AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ జంతువు పాలు తాగితే గంటకు 5 కిలోల బరువు పెరుగుతారట.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన..

ప్రపంచంలోనే అతిపెద్ద జీవి ఇచ్చే పాలు తాగితే అత్యంత వేగంగా బరువు పెరుగుతారు. ఒక లీటర్‌ పాలలో ఏకంగా 50శాతం కొవ్వు ఉంటుంది. అందుకే తిమింగలం పిల్ల గంటకు 5 కిలోలు పెరుగుతుంది. టూత్‌పేస్ట్ అంత మందంగా, నీలం రంగులో ఉండే ఈ పాలలో ఒమేగా-3 నిధి దాగి ఉందని చెప్పొచ్చు. ఈ అద్భుతమైన పాలు, వాటి ప్రత్యేకతలు, మనుషులకు తాగొచ్చా..? అనే విషయాలు తెలుసుకుందాం..

ఈ జంతువు పాలు తాగితే గంటకు 5 కిలోల బరువు పెరుగుతారట.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన..
Why Blue Whale Milk
Krishna S
|

Updated on: Nov 03, 2025 | 6:31 PM

Share

ప్రపంచంలోకెల్లా అతిపెద్ద జీవి అయిన నీలి తిమింగలం పాలు ఒక పెద్ద మిస్టరీ. ఇది చాలా పోషకాలతో నిండి ఉంటుంది. దాని అసాధారణ లక్షణాల కారణంగా ఈ పాలు ఎప్పుడూ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. ఈ పాలు తిమింగలం పిల్లల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. ఒక లీటరు నీలి తిమింగలం పాలలో ఏకంగా 50శాతం కొవ్వు ఉంటుంది. ఇది మనం తాగే ఆవు పాలు కంటే దాదాపు 12 రెట్లు ఎక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. తిమింగలం పిల్ల తన తల్లి పాలు తాగడం ద్వారా ప్రతి గంటకు 4 నుండి 5 కిలోల బరువు పెరుగుతుంది. దీని కారణంగా తిమింగలం పిల్ల ఒక రోజులో ఏకంగా 100 కిలోల వరకు బరువు పెరుగుతుంది. కేవలం ఆరు నెలల్లోపు నీలి తిమింగలం పిల్ల 25 టన్నుల భారీ బరువును చేరుకోగలుగుతుంది. ఆహారం కొరత ఉన్న అంటార్కిటికా వంటి ప్రదేశాలకు సుదీర్ఘ ప్రయాణాలు చేసే తల్లి తిమింగలాలకు ఈ వేగవంతమైన పెరుగుదల అవసరం.

ఆశ్చర్యపరిచే విషయాలు

తల్లి నీలి తిమింగలం రోజుకు ఏకంగా 200 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ పాలలో సుమారు 12శాతం ప్రోటీన్ ఉంటుంది. ఈ పాలు సాధారణ పాలలా కాకుండా టూత్‌పేస్ట్ లాగా చాలా మందంగా ఉంటాయి. దీని కారణంగా అవి నీటిలో కరిగిపోవు. ఈ పాలు క్రీమీగా, మందంగా, కొద్దిగా నీలం రంగులో ఉంటాయి.

పాలు ఇచ్చే విధానం: ఇతర క్షీరదాల మాదిరిగానే తిమింగలాలు కూడా తమ పిల్లలకు పాలిస్తాయి. నీటి అడుగున తల్లి తిమింగలం కండరాల చర్య ద్వారా భారీ ధార రూపంలో పాలను విడుదల చేస్తుంది. దానిని పిల్ల తిమింగలం వెంటనే తాగుతుంది.

మనుషులు తాగొచ్చా

సాధారణంగా మన జీర్ణవ్యవస్థ అంత పెద్ద మొత్తంలో కొవ్వును జీర్ణం చేసుకోలేక, వికారం కలుగుతుంది కాబట్టి ఈ పాలు మానవులకు త్రాగడానికి సరిపోవు. అయితే 2025లో నిర్వహించిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. నీలి తిమింగలం పాలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయని తేలింది.

గుండె ఆరోగ్యం: ఈ పాలను నేరుగా తాగడం మంచిది కానప్పటికీ దాని నుండి సేకరించిన ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను సరిగ్గా ఉపయోగిస్తే.. అవి మానవ గుండె ఆరోగ్యానికి గొప్ప మేలు చేస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు. అందుకే దాని ప్రత్యేక పోషక ప్రయోజనాలను అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఈ పాలను సేకరించే ప్రయత్నాల్లో ఉన్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మీరు బంగారంపై రుణం తీసుకుంటున్నారా? మీకో భారీ గుడ్‌న్యూస్‌..!
మీరు బంగారంపై రుణం తీసుకుంటున్నారా? మీకో భారీ గుడ్‌న్యూస్‌..!
బ్యాట్‌మ్యాన్‌లా దొంగల వేట,పట్టుకుని స్తంభాలకు కట్టేస్తున్న హీరో?
బ్యాట్‌మ్యాన్‌లా దొంగల వేట,పట్టుకుని స్తంభాలకు కట్టేస్తున్న హీరో?
నల్లమల వెళ్లే పర్యాటకులకు బిగ్ అలర్ట్.. అమ్రాబాద్‌లో టైగర్ సఫారీ
నల్లమల వెళ్లే పర్యాటకులకు బిగ్ అలర్ట్.. అమ్రాబాద్‌లో టైగర్ సఫారీ
పడకగదిలో ప్రియుడితో భార్యను చూసిన భర్త షాక్.. కట్ చేస్తే..!
పడకగదిలో ప్రియుడితో భార్యను చూసిన భర్త షాక్.. కట్ చేస్తే..!
ఓటీటీలో సమంత 'మా ఇంటి బంగారం'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలో సమంత 'మా ఇంటి బంగారం'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తీసిన సన్నివేశాలు ఇవే..
సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తీసిన సన్నివేశాలు ఇవే..
ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..
ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..