
ప్రస్తుతం చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఎదుర్కొనే సమస్యల్లో బీపీ కూడా ఒకటి. కొందరికి హైబీపీ ఉంటే.. మరికొందరికి లో బీపీ ఉంటుంది. చాలా మంది హైబీపీతో ప్రమాదం అని అంటారు. కానీ లోబీపీ ఉన్నవారికే డేంజర్ ఎక్కువ అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అదే విధంగా హైబీపీ రావడానికి సరైన కారణాలు అంటూ ఏమీ ఉండవు. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. మీ ఆరోగ్యం వచ్చే చిన్న చిన్న మార్పులను ముందుగానే పసిగడితే దీన్ని దూరం చేసుకోవచ్చు. అయితే మీ ఆహారంలో కొన్ని రకాల మార్పులు చేసుకోవడం వల్ల హైబీపీని అదుపు చేయవచ్చు. ఇటీవల జరిగిన అధ్యయనాల ప్రకారం టమాటా తినడం వల్ల హైబీపీని కంట్రోల్ చేయవచ్చని తేలింది. ఇంతకీ ఇది నిజమేనా? నిపుణులు ఏం అంటున్నారో ఇప్పుడు చూద్దాం.
టమాటాలు నిత్యవసర వస్తువు. టమాటా లేకపోతే ఆ కూరలో రుచే ఉండదు. అందుకే రేటు ఎక్కువైనా తక్కువైనా కొంటారు. ఒక్క కాయ వేసినా ఆ కూర రుచే మారిపోతుంది. టమాటాలో విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్ వంటివి ఉంటాయి. ఇవి మూడూ శరీరానికి మంచి చేసేవే. టమాటాలో ఉండే లైకోపీన్ గుండెకు చాలా మంచి చేస్తుంది. రోజుకు 110 గ్రాముల కంటే ఎక్కువ టమాటాలు తినడం వల్ల అధిక రక్త పోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందని ఓ అధ్యయనంలో తేలింది. పొటాషియం ఉన్న ఆహారాలు తీసుకుంటే బీపీ నుంచి బయట పడొచ్చు. అంతే కాకుండా దీర్ఘకాలిక గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అయితే మరీ ఎక్కువగా కాకుండా సమతుల్యంగా టమాటాను తీసుకుంటే మంచిదే.
* బరువును అదుపులో ఉంచుకోవాలి.
* వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.
* ఉప్పు, కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోకూడదు.
* మధ్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి.
* ఒత్తిడిని, కోపం, ఆందోళన వంటి వాటిని అదుపులో ఉంచుకోవాలి.
* పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.
ఇలా మీ లైఫ్ స్టైల్‌లో పలు మార్పులు చేసుకోవడం వల్ల హైబీపీని కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. అదే విధంగా మసాలాలు, ఉప్పు, కొవ్వు ఉన్న ఆహార పదార్థాలు తక్కువగా తీసుకుంటూ ఉంటే.. హైబీపీ రాకుండా జాగ్రత్త పడొచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.