AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghee: నెయ్యి తింటే నిజంగానే బరువు పెరుగుతారా.? నిపుణులు ఏమంటున్నారంటే

అయితే చాలా మంది నెయ్యి తీసుకుంటే దుష్ప్రభావాలు కలుగుతాయని భావిస్తారు. ముఖ్యంగా నెయ్యి తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారనే భావనలో ఉంటారు. మరి నిజంగానే నెయ్యి తింటే బరువు పెరుగుతారా.? అసలు నెయ్యితో ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. నెయ్యి తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారనేది కేవలం అపోహ మాత్రమేనని...

Ghee: నెయ్యి తింటే నిజంగానే బరువు పెరుగుతారా.? నిపుణులు ఏమంటున్నారంటే
నెయ్యి తినడం వల్ల ఎక్కువ సమయం కడుపు నిండినట్లుగా ఉంటుంది. దీంతో మీరు అతిగా తినకుండా ఉంటారు. తద్వారా బరువు పెరగకుండా ఉంటారు. నెయ్యి తింటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. ముఖం అందంగా కనిపిస్తుంది. చర్మం ముడతలు తగ్గి వయసు తగ్గినట్లుగా మారిపోతారు. జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. నెయ్యి ఎముకల దృఢత్వాన్ని, బలాన్ని, శక్తిని పెంచుతుంది. శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన ఎంజైమ్‌లు ఉదర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
Narender Vaitla
|

Updated on: Jun 29, 2024 | 7:20 PM

Share

నెయ్యి మన జీవితంలో ఒక భాగమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్నారులు తినడానికి మారాం చేస్తే అన్నంలో నెయ్యి వేసి తినిపిస్తుంటారు. పెద్దలు కూడా నెయ్యిని ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇక ఎన్నో రకాల స్వీట్ల తయారీలో, వంటకాల్లో నెయ్యిని ఉపయోగిస్తారు. ప్యూర్‌ నెయ్యితో చేసే స్వీట్స్‌ రుచి మాములుగా ఉండదు. అందుకే నెయ్యిని ఇష్టంగా తింటుంటారు.

అయితే చాలా మంది నెయ్యి తీసుకుంటే దుష్ప్రభావాలు కలుగుతాయని భావిస్తారు. ముఖ్యంగా నెయ్యి తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారనే భావనలో ఉంటారు. మరి నిజంగానే నెయ్యి తింటే బరువు పెరుగుతారా.? అసలు నెయ్యితో ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. నెయ్యి తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారనేది కేవలం అపోహ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు.

ముఖ్యంగా రోజువారీ ఆహారంలో నెయ్యిని చేర్చుకోవడం ద్వారా రోజంతా చురుకుగా ఉండొచ్చని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా గర్భినీలు నెయ్యి తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు. నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంలోని మాయిశ్చరైజర్‌ను కాపాడుతాయి. దీంతో చర్మం ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖంలో నిగారింపు రావాలంటే ప్రతీరోజూ కచ్చితంగా నెయ్యిని ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతున్నారు.

మహిళలు పీరియడ్స్‌ సమయంలో నెయ్యిని కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని హార్మోన్లను బ్యాలెన్స్‌ చేయడంలో నెయ్యి ఎంతగానో ఉపయోగపడుతుంది. నెలసరి క్రమంగా రాని వారికి నెయ్యి దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. నెయ్యిలో విటమిన్‌ కే పుష్కలంగా లభిస్తుంది. ఇది కాల్షియం శోషణలో సహాయపడుతుంది. దంత క్షయాన్ని నివారించడానికి, అథెరోస్ల్కెరోసిస్‌ రాకుండా ఎముకలను బలంగా ఉంచడానికి తోడ్పడుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us