Side Effects Of Beetroot: బీట్‌రూట్‌ సూపర్‌ ఫుడ్‌ మాత్రమేకాదు మోస్ట్ డేంజర్‌ కూడా.. ఎందుకో తెలుసుకోండి..

|

Apr 21, 2023 | 1:13 PM

శరీరంలో హెమోగ్లోబిన్ శాతం తగినంత ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. లేదంటే శరీరంలో ఐరన్ తగ్గి రక్తహీనతతో బాధపడాల్సి వస్తుంది. శరీరంలో రక్తకణాలు పెంచుకోడానికి పోషకాలు పుష్కలంగా ఉండే బీట్‌రూట్‌, క్యారెంట్‌ వంటి ఆహారాలను అధికంగా తినమని నిపుణులు సూచిస్తుంటారు. ముఖ్యంగా బీట్‌రూట్‌ను..

Side Effects Of Beetroot: బీట్‌రూట్‌ సూపర్‌ ఫుడ్‌ మాత్రమేకాదు మోస్ట్ డేంజర్‌ కూడా.. ఎందుకో తెలుసుకోండి..
Beetroot
Follow us on

శరీరంలో హెమోగ్లోబిన్ శాతం తగినంత ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. లేదంటే శరీరంలో ఐరన్ తగ్గి రక్తహీనతతో బాధపడాల్సి వస్తుంది. శరీరంలో రక్తకణాలు పెంచుకోడానికి పోషకాలు పుష్కలంగా ఉండే బీట్‌రూట్‌, క్యారెంట్‌ వంటి ఆహారాలను అధికంగా తినమని నిపుణులు సూచిస్తుంటారు. ముఖ్యంగా బీట్‌రూట్‌ను సూపర్ ఫుడ్ అంటారు. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల రక్తహీనత. పీరియడ్స్‌ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. బీట్‌రూట్‌ తినడం వల్ల శరీరంలోని రక్తహీణతను దూరం చేయడంతోపాటు వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. బీట్‌రూట్‌ జ్యూస్‌గా లేదా సలాడ్‌గా కూడా తీసుకుంటారు. అయితే బీట్‌రూట్‌ శరీరానికి మేలు మాత్రమే కాదు కొంత కీడు కూడా చేస్తుంది. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలున్నవారు వీటిని ఆస్సలు తినకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో తెలుసుకుందాం..

నిజానికి.. బీట్‌రూట్‌లలో నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో నైట్రేట్స్ పెరిగితే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కొంతమందికి దుంపలు తింటే కడుపు నొప్పి లేదా జీర్ణ సమస్యలు వస్తాయి. గర్భిణీ స్త్రీలు కూడా దుంపలను తక్కువగా తీసుకోవాలి. దుంపలో జింక్‌, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకుంటే కాలేయం (లివర్‌) దెబ్బతింటుంది.

బీట్‌రూట్‌లో ఆక్సలేట్ కూడా అధికంగా ఉంటుంది. ఇది మోతాదుకు మించి శరీరంలో పెరిగితే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి. ఇప్పటికే కిడ్నీల్లో రాళ్లతో బాధపడుతున్న వారు బీట్‌రూట్‌ తినకపోవడం బెటర్‌. బీట్‌రూట్ రక్తపోటును తగ్గిస్తుంది. కాబట్టి తక్కువ రక్తపోటు ఉన్నవారు కూడా వీటిని తినకూడదు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక గ్లాసు బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల బీపీ స్థాయిలు వేగంగా తగ్గుతాయి. బీట్‌రూట్ అధికంగా తినేవారికి ఎలర్జీ సమస్యలు కూడా వస్తాయని, దాని వల్ల చర్మంపై దురద, దద్దుర్లు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తా కథనాల కోసం క్లిక్ చేయండి.