Kitchen Hacks: ఫ్రిడ్జ్ నుంచి చెడు వాసన ఎక్కువగా వస్తుందా.. ఈ చిట్కాలు మీకోసమే!

మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా హై క్లాస్ ఫ్యామిలీ అయినా ఇప్పుడు ఏ ఇంటిలో అయినా కామన్‌గా ఉండే వస్తువుల్లో ఫ్రిజ్‌ కూడా ఒకటి. ఫ్రిడ్జ్ అనేది నిత్యవసర వస్తువుగా మారిపోయింది. దాదాపు ఫ్రిడ్జ్ లేని ఇల్లు అంటూ ఎక్కడా కనిపించదు. ఫ్రిడ్జ్‌ ఉంటే ఎన్నో పదార్థాలను పాడవ్వకుండా ఉంచుకోవచ్చు. సమ్మర్‌లో ఫ్రిడ్జ్‌తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అయితే ఫ్రిడ్జ్‌లో కూరలు, కూరగాయలు, పండ్లు అన్నీ పెడతారు. వీటిని ఒక్కోసారి పెట్టి మార్చిపోతూ ఉంటారు. ఇవి కుళ్లి చెడు వాసన వస్తూ..

Kitchen Hacks: ఫ్రిడ్జ్ నుంచి చెడు వాసన ఎక్కువగా వస్తుందా.. ఈ చిట్కాలు మీకోసమే!
Fridge

Updated on: Feb 09, 2024 | 1:39 PM

మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా హై క్లాస్ ఫ్యామిలీ అయినా ఇప్పుడు ఏ ఇంటిలో అయినా కామన్‌గా ఉండే వస్తువుల్లో ఫ్రిజ్‌ కూడా ఒకటి. ఫ్రిడ్జ్ అనేది నిత్యవసర వస్తువుగా మారిపోయింది. దాదాపు ఫ్రిడ్జ్ లేని ఇల్లు అంటూ ఎక్కడా కనిపించదు. ఫ్రిడ్జ్‌ ఉంటే ఎన్నో పదార్థాలను పాడవ్వకుండా ఉంచుకోవచ్చు. సమ్మర్‌లో ఫ్రిడ్జ్‌తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అయితే ఫ్రిడ్జ్‌లో కూరలు, కూరగాయలు, పండ్లు అన్నీ పెడతారు. వీటిని ఒక్కోసారి పెట్టి మార్చిపోతూ ఉంటారు. ఇవి కుళ్లి చెడు వాసన వస్తూ ఉంటుంది. ఎంత శుభ్రం చేసినా ఈ స్మెల్ అంత ఈజీగా పోదు. కానీ ఈ సారి ఈ సింపుల్ టిప్స్ పాటించి చూడండి. ఫ్రిడ్జ్ నుంచి చెడు వాసనను దూరం చేయవచ్చు. ఇంకెందుకు లేట్ ఆ టిప్స్ ఏంటో చూసేద్దాం.

ఫ్రిడ్జ్ క్లీన్:

చాలా మంది ఫ్రిడ్జ్‌ని అస్సలు క్లీన్ చేయరు. ఏదో పండుగల సందర్భంలో తప్ప.. మిగతా సమయాల్లో దాని సంగతే పట్టించుకోరు. పెట్టినవి ఏంటో కూడా సరిగా గుర్తుండదు. అందేకు ఫ్రిడ్జ్‌ని క్రమం తప్పకుండా గమనిస్తూ.. క్లీన్ చేస్తూ ఉండాలి. ఇలా ఉంటే ఫ్రిడ్జ్ నుంచి చెడు వాసన అనేది రాదు. పండ్లు, కూరగాయలను కూడా ఎప్పటికప్పుడు వాడేయటం మంచిది. ఫ్రిడ్జ్‌లో ఏమైనా ఒలికితే వెంటనే తుడిచేయండి. అల్మారాలు, డ్రాయర్లు, డోర్ సీల్స్‌తో సహా ఫ్రిడ్జ్‌ని అప్పటికప్పుడు తుడుస్తూ ఉండాలి. అంతే కాకుండా ఆహారాలను సరిగ్గా నిల్వ చేయాలి.

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా అనేది ఓ పవర్ ఫుల్ డియోడరైజర్. ఇది ఫ్రిజ్‌లోని చెడు వాసనలను దూరం చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఏదైనా వాసనను పోగొట్టడానికి, వాసన రాకుండా ఉండటానికి.. ఒక చిన్న పేపర్‌లో కట్టి ఒక సైడ్‌కి పెట్టండి. ఇది చెడు వాసనను గ్రహిస్తుంది.

ఇవి కూడా చదవండి

సిట్రస్‌ పండ్లను పెట్టండి:

మీ ఫ్రిడ్జ్‌లో సిట్రస్ జాతికి సంబంధించిన పండ్లు ముఖ్యంగా నిమ్మ కాయలు ఉంచడం వల్ల మీ ఫ్రిడ్జ్ నుంచి మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది. అవసరం అయితే.. నిమ్మ కాయను సగం కట్ చేసి మీ ఫ్రిడ్జ్‌లో సైడ్‌కి పెట్టండి. సిట్రస్‌ పండ్లలో ఉండే గుణాలు.. దుర్వాసనను పోగొడతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.