దానిమ్మ ఆకులో విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, పోటాషియం, ఐరన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతాయి. రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్, ట్రిగ్లైసెరైడ్లను తగ్గించి, రక్తపోటు నియంత్రించడంలో సహాయపడుతాయి. దానిమ్మ ఆకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు క్యాన్సర్‌కు కాణమయ్యే కణాలను త్వరగా పెరగకుండా ఆపటంలో సహాయపడుతాయి. దానిమ్మ ఆకులు రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, పెద్దప్రేగు కాన్సర్ ల చికిత్సలో కూడా సహాయపడుతాయి .
దానిమ్మ ఆకుల కషాయాన్ని ఆయుర్వేదంలో కుష్టు వ్యాధి, చర్మ వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. దురద, తామర వంటి చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతుంటే దానిమ్మ ఆకులను పేస్ట్ చేసి రాసుకుంటే నయమవుతుంది. అంతేకాకుండా శరీరంపై పుండ్లు, గాయాలు త్వరగా తగ్గుతాయి. రోజుకు రెండుసార్లు తీసుకుంటే, సీజనల్ దగ్గు, జలుబు సమస్య నుండి కూడా ఉపశమనం పొందవచ్చు. అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలు తరచుగా వస్తుంటే దానిమ్మ ఆకుల రసాన్ని రోజుకు రెండుసార్లు సేవించవచ్చు.
అలాగే, చెవి ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు దానిమ్మ ఆకులను ఉపయోగించవచ్చు. ఈ ఆకు రసాన్ని నువ్వులు లేదా ఆవనూనెతో కలిపి రెండు చెవుల్లో 2 చుక్కలు వేస్తే చెవి నొప్పి, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్య, నోటిపూత ఉంటే దానిమ్మ ఆకుల రసాన్ని నీళ్లలో కలిపి ఆ నీటితో పుక్కిలించాలి. ఇది నోటి సమస్యలను నివారిస్తుంది.
దానిమ్మ ఆకులులో ఉన్న విటమిన్ సి, ఆంటియాక్సిడెంట్లు జుట్టు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడుతాయి. దానిమ్మ ఆకులు జుట్టు ను బలంగా, చక్కని రంగులో ఉంచటంలో సహాయపడుతాయి. దానిమ్మ ఆకులు చర్మాన్ని మెరిసే క్రిమ్ లాగా ఉపయోగించవచ్చు. ముఖం మీద మొటిమలు తగ్గడానికి ఒక మంచి చిట్కా ఏమిటంటే దానిమ్మ ఆకులను పేస్ట్ చేసి మొటిమల మీద రాసుకోవాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..