Chronic Kidney Disease: ఈ లక్షణాలు మీలో కూడా కనిపిస్తే ఆలస్యం చేయకండి.. ఆ వ్యాధి సైలెంట్‌ కిల్లర్‌!

|

Nov 23, 2023 | 11:13 AM

కిడ్నీలు మానవ శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. అవి పరిమాణంలో చిన్నవి అయినప్పటికీ మొత్తం ఆరోగ్యంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి 30 నిమిషాలకు శరీర రక్తాన్ని మూత్రపిండాలు ఫిల్టర్ చేస్తాయి. ఎప్పటికప్పుడు శరీరం నుంచి వ్యర్థ పదార్థాలు, టాక్సిన్స్, ద్రవాలను తొలగించి ఆరోగ్యంగా ఉంచుతాయి. కిడ్నీ ఆరోగ్యం మన రోజువారీ జీవితాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. అయితే జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్లు మూత్రపిండాల పనితీరు తగ్గించే అవకాశం ఉంది. అందువల్లనే మన దేశంలో

Chronic Kidney Disease: ఈ లక్షణాలు మీలో కూడా కనిపిస్తే ఆలస్యం చేయకండి.. ఆ వ్యాధి సైలెంట్‌ కిల్లర్‌!
Chronic Kidney Disease
Follow us on

కిడ్నీలు మానవ శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. అవి పరిమాణంలో చిన్నవి అయినప్పటికీ మొత్తం ఆరోగ్యంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి 30 నిమిషాలకు శరీర రక్తాన్ని మూత్రపిండాలు ఫిల్టర్ చేస్తాయి. ఎప్పటికప్పుడు శరీరం నుంచి వ్యర్థ పదార్థాలు, టాక్సిన్స్, ద్రవాలను తొలగించి ఆరోగ్యంగా ఉంచుతాయి. కిడ్నీ ఆరోగ్యం మన రోజువారీ జీవితాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. అయితే జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్లు మూత్రపిండాల పనితీరు తగ్గించే అవకాశం ఉంది. అందువల్లనే మన దేశంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది.

మూత్రపిండాల వ్యాధికి ప్రధాన కారణం ఏమిటి?

మానవ శరీరంలోని రెండు మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతిన్నప్పుడు, రక్తాన్ని ఫిల్టర్ చేయడంలో విఫలం అవుతాయి. కిడ్నీలు సరిగా పనిచేయకపోవడం వల్ల శరీరంలో ద్రవం, వ్యర్థాల పరిమాణం గణనీయంగా పెరుగుతుంది. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి అనేక సమస్యలకు కారణం అవుతుంది. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి కారణంగా మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, ఊబకాయం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. అందుకే కిడ్నీ వ్యాధిని సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. ఫలితంగా ఈ సమస్య శరీరంలో క్రమంగా పెరుగుతుంది. దీనిని గుర్తించడం చాలా కష్టం అవుతుంది. ఈ వ్యాధిని గుర్తించడానికి క్రమం తప్పకుండా రక్తం, మూత్ర పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహం ఉన్న వ్యక్లులు క్రమం తప్పకుండా రక్తం, మూత్ర పరీక్షలు చేయించుకోవాలి. ఈ విధంగా కిడ్నీ వ్యాధిని గుర్తించి తీవ్రతను తగ్గించవచ్చు.

మూత్రపిండాల వ్యాధి ప్రారంభ లక్షణాలు

కిడ్నీ వ్యాధి సమస్య పెరిగినప్పుడు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. అవేంటంటే..

  • శరీరంలో బరువు తగ్గడం
  • విపరీతమైన ఆకలి
  • చీలమండలలో వాపు
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
  • అలసట
  • మూత్రంలో రక్తం ఉండటం
  • తలనొప్పి

దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి కారణంగా రక్తహీనత, ఇన్ఫెక్షన్లు వంటివి వస్తాయి. కాల్షియం స్థాయి తగ్గడం, పొటాషియం, ఫాస్పరస్ స్థాయి పెరగడం జరుగుతుంది. కిడ్నీ వ్యాధి రాకుండా నివారించడానికి రెగ్యులర్‌గా రక్తం, మూత్ర పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. కిడ్నీ వ్యాధుల ప్రమాదాన్ని నివారించడానికి, ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడంతోపాటు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.