Interesting Facts: బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా.. నిపుణులు ఏం అంటున్నారంటే!

|

Jan 29, 2024 | 6:17 PM

శరీరం మెరుస్తూ హైడ్రేట్‌గా ఉండాలంటే.. నీరు ఖచ్చితంగా కావాలి. నీళ్లు సరిగ్గా తాగితే శరీరమైనా.. లోపల ఉండే ఆర్గాన్స్ అయినా హెల్దీగా ఉంటాయి. హెల్దీ ఫుడ్ తినకపోవడం, మారిన లైఫ్ స్టైల్, నీరు సరిగ్గా తాగక పోవడం వల్ల శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిల్లో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటం కూడా ఒకటి. ఇది ఈ రోజుల్లో సర్వ సాధారణంగా మారిపోయింది. నిజానికి కిడ్నీల్లో రాళ్లు ఉండటం వల్ల చాలా నొప్పిని కలిగిస్తుంది. అంతే కాకుండా ఇతర వ్యాధులకు కూడా..

Interesting Facts: బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా.. నిపుణులు ఏం అంటున్నారంటే!
Kidney Stones
Follow us on

శరీరం మెరుస్తూ హైడ్రేట్‌గా ఉండాలంటే.. నీరు ఖచ్చితంగా కావాలి. నీళ్లు సరిగ్గా తాగితే శరీరమైనా.. లోపల ఉండే ఆర్గాన్స్ అయినా హెల్దీగా ఉంటాయి. హెల్దీ ఫుడ్ తినకపోవడం, మారిన లైఫ్ స్టైల్, నీరు సరిగ్గా తాగక పోవడం వల్ల శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిల్లో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటం కూడా ఒకటి. ఇది ఈ రోజుల్లో సర్వ సాధారణంగా మారిపోయింది. నిజానికి కిడ్నీల్లో రాళ్లు ఉండటం వల్ల చాలా నొప్పిని కలిగిస్తుంది. అంతే కాకుండా ఇతర వ్యాధులకు కూడా దారి తీస్తుంది. మూత్ర పిండాల్లో పేరుకుపోయిన స్పటిక పదార్థాన్నే రాళ్లు అని అంటారు. మూత్రంలో క్యాల్షియం, ఆక్సలేట్ ఎక్కువగా పెరగడం వల్ల ఈ రాళ్లు అనేవి ఏర్పడతాయి. ఈ సమస్యను సరైన సమయంలో గుర్తించి.. చికిత్స తీసుకుంటేనే దీని నుంచి త్వరగా బయట పడగలరు. అయితే మూత్ర పిండలో రాళ్లను తగ్గించడంలో అనేక అపోహలు వినిపిస్తున్నాయి. మరి అవేంటి? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు పాలు లేదా పాల ఉత్పత్తులు తీసుకోకూడదా..

మూత్ర పిండాల్లో రాళ్లు ఉన్నప్పుడు పాలు లేదా పాల ఉత్పత్తులకు చాలా దూరంగా ఉండాలని కొందరు నమ్ముతారు. దీన్ని ఫాలో కూడా అవుతూ ఉంటారు. కానీ నిజానికి పాలు లేదా పాల ఉత్పత్తులు తినడం లేదా తాగడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవ్వవు అని నిపుణులు అంటున్నారు. క్యాల్షియం లోపం ఉన్నా లేక క్యాల్షియం మరీ ఎక్కువైనా కిడ్నీలో రాళ్లు అనేవి మరింత పెరుగుతాయి.

మందులు కిడ్నీలో రాళ్ల పరిమాణాన్ని తగ్గిస్తాయా..

మూత్ర పిండాల్లో రాళ్లను కొన్ని మందులతో కరిగించవచ్చని అంటారు. కానీ వాస్తవానికి ఇది కేవలం 10 శాతం కేసుల్లో మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే మందుకు రాళ్ల నిర్మాణం, పరిమాణాల ప్రతి స్పందన మారుతూ ఉంటాయని నిపుణులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

శస్త్ర చికిత్స తర్వాత మళ్లీ కిడ్నీలో స్టోన్స్ ఏర్పడతాయా..

శస్త్ర చికిత్స చేయించినా లేదా మందులతో కిడ్నీ స్టోన్స్ కరిగించినా.. మూత్ర పిండాల్లో రాళ్లు అనేవి మళ్లీ పునరావృతం అయ్యే అవకాశాలు 50 శాతం వరకూ ఉంటాయని వైద్యులతో పాటు పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

బీర్ తాగితే కిడ్నీ స్టోన్స్ కరుగుతాయా..

బీర్ తాగితే కిడ్నీ రాళ్లు కరుగుతాయని చాలా మంది చెబుతూ ఉంటారు. బీర్‌లో నీళ్లతో పాటు ఆల్కహాల్ కూడా ఉంటుంది. ఇది గ్యాస్టైటిస్, కాలేయం దెబ్బ తినడానికి కారణం అవుతుంది. కాబట్టి ఇందులో నిజం లేదు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.