Bad Breath: నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతోందా? ఈ ఆయుర్వేదిక్‌ చిట్కాలతో చెక్‌ పెట్టండి..

Bad Breath: నోటి దుర్వాసన సమస్య కారణంగా మనతో పాటు ఎదుటివారికి కూడా ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది. తీసుకున్న ఆహారం నోరు , దంతాలు లేదా చిగుళ్ల మధ్య ఇరుక్కుపోయినప్పుడు , ఆహారం అక్కడ కుళ్లిపోయి నోటి నుంచిదుర్వాసన వస్తుంది.

Bad Breath: నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతోందా? ఈ ఆయుర్వేదిక్‌ చిట్కాలతో చెక్‌ పెట్టండి..
Bad Breath
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 02, 2022 | 6:59 AM

Bad Breath: నోటి దుర్వాసన సమస్య కారణంగా మనతో పాటు ఎదుటివారికి కూడా ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది. తీసుకున్న ఆహారం నోరు , దంతాలు లేదా చిగుళ్ల మధ్య ఇరుక్కుపోయినప్పుడు , ఆహారం అక్కడ కుళ్లిపోయి నోటి నుంచిదుర్వాసన వస్తుంది. ఆయుర్వేదం ప్రకారం, నోటి అపరిశుభ్రత, పిత్త దోషం, అజీర్తి సమస్యల కారణంగా నోటి దుర్వాసన సమస్యలు వస్తాయి. అలాగే వెల్లుల్లి, ఉల్లి, పెరుగు తిన్నాక నోరు శుభ్రంగా కడుక్కోకపోయినా నోటి దుర్వాసన వస్తుంది. కాఫీ, టీ, సోడా, జలుబు, దంతక్షయం, మద్య పానం, ధూమపానం వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. మరి ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం రండి.

మెరుగైన ఆహారంతో..

మనం తినే ఆహారాలు అనేక రకాల బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తాయి కాబట్టి  జీర్ణ వ్యవస్థ  ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. పండ్లు, కూరగాయలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల జీర్ణ సమస్యలను అధిగమించవచ్చు. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా అవసరం, కాబట్టి వేయించిన ఆహారాలు, రెడ్ మీట్ మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి.

ఇవి కూడా చదవండి

నీరు బాగా తాగండి.. కాబట్టి శరీరం ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉండాలి. మజ్జిగ, అల్లం, పసుపు వంటివి తీసుకుంటే శరీరంలో నీటి సమతుల్యత ఏర్పడుతుంది. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు శీతల పానీయాలకు దూరంగా ఉండాలి.

మార్నింగ్ ఎనర్జీ డ్రింక్స్ అర గ్లాస్ క్యారెట్ జ్యూస్, అర గ్లాస్ దానిమ్మ రసం, అర గ్లాసు బీట్‌రూట్ జ్యూస్, 10 బాదం పప్పులు, 5 వాల్‌నట్స్, 1 ఏలకులు, 1 లవంగం పసుపు లేదా 1 చెంచా పసుపు పొడి, అన్నింటినీ కలిపి డ్రింక్‌గా తయారుచేసుకుని తాగండి. ఈ ఎనర్జీ డ్రింక్‌ను తరచూ తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన సమస్యలు తగ్గుతాయి.

*నోటి దుర్వాసనకు చెక్ పెట్టేందుకు కొన్ని రకాల మూలికలు నమలాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత కొన్ని సోంపు గింజలు లేదా రెండు పుదీనా ఆకులను నోట్లో వేసుకుని నమలవచ్చు. తులసి ఆకులను నమలడం ద్వారా నోటి దుర్వాసనను దూరం చేసుకోవచ్చు.

* మీ టూత్ బ్రష్ చాలా బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. కాబట్టి ప్రతి నెలా మీ టూత్ బ్రష్ మార్చండి. ప్రతి నెలా సాధ్యం కాకపోతే కనీసం రెండు నెలలకు ఒకసారి బ్రష్‌ని మార్చండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..