How to get pink lips naturally: లిప్ స్టిక్ వేసుకోవడం వల్ల పెదవులు నల్లగా మారి, అందవిహీణంగా కనిపిస్తాయి. తగిన జాగ్రత్తలు తీసుకోకుండా అతిగా లిప్ స్టిక్ వాడటం వల్ల పెదవుల రంగు నల్లబడుతుంది. లిప్ స్టిక్ కారణంగానే కాకుండా సాధారణంగా అనేక మంది పెదవులు ముదురు లేదా లేత నలుపు రంగులో చుట్టూ వలయంలా ఏర్పడుతుంది. అందుకు జీవనశైలి అలవాట్లు, వ్యాధులు కూడా కారణంకావచ్చు. అలాగే ధూమపానం, మందుల దుష్ప్రభావాలు, అలర్జీలు, జలుబు, విటమిన్ లోపం, రక్తంలో చక్కెర స్థాయి తగ్గడం మొదలైన ఇతర కారణాల వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. పెదవులు సహజంగా ఎర్రగా మెరవాలంటే ఈ విధంగా చెయ్యండి..
లిప్ స్క్రబ్
పెదవులపై ఉన్న డెడ్ స్కిన్‌ను తొలగించేందుకు.. తేనె, బాదం నూనెను సమాన పరిమాణంలో కలుపుకుని దానిలో కొంచెం చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదవులపై అప్లై చేసి నెమ్మదిగా స్క్రబ్ చేయాలి. ఇలా చేయడం మూలంగా పెదాలు మృదువుగా మారి, క్రమంగా లేత పింక్ కలర్‌లోకి మారుతాయి.
ఈ జాగ్రత్తలు అవసరం..