Beauty Tips: అరటి తొక్కతో అద్భుతాలు.. ఇలా చేస్తే మీ అందం డబుల్..
అరటిపండు ఆరోగ్యానికి మంచిది. కానీ దాని తొక్క ముఖానికి కూడా మంచిది. అరటిపండు తొక్కను పారవేసే బదులు, ఫేస్ ప్యాక్ తయారు చేసుకోండి. దీన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం మెరుస్తుంది. దాని కోసం, ఇంట్లో దీన్ని ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మెరిసే చర్మం, అందమైన ముఖం కోసం చాలా మంది రకరకాల క్రీములు, ఫేస్ ప్యాక్‌లు ఉపయోగిస్తుంటారు. కానీ వాటిలో ఉండే రసాయనాలు కొన్నిసార్లు దుష్ప్రభావాలకు దారితీస్తాయి. అయితే, ఇంట్లోనే లభించే అరటి తొక్కతో సహజమైన పద్ధతిలో మీ ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చని ప్రకృతి వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మనం పారవేసే అరటి తొక్కలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని సరిగ్గా ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి.
అరటి తొక్క ఫేస్ ప్యాక్ తయారీ విధానం
అరటి తొక్క పేస్ట్: మొదటగా ఒక అరటి తొక్కను చిన్న ముక్కలుగా కట్ చేసి మెత్తని పేస్ట్‌లాగా గ్రైండ్ చేయండి.
ప్యాక్ మిశ్రమం: ఈ పేస్ట్‌లో అర చెంచా బియ్యం పిండి, అర చెంచా చక్కెర కలపండి.
అప్లై చేయడం: ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి, మెడకు అప్లై చేసి అరగంట పాటు ఉంచండి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.
ప్యాక్ ప్రయోజనాలు:
- బియ్యం పిండిలో ఉండే స్టార్చ్ చర్మానికి మెరుపునిచ్చి, బిగుతుగా చేస్తుంది.
- చక్కరలో గ్లైకోలిక్ యాసిడ్ ఉంటుంది, ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది.
- అరటి తొక్కలోని పొటాషియం చర్మాన్ని హైడ్రేట్ చేసి, నల్ల మచ్చలు, టానింగ్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఈ ప్యాక్‌ను క్రమం తప్పకుండా వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
మరికొన్ని పద్ధతులు
అరటి తొక్కను ఇతర పదార్థాలతో కలిపి కూడా ఫేస్ ప్యాక్‌లా ఉపయోగించుకోవచ్చు:
తేనెతో: అరటి తొక్కను మెత్తగా పేస్ట్ చేసి, దానికి కొద్దిగా తేనె కలిపి ముఖానికి అప్లై చేయండి. ఇది చర్మాన్ని మృదువుగా చేసి, తాజాగా కనిపించేలా చేస్తుంది.
పెరుగుతో: అరటి తొక్క పేస్ట్‌లో పెరుగు వేసి బాగా కలపండి. ఈ ప్యాక్‌ను ముఖంపై 15-20 నిమిషాలు ఉంచి తర్వాత శుభ్రం చేసుకోండి.
ఈ సహజ పద్ధతులను ఉపయోగించి ఖర్చు లేకుండా, ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా మీ చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా ఉంచుకోవచ్చు. ఎండ వల్ల ముఖంపై ఏర్పడిన నల్ల మచ్చలు, టానింగ్ సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




