
దేశంలో న్యూ ఇయర్ సందడి మొదలైంది. గతం గత: అనే చందంగా ప్రతి ఒక్కరూ తమలో ఉన్న అలవాట్లను మార్చుకుని నూతన సంవత్సరంలో కొత్తగా ఉండాలని ప్రయత్నిస్తుంటారు. ఈ సాధన ఎక్కువుగా మనం విద్యార్థుల్లో చూడవచ్చు. చదువులో వెనుకబడినా, వ్యాయామం చేయడంలో అలసత్వం వహించినా వారు నూతన సంవత్సరంలో మారాలని కోరుకుంటుంటారు. ఇలా చేయడం ద్వారా విశ్వాసం, ఆత్మ గౌరవం పెరుగుతుంది. లక్ష్యాలను నిర్ధేశించుకుంటే ఆత్మ విశ్వాసం బయటకొస్తుంది. కాబట్టి విద్యార్థులకు ఉపయోగపడే బెస్ట్ న్యూ ఇయర్ రిజుల్యూషన్స్ మీ ముందుకు తీసుకొచ్చాం. వాటిపై ఓ లుక్కెద్దాం.
కొత్త సంవత్సరంలో చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టి మరింత మెరుగైన ఫలితాలను సాధించాలి. ఇలా చేస్తే గుర్తింపుతో పాటు ఆత్మగౌరవం పెరుగుతుంది. మెరుగైన గ్రేడ్ లు సాధించడానికి ప్రణాళిక వేసుకుని చదువుకోవడం ముఖ్యం.
శారీరక బలం కోసం వ్యాయామం చేయడం ఉత్తమం. ఉదయాన్నే లేచి వ్యాయామం చేస్తే చక్కటి శరీరాకృతి పొందుతారు. వ్యాయమం చేయడం వల్ల మానసిక పరిస్థితి మెరుగు అవ్వడమే కాక, ఒత్తిడి తగ్గించడంలో సాయం చేస్తుంది. వారంలో కొన్ని రోజులు వ్యాయామానికి కేటయిస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి.
విద్యార్థులు మిమ్మల్ని మీరు మరింత మెరుగుపర్చుకోడానికి సమయ పాలన పాటించడం మరింత ముఖ్యం. ఎందుకంటే స్కూల్ లో గడిపే సమయం, ఇంట్లో చదువుకునే సమయం, వ్యాయామం చేసే సమయం అంటూ కొంచెం నిర్ధిష్ట ప్రణాళిక అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇలా చేస్తే మన నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడానికి మరింత సమయం కృషి చేయడానికి అవకాశం ఉంటుంది.
విద్యార్థి దశ నుంచే ఆర్థిక అక్షరాస్యత ఎంతో ముఖ్యం. డబ్బు ఖర్చు చేసే సమయంలో ఆచితూచి వ్యవహరించాలి. మన అవసరాలకు తగినట్లుగా ఖర్చు చేసి మిగిలిన సొమ్మును ఆదా చేస్తే భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది. అలాగే చిన్నతనం నుంచి ఖర్చులను తగ్గించుకోవడం అలవాటు అవుతుంది.
ఈ దశ నుంచే చదువు మాత్రమే వేరే ఇతర వ్యాపకంపై ఆసక్తి పెంచుకోవాలి. ఏదైనా క్రీడలో కానీ, సంగీత వాయిద్యం నేర్చుకోవడం వంటి అభిరుచికి కలిగిన పనులు చేస్తే ఆ పనిలో విద్యార్థి నైపుణ్యం మరింత పెరుగుతుంది.
ప్రస్తుత సమాజంలో ఒత్తిడి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో తప్పనిసరైంది. విద్యార్థి దశ నుంచి ఒత్తిడిని తగ్గించుకోడానికి తగిన కార్యాచరణ అమలు చేయాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడిపితే మంచి ఫలితాలు. అలాగే శారీరక అలసట నుంచి ఉపశమనానికి తగిన నిద్ర కూడా అవసరమని గుర్తుంచుకోవాలి.
మంచి ఆహారం అనేది ఈ దశలో మంచి బలాన్ని ఇస్తుంది. అలాగే మూడ్ ను స్థిరీకరించడంతో పాటు ఆరోగ్యంపై ఎలాంటి పడుకుండా చేస్తుంది. కాబట్టి మంచి కూరగాయలు, పండ్లు వంటి ఆహారాలు తీసుకుంటే మంచిది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..