పెరుగులో చక్కెర వేసి తినడం వలన కలిగే లాభాలు ఇవే!

Samatha

28 June 2026

పెరుగు చాలా మందికి ఇష్టం ఉంటుంది. అయితే కొంత మంది దీనిని అన్నంలో తింటే, మరికొంత మంది మజ్జిగలా తీసుకుంటారు.

పెరుగు

ఇక కొంత మంది అయితే ఏకంగా పెరుగులో చక్కెర వేసుకొని తింటారు. మరి ఇలా పెరుగు చక్కెర కలుపుకొని తినడం మంచిదేనా? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.

చక్కెర పెరుగు

పెరుగు చక్కెర కలిపి తీసుకోవడం వలన ఇది శరీరంలో వేడిని తగ్గించి, డీ హైడ్రేషన్ రాకుండా చేస్తుంది. అంతే కాకుండా శరీరానికి తక్షిణ శక్తిని అందిస్తుంది.

శరీరంలో వేడి తగ్గడం

అలాగే ఎవరు అయితే నీరసం వంటి సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఇది చాలా బెస్ట్, ఇలా తినడం వలన నీరసం వంటి సమస్యలు త్వరగా తగ్గిపోతాయి.

నీరసం తగ్గడం

జీర్ణక్రియ ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది చేస్తుంది. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉండటం వలన ఇది గట్ హెల్త్‌కు చాలా అద్భుతంగా పని చేస్తుంది.

జీర్ణక్రియ ఆరోగ్యం

కడుపులో ఉన్న చెడు బ్యాక్టీరియాను తగ్గించి, గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి అనేక సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.

కడుపు ఆరోగ్యం

అంతే కాకుండా చాలా మంది శరీరంలో అధిక వేడి వలన నోటిలో పుండ్లు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతారు. అలాంటి వారికి ఇది చాలా బెస్ట్ అని చెప్పాలి.

అధిక వేడికి చెక్

అదే విధంగా నిద్రలేమి సమస్యను తరిమి కొట్టి, ప్రశాంతమైన నిద్రను అందిస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి ఇది చాలా బెస్ట్.

నిద్రలేమి