Good Eyesight Tips: కంటి సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే చురుకైన కంటి చూపు మీ సొంతం

| Edited By: Anil kumar poka

Mar 02, 2023 | 4:45 PM

ఆస్టిగ్మాటిజం, మయోపియా లేదా హైపరోపియా వంటి ఏదైనా తీవ్రమైన కంటి పరిస్థితులకు చికిత్స చేయడంలో కంటి వ్యాయామాలు ప్రభావవంతంగా ఉండవని వైద్య నిపుణులు చెబుతున్నా వక్రీభవన లోపాలు మాత్రం కంటికి సరైన పద్ధతిలో వ్యాయామం చేస్తే తొలగిపోతాయని సూచిస్తున్నారు.

Good Eyesight Tips: కంటి సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే చురుకైన కంటి చూపు మీ సొంతం
Eye Site
Follow us on

మారుతున్న జీవనశైలి మేరకు ప్రతి ఒక్కరినీ ఏదో ఓ సమస్యలు వేధిస్తూ ఉంటాయి. శరీర సమస్యలు వేధిస్తూ వ్యాయామం చేయడం ద్వారా వాటి నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు వంటి వాడకం పెరగడం వల్ల కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా చిన్న వయస్సులోనే కంటి సంబంధిత సమస్యలు ఇబ్బందిపెడతున్నాయి. కంటి సమస్యల నుంచి బయటపడడానికి కొన్ని రకాల వ్యాయాలు ఉన్నాయని కంటి వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆస్టిగ్మాటిజం, మయోపియా లేదా హైపరోపియా వంటి ఏదైనా తీవ్రమైన కంటి పరిస్థితులకు చికిత్స చేయడంలో కంటి వ్యాయామాలు ప్రభావవంతంగా ఉండవని వైద్య నిపుణులు చెబుతున్నా వక్రీభవన లోపాలు మాత్రం కంటికి సరైన పద్ధతిలో వ్యాయామం చేస్తే తొలగిపోతాయని సూచిస్తున్నారు. ఐ టర్న్ లేదా స్ట్రాబిస్మస్, లేజీ ఐ లేదా అంబ్లియోపియా, ఐ ట్రాకింగ్ లేదా సకాడిక్ డిస్‌ఫంక్షన్, ఐ టీమింగ్ లేదా కన్వర్జెన్స్ ఇన్‌సఫిసియెన్సీ వంటి కొన్ని కంటి సమస్యలకు విజన్ థెరపీ సమర్థవంతమైన పరిష్కారాలను చూపింది. కళ్లకు సరిగ్గా వ్యాయామం చేయడం గురించి కంటి నిపుణులు సూచించే కొన్ని మార్గాలను తెలుసుకుందాం.

పెన్సిల్ పుష్-అప్‌లు 

పెన్సిల్ పుష్-అప్‌లు ప్రాథమికంగా కళ్ళు ఒకదానికొకటి కదలడానికి లేదా సమీపంలోని వస్తువును చూస్తున్నప్పుడు కలుస్తాయి. పెన్సిల్‌ను చేతికి అందేంత వరకు పట్టుకుని, పెన్సిల్ కొనపై దృష్టి పెట్టి ఫోకస్‌లో ఉంచుతూ పెన్సిల్‌ను నెమ్మదిగా ముక్కుకు దగ్గరగా ఉంచాలి. ఈ ప్రక్రియ అనేక సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

బ్రాక్ స్ట్రింగ్ 

బ్రాక్ స్ట్రింగ్ అనేది విజువల్ సిస్టమ్‌కు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించే ఒక ప్రముఖ విజన్ థెరపీ. వ్యాయామం సమర్థవంతంగా చేయడానికి, స్ట్రింగ్ ప్రతి చివరన ఒక లూప్ కట్టాలి. డోర్క్‌నాబ్‌కి ఒక లూప్‌ను జతచేయాలి. తర్వాత మూడు పూసలను ఉంచాలి. దూరపు పూసను డోర్క్‌నాబ్‌కు దగ్గరగా, మధ్యలో 2-5 అడుగుల దూరంలో, సమీపంలో ఉంచాలి. ముక్కు నుంచి ఒక 6 అంగుళాలు జరుపుతూ చూస్తూ ఉండాలి. వ్యాయామం ట్రాకింగ్, సమలేఖనం, ఫోకస్ చేయడంలో కళ్ళకు గణనీయంగా శిక్షణ ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

అరచేతులతో వ్యాయాయం

ఎడమ అరచేతిని ఆధారంగా చేసుకుని కుడి అరచేతిపై ఉంచి తలకిందులుగా వి ఆకారంలో కదపాలి. ఈ వ్యాయామం చేస్తున్నప్పుడు కచ్చితంగా చేతుల కదలికను కళ్లతో చూడాలి. దీంతో కళ్లకు విశ్రాంతి దొరుకుతుంది. రోజుకు కనీసం ఐదు నిమిషాలు వ్యాయామం చేయవచ్చు.

కళ్లను తిప్పడం

కంటి ఒత్తిడి నుంచి తేలికగా ఉపశమనం పొందడానికి నిటారుగా కూర్చుని, తలను నిశ్చలంగా ఉంచి, కుడివైపునకు, ఆపై పైకప్పుకు, ఆపై ఎడమకు, కింది వైపు నేలకి చూడాలి. ఈ ప్రక్రియను పునరావృతం చేస్తూ ఉండాలి. కొన్నిసార్లు. కళ్లకు ఒత్తిడికి గురైనప్పుడు ఈ వ్యాయామం ఎప్పుడైనా చేయవచ్చు.

20-20-20 నియమం

20-20-20 నియమం ఒక సాధారణ కంటి వ్యాయామం. తరచుగా కంటి నిపుణులచే ఈ వ్యాయామాన్ని సూచిస్తూ ఉంటారు. ప్రత్యేకించి ఎక్కువ సమయం స్క్రీన్‌పై చూస్తూ గడిపే వారు ఎవరైనా 20 నిమిషాల పాటు స్క్రీన్‌ని చూస్తే కనీసం 20 సెకన్ల పాటు వాటి నుంచి 20 అడుగుల దూరంలో ఉన్న వాటి వైపు చూడాలి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం