పుచ్చకాయ ముక్కలపై మీరూ ఉప్పు చల్లుకుని తింటున్నారా? 

24 April 2025

TV9 Telugu

TV9 Telugu

వేసవిలో అధికంగా వచ్చే పుచ్చకాయలో ప్రోటీన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇది ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది

TV9 Telugu

పుచ్చకాయలో 90 శాతం నీరు ఉంటుంది. వేసవిలో ప్రతిరోజూ దీన్ని తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఇది శరీరానికి చల్లదనాన్ని కూడా అందిస్తుంది

TV9 Telugu

అయితే చాలా మంది పుచ్చకాయను వివిధ రకాలుగా తీసుకుంటూ ఉంటారు. కొంతమంది దానితో జ్యూస్ తయారు చేసి తాగుతారు

TV9 Telugu

అయితే చాలా మంది పుచ్చకాయను ముక్కలుగా కోసి దానిపై ఉప్పు చల్లుకుని తినడానికి ఇష్టపడతారు. ఇలా తీసుకోవడం వల్ల అప్పటికప్పుడు బాగానే ఉన్న ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది

TV9 Telugu

ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇలా ఏదైనా పండుకు ఉప్పు కలిపి తింటే దాని ప్రయోజనాలను పొందలేమని అంటున్నారు

TV9 Telugu

పుచ్చకాయను కోసి వెంటనే తింటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పు జోడించకూడదు. దీనివల్ల శరీరానికి మంచి మొత్తంలో పొటాషియం లభిస్తుంది. ఒంట్లో సోడియం కూడా పెరగదు

TV9 Telugu

పుచ్చకాయలో ఫైబర్ అధికంగా లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో దీన్ని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. మలబద్ధకం, గ్యాస్, విరేచనాలు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు

TV9 Telugu

నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉప్పు చల్లుకుని పుచ్చకాయ మాత్రమే కాదు అసలే పండ్లను తినకూడదు. దీనివల్ల వాటి పోషక విలువలు తగ్గుతాయి