Beauty Care Tips: నూనె రాసుకున్న తర్వాత జుట్టు రాలుతోందా? అయితే మీరు ఈ తప్పులు చేస్తున్నట్లే..

|

Feb 05, 2022 | 1:03 PM

ఇతర సీజన్లతో పోల్చితే శీతాకాలం(Winter Season) లో జుట్టు పొడిబారడం సర్వసాధారణం. జుట్టు రాలడం(Hairfall) , తలలో చుండ్రు (Dandruff) వంటి సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి.

Beauty Care Tips: నూనె రాసుకున్న తర్వాత జుట్టు రాలుతోందా? అయితే మీరు ఈ తప్పులు చేస్తున్నట్లే..
Follow us on

ఇతర సీజన్లతో పోల్చితే శీతాకాలం(Winter Season) లో జుట్టు పొడిబారడం సర్వసాధారణం. జుట్టు రాలడం(Hairfall) , తలలో చుండ్రు (Dandruff) వంటి సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి.ఈ సమస్యలను అధిగమించాలంటే తలకు నూనె (oil Massage) పట్టించాల్సిందే. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా తయారవ్వడమే కాకుండా కురులు మెరుపును సంతరించుకుంటాయి. అయితే నూనె రాసుకునే సమయంలో చాలామంది కొన్ని తప్పులను చేస్తుంటారు. ఫలితంగా నూనె రాసుకునేటప్పుడు తలలో తరచూ దురద పెడుతుంటుంది. దీనిని అలాగే నిర్లక్ష్యం చేస్తే జుట్టు రాలడం తదితర సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈక్రమంలో జుట్టుకు నూనె పట్టించేటప్పుడు కొందరు తరచూ చేసే కొన్ని తప్పులు, వాటిని ఎలా సరిదిద్దుకోవాలో తెలుసుకుందాం రండి.

వేడి నూనె రాసుకుంటున్నారా?

చాలామంది నూనెను బాగా వేడి చేసుకుని కురులకు పట్టిస్తుంటారు. ఇలా తరచుగా జుట్టుకు వేడి నూనె రాసుకోవడం వల్ల కుదుళ్లు బలహీనపడతాయి. క్రమంగా జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. వేడినూనె రాసుకోవడం వల్ల తల కూడా వేడెక్కుతుంది. ఇది కూడా హెయిర్‌ఫాల్‌కు కారణమవుతుంది. కాబట్టి సీజన్ ప్రకారం జుట్టుకు చల్లని లేదా వేడి నూనెను అప్లై చేయాలి. అయితే సీజన్ ఏదైనా జుట్టుకు గోరువెచ్చని నూనె రాసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

అలా మసాజ్ చేయకండి..

శిరోజాలకు ఆయిల్ మసాజ్ చేసుకునే సమయంలో చాలామంది చేసే తప్పు ఏంటంటే నూనెతో జుట్టును బలంగా రుద్దడం. ఇంకొందరు జుట్టును బాగా లాగి మసాజ్‌ చేస్తుంటారు ఇలా కూడా చేయడం వల్ల వెంట్రుకల కుదుళ్లు బలహీనపడతాయి. క్రమంగా జుట్టు కూడా రాలడం ప్రారంభమవుతుంది. కాబట్టి జుట్టుకు నూనె రాసేటప్పుడు తేలికపాటి చేతులతో మసాజ్‌ చేసుకోవడం ఎంతో ముఖ్యం.

ముడివేసుకోవడంలో..

జుట్టుకు నూనె రాసుకున్న తర్వాత చాలామంది జుట్టును గట్టిగా ముడివేసుకుంటుంటారు. ఇలా చేయడం వల్ల వెంట్రుకల కుదుళ్లపై ఒత్తిడి పడుతుంది. ఫలితంగా శిరోజాలు బలహీనపడి రాలిపోతాయి. ఇక జుట్టుకు నూనె రాసుకున్న తర్వాత చాలామంది అదే పనిగా దువ్వెనతో గట్టిగా దువ్వుకుంటారు. ఇలా చేయడం వల్ల శిరోజాలు దెబ్బతింటాయి.

అలాగే వదిలేస్తే..

జుట్టుకు నూనె రాసుకున్న తర్వాత కొంత సమయం తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. చాలా సార్లు నూనె రాసుకున్న తర్వాత జుట్టును గంటల తరబడి అలాగే వదిలేస్తారు. దీని కారణంగా శిరోజాలు ఆయిలీగా మారిపోతాయి. చుండ్రు ఏర్పడే అవకాశం ఉంది. ఇది కూడా జుట్టు రాలడానికి దోహదం చేస్తుంది.

Also Read:Video Viral: పాపం పెళ్లి కూతురు.. పెళ్లిలో ఆనందంగా పానీపూరి తినాలనుకుంది. కానీ అంతలోనే..

Uric Acid: శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే.. మర్చిపోయి కూడా ఈ ఆహార పదార్థాలను తినకండి

IND vs WI: కోహ్లీ, రోహిత్ జోడీ ఖజానాలో మరో స్పెషర్ రికార్డు.. అదేంటంటే?