిద్ర పట్టదు. లేదా పదే పదే నిద్రలో మేల్కొంటారు. ముఖ్యంగా రాత్రిపూట తింటే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

డార్క్ చాక్లెట్‌లో ఏముంది?

డార్క్ చాక్లెట్‌లో ఎక్కువ కోకో, తక్కువ చక్కెర లేదా పాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నాయి. ఇది యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, ఫ్లేవనాయిడ్లు వంటి అనేక ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. కానీ దీనితో పాటు కెఫిన్, థియోబ్రోమిన్ కూడా ఉంటాయి. ఈ రెండు పదార్థాలు రుచితో పాటు మీ నిద్రకు భంగం కలిగిస్తాయి.

కెఫిన్ ప్రభావం

డార్క్ చాక్లెట్‌లో ఉండే కెఫిన్ కాఫీలో కూడా ఉంటుంది. ఈ రెండూ మెదడును అప్రమత్తంగా ఉంచడానికి పనిచేస్తాయి. మీరు కెఫిన్ తీసుకున్నప్పుడు, ఇది మీ మెదడులో ఉత్పత్తి అయ్యే మెలటోనిన్ అనే నిద్రను ప్రేరేపించే హార్మోన్‌ను తగ్గిస్తుంది. మెలటోనిన్ అనేది మన శరీరానికి నిద్రపోయే సమయం అని చెప్పే హార్మోన్. కెఫిన్ దానిని అణచివేసినప్పుడు, నిద్రపోవడానికి సమయం పట్టవచ్చు లేదా నిద్రకు పదేపదే అంతరాయం కలిగించవచ్చు.

నిద్రకు ఆటంకాలు..?

థియోబ్రోమిన్ అనేది హృదయ స్పందనను పెంచే, శరీరాన్ని అలర్ట్ మోడ్‌లో ఉంచే ఉద్దీపన లాంటిది. డార్క్ చాక్లెట్‌లో ఎక్కువ మొత్తంలో థియోబ్రోమిన్ ఉంటుంది. దాని ప్రభావం కెఫిన్ కంటే కొంచెం ఎక్కువసేపు ఉంటుంది. శరీరం అలసిపోయినప్పటికీ, డార్క్ చాక్లెట్ తిన్న కొన్ని గంటల తర్వాత కూడా మీకు నిద్ర రాకపోవడానికి ఇదే కారణం.

ఎంత, ఎప్పుడు తినాలి?

మీరు డార్క్ చాక్లెట్ తిన్నా నిద్రకు ఇబ్బంది ఉండొద్దు అనుకుంటే.. ఉదయం లేదా మధ్యాహ్నం తినండి. రాత్రి భోజనం తర్వాత లేదా నిద్రపోయే ముందు డార్క్ చాక్లెట్ తినడం పెద్ద తప్పు. ముఖ్యంగా మీరు ఏదైనా నిద్ర సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతుంటే, మీరు దానిని పూర్తిగా నివారించడం మంచిది.

అందరిపై భిన్నంగా..

గమనించవలసిన విషయం ఏమిటంటే.. ప్రతి ఒక్కరి శరీరం భిన్నంగా ఉంటుంది. కొంతమందికి, కొద్దిగా చాక్లెట్ కూడా వారిని రాత్రంతా మేల్కొనేలా చేస్తుంది. మరోవైపు, కొంతమంది డార్క్ చాక్లెట్ తిన్న తర్వాత కూడా గాఢ నిద్రలోకి జారుకుంటారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..