బాత్రూమ్‌లో స్మార్ట్‌ఫోన్ అలవాటు ఉందా? ఈ ఆరోగ్య సమస్యలు మీవెంటే..! డాక్టర్ల హెచ్చరిక

కొందరు సిగరెట్ కాలుస్తూ, మరికొందరు న్యూస్ పేపర్స్ చదువుతూ బాత్రూమ్లో ఎక్కువ సేపు ఉంటారు. అయితే, ఇప్పుడు ఇలాంటి వారితో పాటు టాయిలెట్‌కు వెళ్లినప్పుడు కూడా సోషల్ మీడియా స్క్రోల్ చేయడం లేదా వీడియోలు చూడడం చాలా మందికి అలవాటైపోయింది. ఇది సాధారణంగా కనిపించినా, ఈ అలవాటు రాను రాను ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతుందని ఇపుణులు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బాత్రూమ్‌లో స్మార్ట్‌ఫోన్ అలవాటు ఉందా? ఈ ఆరోగ్య సమస్యలు మీవెంటే..! డాక్టర్ల హెచ్చరిక
Smartphone Use In Bathroom

Edited By:

Updated on: Feb 26, 2026 | 5:51 PM

ప్రస్తుతం డిజిటల్ కాలం నడుస్తుంది. కొనదరికి ఉదయం నిద్ర లేవగానే టీ , కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అలా చేయకపోతే వారి దైనందిన దినచర్య లో మలవిసర్జన జరగదు. ఇలాంటి కొందరు సిగరెట్ కాలుస్తూ ఎక్కువ సమయం గడిపితే , మరికొందరు న్యూస్ పేపర్స్ చదువుతూ బాత్రూమ్లో ఎక్కువ సేపు ఉంటారు. అయితే, ఇప్పుడు ఇలాంటి వారితో పాటు టాయిలెట్‌కు వెళ్లినప్పుడు కూడా సోషల్ మీడియా స్క్రోల్ చేయడం లేదా వీడియోలు చూడడం చాలా మందికి అలవాటైపోయింది. ఇది సాధారణంగా కనిపించినా, ఈ అలవాటు రాను రాను ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతుందని ఇపుణులు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అమెరికాలోని ఒక వైద్య పరిశోధనా సంస్థ చేసిన తాజా అధ్యయనంలో, టాయిలెట్‌లో ఎక్కువసేపు స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే వారికి పైల్స్‌ (బవాసీర్) వచ్చే ప్రమాదం, ఫోన్ ఉపయోగించని వారితో పోలిస్తే సుమారు 46 శాతం ఎక్కువగా ఉంటుందని వెల్లడైంది. ఈ పరిశోధన ‘సైంటిఫిక్ జర్నల్’లో ప్రచురించబడింది. వైద్యపరంగా పైల్స్‌ ను హేమరాయిడ్స్ అని అంటారు. ఇది మలద్వార ప్రాంతంలోని నరాలు ఉబ్బిపోవడం వల్ల కలిగే సమస్య. దీని కారణంగా నొప్పి, రక్తస్రావం వంటి సమస్యలు తలెత్తవచ్చు. దీర్ఘకాలం టాయిలెట్‌లో కూర్చోవడం పైల్స్‌కు ముఖ్య కారణాల్లో ఒకటిగా గుర్తించారు.

పరిశోధకులు చెబుతున్న దాని ప్రకారం, టాయిలెట్‌లో కూర్చొని మొబైల్‌లో వీడియోలు చూడటం లేదా సోషల్ మీడియాలో గడపడం వల్ల సమయం ఎలా గడిచిపోతుందో తెలియదు. ఇలాంటి వారు అజ్ఞాతంగా ఎక్కువ సమయం గడుపుతున్నారట. వీరు తమకు తెలియకుండానే ఎక్కువసేపు కూర్చోవడం జరుగుతుంది. దీని వలన మలద్వార ప్రాంతంలోని నరాలపై ఒత్తిడి పెరిగి పైల్స్‌ సమస్య తలెత్తే అవకాశం అధికంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

స్మార్ట్‌ఫోన్ ప్రతి ఒక్కరి రోజువారీ జీవితంలో ఒక ముఖ్య భాగంగా మారిపోయింది. ఉదయం లేవగానే, తినేటప్పుడు, ఖాళీ సమయంలో కూడా ఫోన్ ఉపయోగించడం సాధారణమైంది. ఈ క్రమమంలో జరిగిన అధ్యయనంలో భాగంగా 125 మంది రోగులను పరిశీలించారు. వీరిలో కొంతమంది కోలోనోస్కోపీ కోసం వచ్చినవారు ఉన్నారు. పరిశోధనలో వీరు టాయిలెట్‌లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల పైల్స్‌ ఉందని గుర్తించారు. కోలోనోస్కోపీ అనేది పెద్ద ప్రేగు (కోలోన్) మరియు మలద్వారం లోపలి భాగాన్ని పరీక్షించే వైద్య పరీక్ష. దినిబారిన పడకుండా ఉండాలంటే నిపుణుల సూచనల ప్రకారం టాయిలెట్‌లో అవసరమైనంత సమయం మాత్రమే గడపాలి.

అదేవిధంగా మొబైల్ ఫోన్‌ను టాయిలెట్‌కు తీసుకెళ్లకుండా ఉండటం మంచిది. ఇలాంటి సమస్యతో బాధ పడుతున్నవారు ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం, ఎక్కువ నీరు త్రాగడం మంచిదని నియమిత వ్యాయామం చేయడం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us