భోజన ప్రియులకు ప్రత్యేకమైన బుక్వీట్ దోశ.. ఇలా చేస్తే సులభంగానే రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్ మీ ముందు..
బుక్వీట్ అంటే పండ్ల విత్తనాలు. ఇవి సోరెల్, నాట్వీట్, ర్హుబల్స్ వంటి జాతికి చెందనది. ఇందులో ఆమైనో ఆమ్లాలతోపాటు ఫైపర్ యాంటీఆక్సిడెంట్స్, మెగ్నీషియం కూడా సమృద్ధిగా ఉంటుంది.
బుక్వీట్ అంటే పండ్ల విత్తనాలు. ఇవి సోరెల్, నాట్వీట్, ర్హుబల్స్ వంటి జాతికి చెందనది. ఇందులో ఆమైనో ఆమ్లాలతోపాటు ఫైపర్ యాంటీఆక్సిడెంట్స్, మెగ్నీషియం కూడా సమృద్ధిగా ఉంటుంది. ఈ బుక్వీట్తో రుచికరమైన వంటలను రెడీ చేయవచ్చు. పిండికి ప్రత్యామ్నాయంగా ఈ కుట్టు పనిచేస్తుంది. దీనివలన అనేక రకాల ఆరోగ్య ప్రయజనాలున్నాయి. అయితే దీంతో రుచికరమైన దోశను వెయ్యోచ్చు. అదెలాగో మీరు ఒక్కసారి ట్రై చేయండి.
సౌత్ ఇండియాలో అల్పహారంగా తీసుకునే ఆహారపదార్థాలలో దోశ ఒకటి. తేలికపాటి.. రుచికరమైన అల్పహారం ఇది. పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టపడుతుంటారు. సాధారణంగా బియ్యం పిండి, మినపప్పు కలిపి దోశలను వేస్తారు. దోశలలో చాలా రకాలుంటాయి. ఇక పిండితోపాటు అర్బి, బుక్వీట్ పిండి, ఎర్రకారం, పచ్చిమిర్చి, ఉప్పు వేసి చేయడం వలన చాలా సమయం వరకు మెత్తగా ఉంటుంది. మరీ అదేలా చేస్తారో తెలుసుకుందాం.
కుట్టు కోసం కావల్సిన పదార్థాలు..
✢ నెయ్యి. ✢ ఉడకబెట్టిన మూడు బంగాళాదుంపలు. ✢ ఉప్పు ✢ అరటీస్పూన్ కారం ✢ అర టీ స్పూన్ తరిగిన అల్లం.
దోశ కోసం కావల్సినవి..
✢ బుక్వీట్ పిండి కుట్టు 5 టేబుల్ స్పూన్లు, ✢ ఉడకబెట్టిన అర్బి (కోలోకాసియా) 2 టేబుల్ స్పూన్స్ ✢ ఉప్పు ✢ అజ్వైన్ (క్యారమ్ సీడ్స్) అర టీస్పూన్ ✢ తరిగిన అల్లం 1 టీస్పూన్ ✢ తరిగిన పచ్చిమిర్చి 1 టీస్పూన్ ✢ కాచిన నెయ్యి
పొటాటో ఫిల్లింగ్ తయారీ విధానం..
ముందుగా ఒక బాణాలి తీసుకొని అందులో నెయ్యి వేడిచేయాలి. ఆ తర్వాత బంగాళా దుంపలను చూర్ణం చేసి మిగిలిన పదార్థాలతో కలపాలి. బంగాళదుంప మిశ్రమాన్ని లేత గోధుమ రంగు వచ్చేవరకు కొన్ని నిమిషాలు వేయించాలి. ఆ తర్వత మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.
దోశ తయారీ విధానం…
ముందుగా ఒక గిన్నెలో అర్బిని మాష్ చేసి పిండి, ఉప్పు వేసి కలపాలి. అందులో కోన్ని నీళ్లు పోసి కలుపుతూ ఉండాలి. అనంతరం అజ్వైన్, కారం, అల్లం, పచ్చిమిర్చి వేసి మళ్ళీ కలపాలి. పిండి మృదువుగా మారేంతవరకు నీరు వేస్తూ కలపాలి. ఇక ఒక ఫ్లాట్ పాన్ వేడి చేసి… దానిపై కొంచెం నెయ్యి వేసి, దోశ వెయ్యాలి. కొన్ని నిమిషాల వరకు ఉడకనిచ్చి.. అంచులు క్రిస్పిగా రావాలంటే దాని చుట్టూ ఎక్కువ నెయ్యి వెయాలి. రెండువైపుల దోశను సరిగ్గా కాల్చుకోవాలి. ఆ తర్వాత దానిపై కొంద పోటాటో ఫిల్లింగ్ వేసి దోశను మడతపెట్టాలి. అంతే రుచికరమైన బుక్వీట్ మీ చేతిల్లో ఉంటుంది. దీనిని పుదీనా, కొబ్బరి పచ్చడితో తింటే మైమరచిపోతారంటే నమ్మండి.
Also Read:
మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా అటుకుల పులిహోర (పోహా).. కేవలం10 నిమిషాల్లోనే.. తింటే మైమరచిపోవాల్సిందే..