Weight Loss : జిమ్‌కు వెళ్లకుండా రోజుకు 100 పుష్-అప్‌లు చేస్తే.. మీ శరీరంలో జరిగే ఆ షాకింగ్ మార్పులు ఇవే!
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ జిమ్‌కు వెళ్లకుండానే పర్ఫెక్ట్ ఫిట్‌నెస్ , అందమైన శరీరాకృతిని సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం ఇంట్లోనే చేసుకోగలిగే వ్యాయామాలలో 'పుష్-అప్' అత్యంత సులభమైన , అత్యంత ప్రభావవంతమైన బాడీవెయిట్ వర్కవుట్‌గా పేరుగాంచింది. అయితే ఎలాంటి జిమ్ పరికరాలు లేకుండా కేవలం రోజుకు 100 పుష్-అప్‌లు చేయడం వల్ల బరువు తగ్గుతారా, అలాగే దీనివల్ల శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్న పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ఆరోగ్యం, ఫిట్‌నెస్ నివేదికల ప్రకారం, పుష్-అప్‌లు చేయడానికి మీకు ఎలాంటి జిమ్ ఫీజులు లేదా ప్రత్యేక స్థలాలు అవసరం లేదు. క్రమం తప్పకుండా ఆటలు ఆడేవారికి , ఇంట్లోనే ఉండి బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి పుష్-అప్‌లు ఒక అద్భుతమైన వరం లాంటివి. ఇవి శరీరంలోని పైభాగానికి పూర్తి పోషణను అందిస్తూ భుజాలు, ఛాతీ, చేతుల బలాన్ని పెంచడంలో అద్భుతంగా సహాయపడతాయి.
ప్రతిరోజూ 100 పుష్-అప్‌లు చేస్తే… ఫిట్‌నెస్ నిపుణుల వివరాల ప్రకారం, మీరు సరైన పద్ధతిలో ప్రతిరోజూ 100 పుష్-అప్‌లు చేయడం ప్రారంభిస్తే, కేవలం రెండవ వారం నాటికే మార్పులు మీ కళ్ల ముందే కనిపించడం మొదలవుతుంది. మీ చేతులు, ఛాతీ , భుజాల కండరాల ఆకృతిలో స్పష్టమైన మార్పులను గమనించవచ్చు. క్రమం తప్పకుండా చేయడం వల్ల ట్రైసెప్స్, పెక్స్ , భుజాల కండరాల వేగవంతమైన అభివృద్ధికి సహాయపడుతుంది.
అలాగే ఇది శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరిచి గుండె ఆరోగ్యాన్ని పటిష్టం చేస్తుంది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రారంభంలోనే ఒకేసారి 100 పుష్-అప్‌లు చేయడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి మీ సౌకర్యాన్ని బట్టి దీనిని 20 లేదా 25 చొప్పున నాలుగు నుండి ఐదు సెట్లుగా (Sets) విభజించుకుని చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
పుష్-అప్‌లు మాత్రమే చేస్తే.. అయితే కేవలం పుష్-అప్‌లు మాత్రమే చేయడం వల్ల శరీరంలో కొన్ని రకాల లోపాలు లేదా అసమతుల్యతలు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పుష్-అప్‌లు చేయడం వల్ల కేవలం ఛాతీ , ట్రైసెప్స్ వంటి శరీర ముందు భాగాలు మాత్రమే బలంగా మారుతాయి, కానీ వీపు (Back) భాగంపై దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల బాడీ పోస్చర్ దెబ్బతినే అవకాశం ఉంది.
అందుకే నిపుణులు పుష్-అప్‌లతో పాటు శరీరాన్ని సమతుల్యంగా ఉంచడానికి పుల్-అప్‌లు (Pull-ups), డిప్స్ , స్క్వాట్స్ (Squats) వంటి ఇతర వ్యాయామాలను కూడా మీ రోజువారీ దినచర్యలో భాగం చేసుకోమని సిఫార్సు చేస్తున్నారు.
విశ్రాంతి ప్రాముఖ్యత మీకు ప్రతిరోజూ 100 పుష్-అప్‌లు చేయడంలో తీవ్రమైన నొప్పి లేదా ఇబ్బంది ఎదురవుతుంటే, మీ కండరాలకు తగినంత విశ్రాంతి లభించడం లేదని అర్థం. కండరాలు బలోపేతం కావడానికి , వ్యాయామం వల్ల అలసిపోయిన కణజాలాలు మళ్లీ సాధారణ స్థానానికి రావడానికి కనీసం 48 గంటల పాటు విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. కండరాలకు గ్యాప్ ఇవ్వకుండా నిరంతరం ఒత్తిడికి గురిచేయడం వల్ల కండరాలు పట్టేయడం లేదా జాయింట్ ఇంజూరీలు (కీళ్ల గాయాలు) వంటి ఇతర తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి వారంలో కనీసం ఒక రోజు పూర్తిగా వర్కవుట్లకు బ్రేక్ ఇచ్చి శరీరానికి విశ్రాంతిని ఇవ్వడం ఎంతో శ్రేయస్కరం.
గమనిక : ఈ కథనంలో అందించబడిన ఫిట్‌నెస్ సమాచారం , సూచనలు కేవలం అంతర్జాతీయ వ్యాయామ నిపుణుల నివేదికలు , సాధారణ అవగాహన ఆధారంగా సేకరించబడినది మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మీకు ఏవైనా ఎముకలు లేదా కీళ్ల నొప్పుల సమస్యలు ఉంటే, కొత్త వ్యాయామాలు ప్రారంభించే ముందు ఖచ్చితంగా అర్హత కలిగిన ఫిట్‌నెస్ ట్రెయినర్ లేదా వైద్యుడిని సంప్రదించాల్సిందిగా మనవి.
